Bigg Boss 5

Bigg Boss 5: కొడుకు(Shanmukh Jaswanth)ను గెలిపించాల‌ని తండ్రి తాప‌త్ర‌యం!

Share link

Bigg Boss 5 విశాఖ‌ప‌ట్నం: బిగ్‌బాస్ విజేత‌గా ష‌ణ్ముఖ్‌(Shanmukh Jaswanth)ని నిల‌పాల‌ని అత‌ని తండ్రి అప్పారావు ప్రేక్షకుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా విశాఖ‌ప‌ట్నంలో విలేక‌ర్ల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్న‌త‌మైన విద్య‌న‌భ్య‌సించిన ష‌ణ్ముఖ్ యూట్యూబ్ స్టార్గా పేరు పొందాడ‌ని ఆయ‌న తండ్రి కె ఎస్ ఎస్ అప్పారావు అన్నారు. యూట్యూబ్‌లో సాప్ట్‌వేర్ ప్రొఫెష‌న‌ల్‌ (software developer short film)గా సూర్య అనే వెబ్ సిరీస్(web series) తో ఆంధ్ర‌, తెలంగాణ యువ‌త మ‌న‌సులు దోచుకున్న ష‌ణ్ముఖ్‌, మా టీవి బిగ్ బాస్‌లో ఫైన‌ల్స్ జాబితాలో నిల‌వ‌డం (Bigg Boss 5)అభినంద‌నీయ‌మ‌న్నారు.

ఈ సంద‌ర్భంగా గురువారం ఉద‌యం డాబా గార్డెన్స్ ప్రెస్‌క్ల‌బ్‌లో ఆయ‌న మాట్లాడారు. ప్ర‌స్తుతం బిగ్ బాస్ ఫైనల్స్‌లో ఐదుగురు ప్ర‌ధానంగా పోటీ ప‌డుతున్నార‌న్నారు. అందులో ష‌ణ్ముఖ్ కు విజేత‌గా ఆయ్యే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌న్నారు. మొత్తం 19 మంది బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్ట‌గా, అందులో టాప్ 5లో ష‌ణ్ముఖ్ నిల‌వ‌డం ప‌ట్ల ఆయ‌న ఆనందం వ్య‌క్తం చేశారు. అందుకు కార‌ణ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ ఆయ‌న ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. కాగా ష‌ణ్ముఖ్ విజేత‌గా నిల‌వాలంటే అభిమానులు భారీ స్థాయిలో ఓటింగ్ చేయాల‌ని అన్నారు. హాట్ స్టార్(hotstar) ద్వారా, మొబైల్స్ ద్వారా మిస్స‌డ్ కాల్ ఇవ్వ‌డం ద్వారా ఓటు వేసి ష‌ణ్మ‌ఖ్ ను విన్న‌ర్‌గా నిలిచేందుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

శుక్ర‌వారం సాయంత్రం లోపు త‌మ అమూల్య‌మైన ఓటును షణ్ముఖ్‌కు వేసి గెలిపించాల‌ని ఆయ‌న తండ్రి అప్పారావు మీడియా ద్వారా ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లంద‌రినీ కోరారు. ఈ స‌మావేశంలో ఆయ‌న తో పాటు విశాఖ స్టీల్ అండ్ సిమెంట్ డీల‌ర్స్ అసోసియేష‌న్ ఛైర్మ‌న్ ఎం.త్రినాథ‌రావు, నేరేడ్ కో సెక్రెట‌రీ న‌రేంద్ర కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Deepak Chahar Proposes to Girlfriend During IPL Match

Yesterday on 7 October Chennai Super Kings(CSK) locked horns with Punjab Kings(PBK) in the Indian Premier League (IPL) 2021 at Read more

Nataraj Master: Bigg Boss నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన న‌ట‌రాజ్ బిందు మాధ‌విపై షాకింగ్ కామెంట్స్‌

Nataraj Master | Bigg Boss లో నేను మాస్క్ పెట్టుకోని ఆడ‌లేద‌ని, తాను నిజాయితీగా ఆడాన‌ని, నా ఫేస్ వాల్యూవుతోనే బిగ్‌బాస్లో నాకు న‌చ్చిన‌ట్టు ప్ర‌వ‌ర్తించాన‌ని Read more

Kasinath Tata: తాతా కాశీనాథ్ గురించి Short బ‌యోగ్ర‌ఫీ

Kasinath Tata | తాతా కాశీనాధ్ స్వ‌స్థ‌లం అమ‌లాపురం ద‌గ్గ‌ర ఇందుప‌ల్లి. 35 సంవ‌త్స‌రాల కింద‌ట కాకినాడ‌లో జ‌న్మించారు. కాకినాడ‌లోనే Inter మీడియేట్ వ‌ర‌కూ చ‌దువుకున్నారు. చ‌దువుకుంటున్న Read more

Kalavathi song: రికార్డుల‌ను బ్రేక్ చేస్తోన్న క‌ళావ‌తి సాంగ్‌

Kalavathi song | స‌ర్కారు వారి పాట సినిమాలో క‌ళావ‌తి పాట ఇప్పుడు యూట్యూబ్ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 13న రిలీజైన ఈ పాట Read more

Leave a Comment

Your email address will not be published.