30 వాహనాలు స్వాధీనం
ప్రశాంతంగా కార్పొరేషన్ ఎన్నికలు జరిగేందుకు నిఘా!
నగదు పంపిణీలో కొత్త విధానం ఎంచుకున్న అభ్యర్థులు
విజయవాడ సిపి బత్తిన శ్రీనివాసులు
Bike Thieves Arrested : Vijayawada : ద్విచక్ర వాహనాలు చోరీ చేసే అంతర్రాష్ట నేరస్థులను పట్టుకున్నట్టు విజయవాడ సిపి బత్తిన శ్రీనివాసులు పేర్కొన్నారు.శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పలు వాహనాలను చోరీ చేస్తూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అంతర్రాష్ట దొంగలను పట్టుకున్నామని, సుమారు 30 వాహనాలను, ఒక టాటా ఏసీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని సిపి తెలిపారు. వాటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందన్నారు. ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసు సిబ్బందికి రివార్డులు ఇస్తామన్నారు.
కార్పొరేషన్ ఎన్నికలపై నిఘా!
విజయవాడ కార్పొరేషన్, ఉయ్యూరు నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 194 లోకేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. వీటిలో 135 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. 1870 మంది రౌడీషీటర్లను 110,109 సెక్షన్ల కింద కేసు పెట్టి బైండోవర్ చేసుకున్నామన్నారు. 3 వేల మంది పోలీసులను ఎన్నికల విధులకు ఉపయోగిస్తున్నామన్నారు. మొబైల్ పార్టీలు 62, స్టైకింగ్ ఫోర్స్ 27, స్పెషల్ స్టైకింగ్ ఫోర్సు 12 తో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో నిత్యం ఫ్లాగ్ మార్చింగ్ చేస్తున్నామన్నారు. మద్య, నగదు పంపిణీ జరగకుండా అడ్డుకునేందుకు ప్రత్యేకంగా ఎస్ఈబీ తో పాటు లోకల్ పోలీస్ పగడ్బంధీగా ఏర్పాట్లు చేశామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రూ.36 లక్షల అక్రమ రవాణా నగదుతో పాటు మద్యం సీసాలు కూడా పట్టుకున్నట్టు సీపీ తెలిపారు.

కొత్త విధానంలో డబ్బు పంపిణీ!
ఎన్నికల్లో నగదును కొత్త విధానంలో అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారన్నారు. ఫోన్ పే, గూగూల్ పే, పేటియం ద్వారా నగదు పంపిణీ చేస్తున్నట్టు తమ దృష్టికి నోటీసులు వచ్చాయన్నారు. అలాంటి వాటిపై ప్రత్యేకంగా సైబర్ నిఘాను పెట్టామన్నారు. పోలీసులు ఎక్కడా ఏ పార్టీకి కొమ్ము కాయరాదని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏ పార్టీ వాళ్లు వచ్చి తమకు అన్యాయం జరుగుతుందని, బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఓటర్లు కానీ, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలిగినా 100 కు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
ఇది చదవండి:భర్తకు దూరంగా ఉంటున్న భార్యపై కన్నేసిన పోకిరీలు..చివరికి?
ఇది చదవండి:కృష్ణా జిల్లా టిటిపిలో ముసలం
ఇది చదవండి:రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన చిన్నమ్మ(శశికళ)
ఇది చదవండి:10 life changing Principales
ఇది చదవండి: ఆ జంతువుకు నిజంగానే విముక్తి కలిగింది!