Bhimavaram PM Visit | భారత్ ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల పర్యనటలో భాగంగా భారీ ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ రోజు అనగా ఆదివారం హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం రేపు జూలై 4వ తేదీన ఏపిలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మోడీ(Bhimavaram PM Visit) పర్యటించనున్నారు. దీంతో పోలీసులు భారీగా ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. మోడీ పర్యటనకు ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేయనున్నారు. రేపు కాళ్ల మండలం నుండి భీమవరం వైపుకు స్కూలు, ప్రైవేటు వాహనాలను అనుమతించడం లేదు. భద్రతా చర్యలో భాగంగా 4న షాపులను స్వచ్ఛందంగా మూసివేయాలని వ్యాపారులు నిర్ణయించారు.
భీమవరంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హోటల్స్, వాణిజ్య సముదాయాలను పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే వారి ఆధీనంలోకి తీసుకున్నారు. రేపు ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. మోడీ హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 9.29 గంటలకు బయలుదేరి 10.10 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. అక్కడి నుంచి 10.15 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10.50 గంటలకు భీమవరం చేరుకుంటారు.


10.55 గంటలకు హెలిఫ్యాడ్ నుంచి ప్రత్యేక వాహనంలో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఇక 12.30 హెలికాఫ్టర్‌లో బయలు దేరి 1.05 గంటలకు విజయవాడకు చేరుకుంటారు.