Bhagwant Mann పంజాబ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ అధినేత కేజ్రీవాల్ అధికారికంగా ప్రకటిం చారు. మా పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్(Bhagwant Mann) అంటూ కేజ్రీవాల్ బహిరంగ పరిచారు. ఇది పార్టీ ఎంపికకాదని, ప్రజాభిప్రాయం నిర్ణయం మేరకే ఈ ఎంపిక చేసినట్టు తెలియపరిచారు.
ప్రజాభిప్రాయంతోనే ఎన్నిక!
పంజాబ్ ఆమ్ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి గా భగవంత్ మాన్ పేరును ప్రకటించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు ఈ పేరును ప్రకటించినట్టు చెప్పారు. సీఎం అభ్యర్థి కోసం టెలీ ఓటింగ్ ప్రజాభిప్రాయ సేకరణ చేశామన్నారు. ఈ సర్వేలో భగవంత్ మాన్ ముందు వరుసలో నిలిచారన్నారు. అందుకే తనను సీఎం అభ్యర్థిగా ఖరారు చేశామన్నారు. దీంతో పంజాబ్ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ఆమ్ఆద్మీ ప్రకటించడం గమనార్హం.

భగవంత్ మాన్ కావాలి!
ఆప్ పార్టీ ప్రకటించిన ఓ మొబైల్ నెంబర్ కు ప్రజలు తమ ఫీడ్‌బ్యాక్‌ను అందజేశారు. కేవలం 4 రోజుల్లో 3 కోట్ల జనాభా గల పంజాబ్‌లో 21 లక్షల మంది నుంచి పైగా ఫీడ్ బ్యాక్ అందింది. అందులో 93.3 శాతం మంది సర్థార్ భగవంత్ మాన్ పేరును సూచించారని తెలిపారు. భగవంత్ మాన్ పార్టీ ప్రకటించిన అభ్యర్థి కాదు.. ప్రజలు ప్రకటించిన అభ్యర్థి అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పంజాబ్‌లో ఫిబ్రవరి 20 మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