Bhuma Akhila Priya arrest | Mounika Press meet | CM kcr | Bowenpally Kidnap | మా అక్కను ఇబ్బంది పెడుతున్నారు! జాగ్రత్తా!
భూమా అఖిల ప్రియా సోదరి మౌనిక ఆవేదన
Bhuma Akhila Priya arrest | Mounika Press meet | CM kcr | Bowenpally Kidnap | మా అక్కను ఇబ్బంది పెడుతున్నారు! జాగ్రత్తా!Hyderabad : కిడ్నాపు కేసులో ఏ1 ముద్దాయిగా నిర్థారించబడిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో భూమా అఖిల ప్రియను ను పోలీసు వారు, ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నారని ఆమె సోదరి మౌనికా ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తమ సోదరి భూమి అఖిల ప్రియా ఏ తప్పూ చేయలేదని, ప్రస్తుతం గర్భవతిగా ఉందని తెలిపారు. తమ కుటుంబానికి వచ్చిన ఇబ్బందులను బట్టి తాము పాకిస్థాన్‌లో ఉంటున్నామా? హైదరాబాద్‌లో ఉంటున్నామా? అర్థం కావడం లేదన్నారు.
తాము ఆళ్ల గడ్డలో పుట్టినా పెరిగింది మాత్రము హైదరాబాద్ నగరంలోనేనని అన్నారు. తమకు ఇక్కడ ఆస్తులు, గౌరవ మర్యాదలు ఉన్నాయని పేర్కొన్నారు. తాము వేరే రాష్ట్రం నుంచి వచ్చి కత్తులు తీసుకొచ్చి ఫ్యాక్షన్ చేసినట్టు చిత్రీకరిస్తూ ఉన్నారని అన్నారు. ఆళ్ల గడ్డ నుంచి ఇక్కడకు ఎవ్వర్నీ రానివ్వడం లేదని, ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని మీడియా ఎదుట ఉద్రిక్తంగా మాట్లాడారు.
అఖిల ప్రియ ఆరోగ్యం బాగా లేదు: సోదరి
మా అక్క భూమా అఖిల ప్రియ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆమెను బెయిల్ ద్వారా తీసుకొద్దామనుకుంటే పోలీసులు వేరే స్టేట్మెంట్ లు ఇచ్చి అడ్డకుంటున్నారని అన్నారు. మా అక్కను చంపేదామను కుంటున్నారా? ఇంకా ఎంత హింసిస్తారని భూమా మౌనిక ప్రశ్నించారు. జైలులోనే ఉంచి ఇన్విస్టిగేషన్ల పేరుతో బయటకు రానివ్వకుండా చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ను వేడుకుంటున్నాను.
మా అక్క కూడా పబ్లిక్ సర్వీసు చేసిందన్నారు. తన సోదరిని విడుదల చేయడానికి కేసీఆర్ సహాయం చేయాలని కోరుతున్నానన్నారు. పోలీసులను తామెప్పుడూ టార్గెట్ చేయలేదన్నారు. తాము ఎప్పుడూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదని తెలిపారు. పోలీసులు తమ సోదరిని తీసుకెళ్లేందుకు కనీసం పక్కన మహిళా కానిస్టేబుల్ ను కూడా తీసుకురాకుండా దౌర్జన్యంగా తీసుకెళ్లారని ఆరోపించారు.
సివిల్ నిబంధనలకు తూట్లు…
భూమా అఖిల ప్రియను తీసుకెళ్లేందుకు రాత్రి వేళ్లలో పోలీసులు వచ్చారని, ఎక్కడికి తీసుకెళుతున్నారో?, ఎందుకు అరెస్టు చేస్తున్నారో తమ కుటుంబంలో ఎవ్వరికీ తెలియదని భూమా మౌనిక అన్నారు. పోలీసులు మా అక్కను తీసుకెళ్లి రాత్రి అంతా అన్నము, మంచినీళ్లు కూడా ఇవ్వకుండా అలానే ఉంచారని, అసలు ఏ కేసుపై తీసుకెళ్లారో అర్థం కాలేదని అన్నారు. ఈ విషయమై స్వయంగా పోలీసు కమిషనర్ వద్దకు వెళ్లానని, తమ అక్క గర్భవతి అని, ఆమె ఆరోగ్యం బాగా లేదని తెలియజేశానని పేర్కొన్నారు. ఆహారం, మందులు ఇవ్వాలని పోలీసు వారికి చెప్పినా ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు.
రాజకీయంగా జరుగుతున్న కుట్రే? : మౌనిక
ప్రస్తుతం భూమా అఖిల ప్రియ ప్రతిపక్షంలో ఉన్నారని, ఆళ్లగడ్డలో అక్కడ కేసులంటూ ఒత్తిళ్లు తెస్తూ ఆరోపణలు చేస్తున్నారని, అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒత్తిళ్లకు గురిచేస్తుందేమోననే అనుమానం వ్యక్తం చేశారు. తమ సోదరి కేసు విషయంలో రాజకీయ కుట్ర జరుగుతుందని విమర్శించారు. ఆళ్లగడ్డలో తమ మనుషులను బెదిరిస్తున్నారని, తమ క్రషర్ ప్లాంట్‌కు సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నాయన్నారు. కానీ అక్కడ పరికరాలు అధికారులు ఎత్తుకెళుతున్నారని చెప్పారు. ఏమైనా భూ సమస్యలు ఉంటే కూర్చొని పరిష్కరించుకుందామని, అందుకుతాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి ఈ విషయాన్ని పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాలని కోరారు.తమను పక్క రాష్ట్రం వారిలాగా చూస్తున్నారని, ఇక్కడే తాము ఉంటున్నామని, తమ తండ్రి భూమా నాగిరెడ్డి చూపిన మార్గంలోనే గౌరవంగా బతకాలని కోరుకుంటున్నామని అన్నారు. తాము రాజకీయాలు చేయడం లేదని, దయచేసి తమ అక్క భూమా అఖిల ప్రియను విడుదల చేయాలని సోదరి మౌనిక కోరారు.
ఇది చదవండి : నల్గొండలో అబార్షన్ ముఠా అరెస్టు