Bhadradri Powr Plant మణుగూరు: దేశంలో తనను అంటిపెట్టుకొని జీవిస్తున్న పలు రాష్ట్రాల ఆయా గ్రామాల ప్రజలకు గోదారమ్మ దాహం తీరుస్తుంది. అలాంటి గోదావరి కలుషితం అయితే తాగడానికి ఏమాత్రమూ ఆ నీళ్లు పనికిరావు. గోదావరి నీళ్లు కలుషితం అవుతున్నాయంటూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోరెడ్డి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం (Bhadradri Powr Plant)చేస్తున్నారు.
BTPS వ్యర్థాలతో గోదావరి కలుషితం!
మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బిటిపిఎస్) అధికారుల నిర్లక్ష్యం వల్ల పవర్ ప్లాంట్ నుంచి వెలువడే బూడిద మరియు ఇతర వ్యర్థాలను నేరుగా గోదావరి నదిలోకి వదలడం ద్వారా నీరు అంతా కలుషితం అవుతుందని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోరెడ్డి విజయలక్ష్మి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ఈ నీరు త్రాగి ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నీరుతో సాగు చేయడం వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతారని, ఆహారం విషతుల్యమవుతుందని అన్నారు.

ఎమ్మెల్యే పట్టించుకోవాలి!
దీని ప్రభావం మణుగూరు నియోజకవర్గ ప్రజలపై కాకుండా గోదావరి నదీ పరివాహక ప్రాంతాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాను అన్న స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు కానీ, జరుగుతున్న నీటి కలుషిత దారుణ పరిణామాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు ఆమె. గోదావరి నది నీటిని కలుషితం కాకుండా చూడాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో BTPS పవర్ ప్లాంట్ ఎదుట స్థానిక ప్రజలతోనూ, రైతులతోనూ ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బిపిఎస్ అధికారులపై కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని పోరెడ్డి విజయలక్ష్మి డిమాండ్ చేశారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