bharath bandh

bharath bandh on 26th feb 2021 || పెట్రోల్ ధ‌ర‌లు సెగ‌..రైతుల ధ‌ర్నాలానే ప్ర‌ణాళిక సిద్ధం!

జాతీయం

bharath bandh on 26th feb 2021: New Delhi: భార‌త్ దేశంలో రోజురోజుకూ పెరుగుతూ సెంచ‌రీ మార్క్ దాటుతున్న పెట్రోల్ ధ‌రల‌‌పై సామాన్యుడికి విసుగుపుట్టింది. చాలీచాల‌ని జీతాల‌తో సొంత వాహ‌నాల‌పై కాలం వెళ్ల‌దీస్తున్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌పై పెట్రోల్ ధ‌ర‌ల బాధుడు చిర్రెత్తుకొచ్చినంత ప‌నిచేసింది. స‌హ‌నంతో ఉంటున్న స‌గ‌టు మ‌నిషికి రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల ధ‌ర‌ల‌పై ఓపిక న‌శించింది. ఇక ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో నెల‌ల త‌ర‌బ‌డి ఐక్యంగా పోరాడుతున్న రైతుల దీక్ష త‌ర‌హాలో యువ‌త ఏక‌మ‌వుతుంది. ఈ నెల 26న భార‌త్ బంద్‌కు పిలుపు నిచ్చింది.

రెండు వారాలుగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. రాజ‌కీయ పార్టీలు కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తుండ‌గా తాజాగా ధ‌ర‌ల‌పెంపుపై లారీ య‌జ‌మానులు ఆందోళ‌న‌కు దిగారు. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు వ్య‌తిరేకంగా శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 26) నాడు భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇప్ప‌టికే ఈ బంద్‌కు అన్ని పార్టీల ట్రేడ్ యూనియ‌న్లు మ‌ద్ద‌తు తెలిపాయి.

టోల్‌గేట్ వ‌ద్ద బారులు తీరిన వాహ‌నాలు (ఫైల్‌)

భార‌త్ బంద్ నిర్వ‌హించాల‌ని తొలుత కాన్ఫ‌డ‌రేష‌న్ ఆఫ్ ఆలిండియా ట్రేడ‌ర్స్ (సీఏఐటీ -CAIT) పిలుపునిచ్చింది. అంతే కాకుండా అఖిల భార‌త వాహ‌న‌దారుల సంక్షేమ సంఘం(AITWA) కూడా సంపూర్ణ మ‌ద్ద‌తు ప‌లికింది. అన్ని రాష్ట్రాల వివిధ ట్రాన్స్‌పోర్టు అసోసియేష‌న్లు బంద్‌కు మ‌ద్ద‌తిస్తాయ‌ని AITWA అధ్య‌క్షుడు మ‌హేంద్ర ఆర్య తెలిపారు. ఈ బంద్‌లో ర‌హ‌దారులు దిగ్భంధం చేస్తామ‌ని పేర్కొన్నారు.

ఇది చ‌ద‌వండి:కిడ్నాప్ నాట‌క‌మాడిన యువ‌తి ఆత్మ‌హ‌త్య

ఇది చ‌ద‌వండి:దెయ్యం భ‌య్యం..కాల‌నీ ఖాళీ చేసిన ప్ర‌జ‌లు

ఇది చ‌ద‌వండి:ష‌ర‌తుల‌పై విర‌సం నేత‌కు బెయిల్ మంజూరు

ఇది చ‌ద‌వండి:కోవిడ్ వ‌ల్లే పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరుగుద‌ల

ఇది చ‌ద‌వండి:ఖాకీ మాటున మాన‌వ‌త్వాన్ని చూపిన ప్ర‌తి పోలీసుకు సెల్యూట్: డీజీపీ

ఇది చ‌ద‌వండి:మ‌ళ్లీ పంజా విప్పుతోన్న క‌రోనా

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *