Bharathi Holikeri మంచిర్యాల: కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల సాధికారత విభాగం పరిధిలోని విత కేంద్రాల ద్వారా దివ్యాంగులకు చేయూత అందిస్తున్నట్టు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోలికేరీ(Bharathi Holikeri) తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్, జాతీయ మేథో దివ్యాంగుల సాధికారత సంస్థ ప్రతినిధి సమ్మయ్యతో కలిసి 45 మంది దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఎఐడీపీ పథకం ద్వారా బోధన, అభ్యాసన సామాగ్రిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భవిత కేంద్రాల్లో సమ్మిళిత విద్యా రిసోర్స్ పర్సన్లు, తల్లిదండ్రుల పాత్ర అభినందనీమని అన్నారు. ఎన్.హెచ్.ఎఫ్.డి.సి ద్వారా స్వయం ఉపాధి రుణాలు కేటాయించడం జరుగుతుందని అర్హత గల వారు ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని తెలిపారు.