Bijapur SI Kidnap | కిడ్నాప్ అయిన SI హత్య! లేఖ వదిలిన Maoistలు
Bijapur SI Kidnap : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలనార్ వద్ద మూడు రోజుల క్రితం మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఎస్సై తాతి మురళిని పుల్సమ్ పారా వద్ద హత్య చేసి మృతదేహాన్ని మావోయిస్టులు పడవేశారు. పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో మావోయిస్టులు ఓ లేఖను వదిలి వెళ్లారు. ఎస్సై మురళి 2006 సమయంలో సల్వాజుడుం నుండి 2021 డిఆర్జి పోలీసు శాఖలో ఛత్తీస్‌గఢ్ లోని పలు ఆదివాసీ గ్రామాల్లో అమాయక ఆదివాసీ గిరిజనులను పలువురిని హత్య చేసిన ఘటనలతో పాటు మహిళలపై అత్యాచారం చేశాడని, అతనికి పలు మార్లు హెచ్చరికలు కూడా చేశామని, అయినా అతని ప్రవర్తన మార్చకోక పోవడంతో ప్రజాకోర్టు నిర్వహించి చంపా మని మావోయిస్టులు మృతదేహం వద్ద వదిలి వెళ్లిన లేఖలో పేర్కొన్నారు. మూడు రోజులుగా మురళి ఆచూకీ కోసం గాలిస్తున్న గోండ్వానా సమితి వారు, మురళి బంధువులు మావోయిస్టులకు మురళిని విడిచిపెట్టమని కోరిన్నప్పటికీ చర్చల నేపథ్యంలోనే ఎస్సైని హత్య చేయడం చర్చనీయాంశమైంది.
తెలంగాణలో మావోయిస్టు పార్టీపై నిషేధం!
మరో వైపు నిషేధిత మావోయిస్టు పార్టీపై మరో ఏడాదిపాటు నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్టు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న విరసం సహా 16 అనుబంధ సంఘాలపైనా వేటు వేసింది. పబ్లిక్ సెక్యురిటీ యాక్ట్ 1992 ప్రకారం వీటిపై మరో ఏడాదిపాటు నిషేధం కొనసాగుతుందని ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మార్చి 30న నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించింది.
అనుబంధ సంఘాలివే!
తెలంగాణ ప్రజాఫ్రంట్(టీపీఎఫ్), తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య (టీఏకేఎస్), తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(డీఎస్‌యూ), తెలంగాణ విద్యార్థి సంఘం(టీవీఎస్), ఆదివాసీ స్టూడెంట్ యూనియన్(ఏఎస్యూ), కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజినర్స్(సీఆర్పీపీ), తెలంగాణ రైతాంగ సమితి(టీఆ ర్ఎస్), తుడుందెబ్బ(టీడీ), ప్రజాకళామండలి (పీకేఎం ), తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ (టీడీఎఫ్), ఫోరం అగైనెస్ట్ హిందూ ఫాసిజం అఫెన్సివ్ (ఎఫ్ఏహెచ్ ఎఫ్ఓ), సివిల్ లి బర్టీస్ కమిటీ (సీఎల్ సీ), అమరుల బంధు మిత్రుల సంఘం (ఏబీఎంఎస్), చైతన్య మహిళా సంఘం(సీఎంఎస్), విప్లవ రచయితల సంఘం (విరసం) లాంటి 16 సంస్థలు ప్రజాసంఘాల ముసుగులో ప్రజల్లోకి వెళ్లి మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించింది.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court