Bhagat Singh Life Story : విప్లవ వీర యోధుడి ఉరికి 90 ఏళ్లు, మరో పదేళ్లలో నూరేళ్లు ఐనా వీరుడు నిత్యం చెదరని రూపం, సదా చెరగని ముద్ర, ఓ మరపురాని సజీవ అనుభూతి, మరచిపోలేని ఓ నిరంతర జ్ఞాపకం, ఆయన స్పృతే ఓ విప్లవ సందేశం. ఆయన నామ స్మరణే భావ విద్యుత్ ప్రసరణ తన అమరత్వపు సర్మరణే మన గుండెల్ని కవోష్ట రక్తంతో మండిస్తాయి. భూ భాగంపై ధనికుల వ్యవస్థ ఉన్నంత కాలం అతడు దాని దగ్ధ ప్రతీకగా వర్థిల్లుతూనే ఉంటాడు. అతడే “భగత్ సింగ్”.
ముగ్గురూ విప్లవ కాగఢాలే!
భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ముగ్గురూ ముగ్గరే. విప్లవ యోధాగ్రేసరులే. విప్లవ కదనం రంగం నుంచి మడమ తిప్పని మహాయోధులే. ఉరికంభాన్ని ఓ క్రీడాస్థలిగా ఎంచి, విప్లవ సాధనలు ప్రదర్శించిన సాటి లేని మేటి వీరులు లాహోర్ కేంద్ర కరాగారంలో విప్లవ పులకాంకితులై సయ్యాటలు ఆడినవాళ్లే ఉరి కంభం నుండి వేలాడుతోన్న ఉరితాడును తమ చేతితో మెడచుట్టూ బిగించుకుంటూ “ఇంక్విలాబ్ జిందాబాద్” అని గొంతెత్తి ప్రతిధ్వనించిన వాళ్లే. గొంతులో తుదిశ్వాస విడిచేంత వరకూ “సామ్రాజ్యవాదం నశించాలి.” అని కసికొద్ధీ దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన వాళ్లే ప్రపంచ పెట్టుబడిదారీ దుష్ట వ్యవస్థ పై ఎగరేసిన సిద్ధాంత, రాజకీయ బావుటాకు ప్రతీకగా” ప్రపంచ శ్రామికులారా ఏకం కండి. ”అని గొంతెత్తి గర్జిస్తూ భౌతికంగా ఆఖరి శ్వాస విడిచే వరకూ నినదించిన మహోన్నత త్యాగ ధనులు యోధులు భగత్ సింగ్, సుఖ దేవ్, రాజగురు.

వాళ్లు చావుకు భయపడలేదు. మృత్యువును ముద్దాడారు. మరణాన్ని జయించారు. ఈ భూమి మీద ధనికుల వ్యవస్థ జీవించినంత కాలం వాళ్లు దానిపై యుద్ధదగ్ధ ప్రతీకలై వర్థిల్లుతారు. అది దగ్థమయ్యాక, వాళ్లు అమర ప్రతిబింబాలై విరజిల్లుతారు. శ్రమ దోపిడీ వ్యవస్థ మనుగడలో ఉన్నంత కాలం వాళ్లు అమర సందేశాలై వర్థిల్లుతారు. దోపిడీ, పీడన, అణచివేత, కష్టాలు, కన్నీళ్లు లేని సమసమాజం ఏర్పడ్డ తర్వాత వాళ్లు అమర సంకేతాలై వెలుగొందుతారు.
భగత్ సింగ్ జననం ఒక చరిత్రే!
