Song: Bidda Neeku Deevena Latest Folk Song
Lyrics: Mitra
Singer: Vimalakka
Direction: Nagaraju Anthadapula
Dop: Shiva Velpula
Editing: Potula Ramesh
Music: Gyanesh SVC Recording Studio
Bidda Neeku Deevena Song lyrics
బిడ్డా నీకు దీవెన..కన్న బిడ్డా నీకు దీవెన
బిడ్డా నీకు దీవెన..కన్న బిడ్డా నీకు దీవెన
తొమ్మిది మాసాలు మోసిన ఒడినే ఉయ్యాల జేసిన
నా ఇంటి గడప్పల్ల మెరిసినా ఏ అయ్య చేతిల్లో బోసిన
నన్నద్దుకావుంగ ఏడుస్తావనుకుంటే ..ఏ..ఏ..ఏ!
నన్నద్దుకావుంగ ఏడుస్తావనుకుంటే దినదిన గండము నీకమ్మా!
కారడవి వార్తేమి విందునమ్మా!
బిడ్డా నీకు దీవెన..కన్న బిడ్డా నీకు దీవెన
బిడ్డా నీకు దీవెన..కన్న బిడ్డా నీకు దీవెన
పెదరాశి పెద్దమ కథ చెబుతావుంటే
పేదల కథలింటివి..నిరుపేదల వెతలింటివి!
చెమ్మ చెక్కలాట ఆడుకో బిడ్డా అంటే
చెడుగుడు నువ్వాడ్తివి తేడా ఆటల్లో వద్దంటివి!
బడికెళ్లి బుద్ధిగా చదువులే చదివిన
ఇంటిపని చేస్తివి ఎన్నో ఎగురాలు నేరిస్తివి
అన్ని విద్యలు నేర్చి అసమానతలు ఎందుకనీ..నీ..నీ!
అన్ని విద్యాలు నేర్చి అసమానతలు ఎందుకని
అన్నల్లో జేరితివి
అక్కల తెగువకు తొవ్వేస్తివి!
బిడ్డా నీకు దీవెన కన్న బిడ్డా నీకు దీవెన
బిడ్డా నీకు దీవెన కన్న బిడ్డా నీకు దీవెన
ఏ పళ్లు చిలకలు కొరకంగా దింటివో నీ నోట తేనె పలుకు
వింటుంటే ప్రజలకే మేలుకొలుపు
ఏ కంట నువ్వు జూస్తూ కావలి కాస్తివో దాటితివి గండము
అయ్యో దాడుల సుడిగుండము
ఏ గుట్ట కడుపుల్లో దాచుకున్న బిడ్డ
చెట్లన్నీ నీడనిచ్చి నీకు చెలిమెలో నీళ్లు దాపి
తోపుట్టువులోలే తమ్ముళ్ళు చెల్లెల్లు …ఓ..ఓ..ఓ
తోపుట్టువులోలే తమ్ముళ్లు చెల్లెల్లు తోడుగ
నీవెంట తోడుగ పోరులో నిలిసిరా
బిడ్డా నీకు దీవెన కన్న బిడ్డా నీకు దీవెన
బిడ్డా నీకు దీవెన కన్న బిడ్డా నీకు దీవెన
తొమ్మిది మాసాలు మోసిన ఒడినే ఉయ్యాల జేసిన
నా ఇంటి గడప్పల్ల మెరిసినా ఏ అయ్య చేతిల్లో బోసిన
నన్నద్దుకావుంగ ఏడుస్తావనుకుంటే ..ఏ..ఏ..ఏ!
నన్నద్దుకావుంగ ఏడుస్తావనుకుంటే
దినదిన గండము నీకమ్మా!
కారడవి వార్తని విందునమ్మా!
ఊరంత బతుకమ్మ పేరుస్తూ ఉంటుంటే!
నాకేడ పడుగుంది!ఓ బిడ్డా నాకేడ పరువముంది|
పల్లెంత సద్దుల వైనాలు పాడ్తుంటే
నీ మాటే సద్దిమూట
నాకు నీ తలపే ఆటపాట
ఆకలి ఆపద రోజూ నీవెంటుంటే
కడుపుకేమి దిన్నవూ!
నా బిడ్డ కడసారి ఏమన్నవో!
నిలువెళ్ల గాయాలు నీ ఒళ్లు పలుకంగా..ఆ…ఆ…ఆ
నిలువెళ్ల గాయాలు నీ ఒళ్లు పలుకంగా!
వేలాది గొంతులు కోరస్సై పాడంగా!
బిడ్డా నీకు దీవెన కన్న బిడ్డా నీకు దీవెన
బిడ్డా నీకు దీవెన కన్న బిడ్డా నీకు దీవెన
ఇంటి అలుగుమీద పిట్టలు కిలకిలలు
నీ పలుకులు అనుకుంటినే
ఓ బిడ్డా నీనులికి పడుతుంటినే!
గడిగోడలమీద గరుక మొలిచిన గుర్తు
దొరల భూముల సాలళ్లో
నీ నీడ ఎర్ర జెండై ఎగిరినే
పేదలే హద్దులుగా అధర్మ యుద్దాలు ఆగకుండ సాగినే
రక్తాలు ఏరులై పారెనె.
తల్లి బిడ్డల ఉసురు
దొరల గద్దలకిసురో…ఓ..ఓ..ఓ
తల్లిబిడ్డల ఉసురు
దొరల గద్దలకిసురు తగిలిసచ్చిన్నాడు
కలిసేను కాలంబు
బిడ్డా నీకు దీవెన కన్న బిడ్డా నీకు దీవెన
బిడ్డా నీకు దీవెన కన్న బిడ్డా నీకు దీవెన
తొమ్మిది మాసాలు మోసిన ఒడినే ఉయ్యాల జేసిన
నా ఇంటి గడప్పల్ల మెరిసినా ఏ అయ్య చేతిల్లో బోసిన
నన్నద్దుకావుంగ ఏడుస్తావనుకుంటే ..ఏ..ఏ..ఏ!
నన్నద్దుకావుంగ ఏడుస్తావనుకుంటే
దినదిన గండము నీకమ్మా!
కారడవి వార్తేమి విందువమ్మా!
బిడ్డల్లారా వందనం..కన్న బిడ్డల్లారా వందనం
బిడ్డల్లార వందనం..కన్న బిడ్డల్లారా వందనం
వీరవనతిల్లారా..శూర వనతిల్లారా
విప్లవాల వందనం మీకు కన్న తల్లుల వదనం
విప్లవాల వందనం..మీకు కన్నతల్లుల వందనం
విప్లవాల వందనం..మీకు కన్న తల్లుల వందనం.