Bhogi Pallu

Bhogi Pallu: పిల్ల‌ల‌కు భోగి ప‌ళ్లు ఎలా పోయాలో తెలుసా?

Special Stories
Share link

Bhogi Pallu: పిల్ల‌ల‌కు భోగి ప‌ళ్లు పోయ‌డం అనేది మ‌న తెలుగు సంప్ర‌దాయాల్లో ఒక‌టి. అస‌లు పిల్ల‌ల‌కు భోగి ప‌ళ్లు ఎందుకు పోస్తారు? అనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. ముఖ్యంగా ప‌సిపిల్ల‌ల‌కు దిష్టి త‌గ‌ల‌డం స‌హ‌జం. అందుకే వారికి అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న దిష్టి మొత్తాన్ని తీసిపారేయ‌డ‌మే Bhogi Pallu పోయ‌డం.

సాయంత్రం సంది గొబ్బెలు పిల్ల‌లు చేత పెట్టించిన త‌ర్వాత ఈ Bhogi Pallu చేసే కార్య‌క్ర‌మం మొద‌లుపెడ‌తారు. 5 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కే ఎక్కువ‌గా భోగిప‌ళ్లు పోస్తారు. రేగి ప‌ళ్లు, బంతిపూల రెక్క‌లు, చిల్ల‌ర నాణేలు, చెరుకు గ‌డ‌ల ముక్క‌లు క‌లిపి ఉంచుతారు. వాటిని పిల్ల‌ల‌పై ప‌డేట‌ట్టు పోస్తారు. అలా పోసిన త‌ర్వాత కింద బ‌డ్డ రేగిప‌ళ్లు తిన‌డానికి నిషిద్ధం. దాన్ని ఎవ‌రూ లేని చోట పారేయ‌డం చేస్తారు.

అస‌లు పిల్ల‌ల‌కు భోగి ప‌ళ్లు పేరుతో రేగి ప‌ళ్ల‌నే ఎందుకు పోస్తారు? అనేది కూడా చాలా మందికి తెలీని విష‌య‌మే. రేగి పండును అర్క‌ఫ‌లం అని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మ‌రునాడు మంచి సూర్యుడు ఉత్త‌రాయ‌ణం వైపు మ‌ళ్లుతాడు. అందుకే, ఆయ‌న క‌రుణాక‌టాక్షాలు పిల్ల‌ల‌పై ఉండాల‌నే ఉద్దేశంతో పిల్ల‌ల‌కు భోగి ప‌ళ్లు పోస్తారు.

భోగి పళ్ల పండుగ‌

భోగి పండ్ల పాట‌(Bhogi Pallu Song)

ప‌. భోగిపండ్ల‌ను పోయ‌రే – ఓర‌మ‌ణులారా!
మ‌న చిరంజీవీలుకు – మేలుక‌లుగ‌గా ||భోగి||

చ‌.విగ్నాశ్వ‌రుడు వ‌చ్చి – విఘ్నాలు తొల‌గింప‌
ష‌ణ్ముఖ‌నాధుడు వ‌చ్చి – శాస్త్రాలు వ‌ల్లింప‌
సాయిబాబాని వ‌చ్చి – ప్రేమార లాలింప ||భోగి||

చ‌. బ్ర‌హ్మ‌దేవుడు వచ్చి – వేదాల దీవింప‌
విష్ణు దేవుడు వ‌చ్చి – వ‌ర‌ముల నందింప‌
ప‌ర‌మేశ్వ‌రుడు వ‌చ్చి – ఆశీర్వ‌దించంగ ||భోగి||

చ‌.రామచంద్రుడు వచ్చి – ర‌క్ష‌ణ చేయంగ‌
శ్రీ కృష్ణుడే వ‌చ్చి – శుభ‌ములు ప‌లుకంగ‌
శ్రీ వేంక‌టేశ్వ‌రుడు – ఆశీస్సులందింప ||భోగి||

చ‌.ఆంజ‌నేయుడు వ‌చ్చి అభ‌యాల‌నివ్వంగ‌
కుల‌దైవ‌త‌లు వ‌చ్చి – క‌ళాకాంతుల‌నివ్వంగ‌
తుల‌సిదాసుడు వ‌చ్చి – మంగ‌ళ‌ములు పాడంగ ||బోగి||

See also  Types of Phobias: ఫోబియా అంటే ఏమిటి? ఇది ఎన్ని ర‌కాలు ఉంటుంది?

Leave a Reply

Your email address will not be published.