Bhagat Singh Life Story : చరిత్ర గమనంలో పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ క్రమంలో ఒకానొక కాలం గర్భందాల్చింది. అది ధరించిన గర్భం ఒకానొక రోజు పురిటికి ఆసన్నమై నొప్పులకు గురైంది. అదో సుముహూర్తాన పురుడు పోసుకుంది. ఆ రోజు పుట్టిన చారిత్రిక విప్లవ పసికందే భగత్ సింగ్. ఉయ్యాలలోనే మాతృమూర్తి విద్యావతి పెట్టిన విప్లవ గోరు ముద్దలు తిని ఏడాది నిండ ముందే బుడిబుడి అడుగుల సవ్వళ్లు చేసి మూడేళ్లకే కిషన్ సింగ్ స్ఫూర్తి, అజిత్ సింగ్ ప్రేరణ.. ఏడేళ్లకే గడ్డి పరకలు నాటడం మొదలు పెట్టాడు. తండ్రి ”ఏం చేస్తున్నావు నాన్న..” అని ప్రశ్నిస్తే భగత్ సింగ్ ఇచ్చిన జవాబు విని అవ్వాకయ్యరు. భగత్ సింగ్ మాటలివి పొలంలో తుపాకులు నాటుతున్నా భవిష్యత్తుకు బాల్యమే మొలక , మొలకలు వేసే వయస్సులో మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడటం, అతని వ్యక్తిత్వానికి మచ్చు తునక. 12వ ఏట జలియన్ వాలా బాగ్ గ్రౌండ్ లో నెత్తుటితో తడిసిన మట్టి ముద్దని విత్తనంగా మార్చి, విప్లవ అమర మూర్తి కర్తర్ సింగ్ శరభ అమర స్మృతిలో విప్లవ దీక్షా కంకణ బద్ధుడై,నవ జవాన్ నేతగా మారి, ఆజాద్ సేనాని నేతృత్వంలో సరమ సేనకు రాజకీయ అధినేతగా మారారు.
వర్తమాన చరిత్రకు ఊపిరి పోసిన భగత్ సింగ్!
శ్రామిక వర్గ విప్లవానికి సరైన సైద్ధాంతిక నిర్వచనం ఇచ్చి, లెనిన్ నుండి రాజకీయ, సిద్ధాంత ఉద్దీపన పొందారు, ఉరి కంభంపై అమరత్వం పొంది, భారత ఉప ఖండపు విప్లవ హీరోగా జగతి విఖ్యాత ఘన చరిత్ర కెక్కిన భగత్ సింగ్ నేడు రాజకీయ పునర్జమ్మ పొందే చారిత్రక ఆవశ్యకత ఏర్పడింది. గత చరిత్ర మట్టిపొరల క్రింద వర్తమాన చరిత్రకి ఊపిర్లు పోసే అధ్యాయాలు దాగి ఉన్నాయి. రేపటి భావి చరిత్ర నిర్మాణానికి ఉపకరించే గొప్ప సముజ్వల, సమున్నత చారిత్రిక ఘట్టాలను వర్తమాన చరిత్ర గర్భం నుండి నేడు ఆయాచితంగా పెల్లుబికి వెలికి వస్తోన్నాయి. అందులో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ వంటి అమర వీరుల చరిత్రలు కూడా దాగి ఉన్నాయి. కిసాన్ సమాయుక్త నేతలు భగత్ సింగ్ బాబాయ్ సర్థార్ అజిగ్ సింగ్ నాడు బ్రిటీష్ వలస పాలనలో రైతాంగ వ్యతిరేక చట్టాలపై నిర్మించిన రైతాంగ తిరుగుబాటును ఈ మధ్యే స్మరించింది. నేటి రైతాంగ పోరుకు అది విప్లవ స్ఫూర్తి ఇస్తోంది. ఔను, గత చరిత్ర వర్తమాన చరిత్రకు ఉద్యమ ఉద్దీపన కలిగిస్తే, భవిష్యత్తు చరిత్ర నిర్మాణానికి వర్తమాన చరిత్ర వెలుగు వెదజల్లే దారిదీపాల్ని అందిస్తుంది. అట్టి దారి దీపాల్ని గత చరిత్ర మట్టి పొరల్ని త్రవ్వి వెలికితీసి, వెలుగులోకి తెచ్చి రాజకీయ పదును పెట్టుకుందాం.

