bhatti vikramarka: గత ఎన్నికల్లో హుజూరాబాద్ శాసనసభలో కౌశిక్ రెడ్డికి వచ్చిన 61,121 ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు అన్న విషయం ఆయన గుర్తు పెట్టుకోవాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్కమార్క వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ నిర్ణయాన్ని పార్టీలో అందరూ ఆమోదించాల్సిందేనని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను భట్టి ఖండించారు. క్రమ శిక్షణ కలిగిన కాంగ్రెస్ వాదులెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, విధానాలను, అమలు చేయడం కోసం అందరూ ముందుండి నడిపించాలన్నారు. తెలంగాణ ఇన్ ఛార్జి జనరల్ సెక్రెటరీ మాణిక్యం ఠాగూర్‌పై డబ్బులు అభియోగాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇలాంటి అభాండాలు మొత్తం పార్టీకి నష్టం కలిగిస్తాయన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కూడా టీఆర్ఎస్ – బీజేపీల మధ్య ఓట్లు చీలినా, స్థిరమైన ఓట్ బ్యాంక్‌తో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదని ఓ ప్రకటనలో తెలిపారు.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!