Bike Thieves Arrested

Bike Thieves Arrested : న‌కిలీ తాళంతో 10 బైక్‌లు చోరీ చేసిన దొంగ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

ఎట్ట‌కేల‌కు అరెస్టు చేసిన పోలీసులు

Bike Thieves Arrested : Ananthapur : న‌కిలీ తాళాలు జేబులో ఉంచుకుంటాడు. ఎక్క‌డైనా ద్విచ‌క్ర వాహ‌నం క‌నిపిస్తే త‌న ప‌ని తాను చాకచ‌క్యంగా కానించి సొంత వాహ‌నం తీసుకెళ్తున్న‌ట్టు ద‌ర్జాగా తీసుకెళ్తాడు. ఇలా ఆ దొంగ (Bike Thieves Arrested)10 ద్విచ‌క్ర వాహ‌నాల‌ను చోరీ చేశాడు. ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు చిక్కాడు. క‌ట‌క‌టాల పాల‌య్యాడు.

నకిలీ తాళాలు సాయంతో సులువుగా ద్విచ‌క్ర వాహ‌నాలు ఎత్తుకెళ్లే దొంగ‌ను అనంత‌పురం ప‌ట్ట‌ణం టౌటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇత‌ని నుండి రూ.6,58,000 విలువ చేసే 10 ద్విచ‌క్ర వాహ‌నాల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. జ‌ల్సాలు, వ్య‌స‌నాలు తీర్చుకునేందుకు దొంగ అవ‌తారమెత్తి ఈ ఏడాది ఆరంభం నుండి అనంత‌పురం న‌గ‌రంలో ప‌లు ప్రాంతాల్లో ద్విచ‌క్ర వాహ‌నాలు ఎత్తుకెళుతూ పోలీసుల‌కు క‌నిపించ‌కుండా తిరుగుతున్నాడు.

అనంత‌పురం టూటౌన్ సిఐ జాకీర్ హుస్సేన్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..‌పురం జిల్లా బుక్క‌రాయ‌స‌ముద్రం మండ‌లం కొర్ర‌పాడు గ్రామానికి చెందిన వి.గంగ‌రాజు అనే యువ‌కుడు జ‌ల్సాల‌కు, చెడు వ్య‌స‌నాల‌కు అల‌వాటు ప‌డ్డాడు. ఇత‌ను ప్ర‌స్తుతం ఓ.డి.సి మండ‌లం గౌనిప‌ల్లి గ్రామంలో కూలీ ప‌నులు చేసుకుంటూ నివసించేవాడు. తాగుడు, జూదం, త‌దిత‌ర వ్య‌స‌నాల‌కు ఇత‌ను అల‌వాటు ప‌డ్డాడు. ఈ వ్య‌స‌నాలు తీర్చుకునేందుకు ద్విచ‌క్ర వాహ‌నాలు ఎత్తుకెళ్లే దొంగ‌గా మారాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రి నెల నుంచి అనంత‌పురం న‌గ‌రంలోని జిల్లా స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రి, జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యం, హౌసింగ్ బోర్డు కాల‌నీల‌లో పార్క్ చేసిన ద్విచ‌క్ర వాహ‌నాల‌ను న‌కిలీ తాళాల సాయంతో ఎత్తుకెళ్లాడు. ఈ నేప‌థ్యంలో ద్విచ‌క్ర వాహ‌నాల దొంగ‌త‌నాల‌పై పోలీసులు దృష్టి పెట్ట‌డంతో గంగ‌రాజు దొరికాడు. అత‌న్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వ‌ద్ద ఉన్న 10 ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను స్వాధీనం చేసుకొని , కేసు న‌మోదు చేశారు.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *