Bhakarapeta Ghat Road bus Accident | చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. జిల్లాలోని భాకరాపేట ఘాట్ రోడ్డులో పెళ్లి బస్ శనివారం రాత్రి 10.40 నిమిషాల ప్రాంతంలో బోల్తా కొట్టింది. సుమారు 50 అడుగుల లోతులో బస్సు పడిపోయినట్టు సమాచారం. చీకటిలో ఏమీ కనపడకపోవడంతో పెళ్లి వారు ఆర్తనాదాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Bhakarapeta Ghat Road bus Accident
ధర్మవరం నుంచి తిరుపతికి బయలుదేరిన ప్రైవేటు బస్సు భాకరాపేట ఘాట్ రోడ్డులో బోల్తా కొట్టింది. చీకటిలో సాయం కోసం చూస్తున్న పెళ్లి బృందంకు తోటి వాహనదారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. డ్రైవర్ మృతి చెందినట్టు సమాచారం. చీకటి కావడంతో సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ పెళ్లి బస్సులో సుమారు 50 మంది ఉన్నట్టు సమాచారం. సంఘటనా స్థలానికి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!