Bhagat Singh Life Story : ఇప్పుడు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌లకు మనం రాజకీయ పునర్జమ్మ కలిగిద్ధాం. అట్టి సమయం సమీపించింది. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే నేడు మరో ఎత్తు నాటి పంజాబ్ భారత స్వాంతత్య్ర పోరాటంలో అగ్ర భాగాన నిలిచింది. బ్రిటీష్ వ్యతిరేక పోరాటంలో పంజాబ్ యువత ఉరికంభాలపై ఉయ్యాలలు ఊగింది. చెరసాలలో సయ్యాటలు ఆడింది. వళ్లు జలదరించే గద్దర్ వీరుల దుస్సాహసిక త్యాగాలు వెలకట్టలేనివి. కామగటామార్ నగర్ నౌకా విప్లవ యానం గుండెల్ని పిండి చేస్తాయి. హిందూస్తాన్ సోషలిస్టు, రిపబ్లికన్ ఆర్మీ (హెచ్.ఎస్.ఆర్.ఏ) చేపట్టిన అసమాన అకుంఠిత, దుర్భేధ్య, దుర్లభ, సాహసోపేత విప్లవ కృత్యాల్లో సింహభాగం పంజాబ్ యూత్ పోషించింది. చివరకు తెలంగాణతో సహా దక్షిణాది జైళ్లని రాజకీయ పాఠశాలగా మార్చి, ఎందరినో కమ్యూనిస్టు విప్లవ కారులుగా మార్చిన, మలిచిన ఘన చరిత్ర కూడా లాహోర్ విప్లవ కారులకు దక్కిది. ఓ భగత్ సింగ్, ఓ రాజుగురు, ఓ సుఖదేవ్, ఓ కర్తర్ సింగ్ శరభ, ఓ ఉద్ధాం సింగ్ ఎందరో మరెందరో.
పంజాబ్ రైతుల రక్తంలోనే పోరాడే తత్త్వం!
నాడు ఓడయ్యర వంటి కర్కోటక నియంతల్ని ధిక్కార చైతన్యంతో ఎదిరించి జబ్బచరిచి నిలబడ్డ ధీశాలి ఘన చరిత్ర పంజాబ్ యువతకి దక్కింది. ఇప్పుడు ఢిల్లీని ఏలే అపర ఓడయ్యరల రక్తసిక్త నిరంకుశ పాలనలో భాగంగా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా రైతంగానికి వ్యతిరేకంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై తొలి తిరుగుబాటు బావుటా ఎగర వేసిన ఘనత కూడా నేడు పంజాబీ రైతాంగానికి దక్కింది. ముఖ్యంగా అందులో యువత నేడు కదం తొక్కుతోంది. అట్టి యువతకు పిడికిలెత్తి విప్లవ ఘన స్వాగతం పలుకుందాం.

భగత్ సింగ్ ఓ వ్యక్తి కాదు..ఓ విప్లవ శక్త.. ఓ ఉద్యమ స్రవంతికి ప్రతీక. ఓ విప్లవ ప్రవాహానికి సంకేతం. ఇప్పటికి చరిత్రలో మొత్తం 89 సార్లు భగత్ సింగ్ వర్థంతులు జరిగాయి. అదే సమయంలో 75వ వర్థంతి కూడా సమిపిస్తుంది. ఈ సందర్భంగా భగత్ సింగ్ స్మృతి పదంలో నేడు 90వ వర్థంతి సందర్భంగా కూడా అలంటి ఓ అపర్వమైనదే. వర్తమాన భారతదేశ రైతాంగ వీరోచిత పోరాటం ఓ గొప్ప చరిత్ర. అట్టి చరిత్ర సంస్మరణ పథంలో గత 89 వర్థంతుల కంటే సాపేక్షికంగా ఎంతో ఎక్కువ రాజకీయ, చారిత్రక ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రాసంగీకతలు గల ఈ 90వ వర్థంతికి ఉన్నాయి. అందుకే ఈ సారి ఘనంగా నిర్వహించుకునే ఆవశ్యక్త నేడు ఎంతైనా ఉంది. అందుకు సిద్ధమవుదాం.
ఫాసిజం బుసలు కొడుతోన్న వేళ. అణిచివేత వ్యవస్తీకృత రూపం ధరిస్తున్న వేళ, రాజ్యం ప్రజలపై విరుచుకుపడుతోన్న వేళ, రైతాంగ తిరుగుబాటు ఓ దారి దీపంగా మారింది. ఈ దృష్టి కోణంతో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల 90వ వర్థంతిని నిర్వహిద్ధాం. ఈ వెలుగులో భగత్ సింగ్ స్మారక స్మృతి పథంలో విప్లవ ధీక్షతో నిర్వహించి ముందుకు సాగుతాయని ఆశిద్ధాం. ఆ వీరుల బాటలో పయనిద్ధాం.

సెల్ : 9441775596
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!