Bhadrachalam godavari varadha:సీఎం KCR త‌క్ష‌ణ ఆదేశాలు భ‌ద్రాద్రికి హెలికాఫ్ట‌ర్‌, ర‌క్ష‌ణ సామాగ్రి

0
3

Bhadrachalam godavari varadha: భారీ వ‌ర్షాల‌తో పాటు ఎగువ‌న వ‌స్తున్న వ‌ర‌ద‌లతో గోదావ‌రి(Godavari) ఉగ్రరూపం దాల్చి ప్ర‌వ‌హిస్తోంది. ప్ర‌కృతి విప‌త్తు నేప‌థ్యంలో ఇప్ప‌టికే భ‌ద్రాచ‌లం(Bhadrachalam) అత‌లాకుత‌ల‌మ‌వుతుంది. ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ ఆదేశాల‌తో వర‌ద(Varadha) ముంపు ప్రాంతాల్లో అన్ని ర‌కాల స‌హాయ‌క, ర‌క్ష‌ణ చ‌ర్య‌లు ప్ర‌భుత్వం చేప‌ట్టింది. సీఎం ఆదేశాల మేర‌కు స్థానిక మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు క్షేత్ర‌స్థాయిలోనే ఉంటూ ప్ర‌భుత్వ యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ప్ర‌జ‌ల‌ను ర‌క్షించే స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగ‌స్వాముల‌వుతున్నారు.

ఊహించ‌ని వ‌ర‌ద‌ల‌కు లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మైపోయాయి. ప్ర‌జా ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, రెస్క్యూ టీంలు తో స‌హా హెలీకాఫ్ట‌ర్ల‌ను అందుబాటులోకి తేవాల‌ని కేసీఆర్ ఇప్ప‌టికే ఆదేశించారు. ఈ మేర‌కు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని రాష్ట్ర ప్ర‌భుత్వ యంత్రాంగం కాపాడుతున్న‌ది.

Bhadrachalam godavari varadha

భ‌ద్రాల‌చం క్షేత్ర‌స్థాయిలో స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న ఖ‌మ్మం జిల్లా స్థానిక మంత్రి పువ్వాడ అజ‌య్ అభ్య‌ర్థ‌న మేర‌కు హెలికాఫ్ట‌ర్‌ను అందుబాటులో ఉంచాల‌ని సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. దీంతో పాటు వ‌ర‌ద బాధితుల‌ను ర‌క్షించేందుకు స‌హాయ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు ఉప‌యోగ‌ప‌డే లైఫ్ జాకెట్లు, త‌దిత‌ర ర‌క్ష‌ణ సామాగ్రిని ఇప్ప‌టికే త‌ర‌లించారు. అద‌నంగా మ‌రికొన్నింటిని త‌ర‌లించాల‌ని సీఏం ఆదేశించారు.

ముంపు గ్రామాల్లో Puvvada

వ‌ర‌ద ముంపు ప్ర‌మాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ తెల్ల‌వారు జామునుండే విస్తృతంగా ప‌ర్య‌టించారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను క‌లిసి త‌క్ష‌ణ‌మే ఖాళీ చేసి పున‌రావాస కేంద్రాల‌కు వెళ్లాల‌ని సూచించారు. గోదావ‌రి వ‌ర‌ద ఉధృతి 68 అడుగుల‌కు పెరిగిన దృశ్య ఇంకా పెరిగి 75 అడుగుల వ‌ర‌కు వ‌స్తుంద‌న్న స‌మాచారం మేర‌కు ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా భ‌ద్రాచ‌లం ప‌ట్ట‌ణం ఎఎంసి కాల‌నీ, సుభాష్ న‌గ‌ర్‌, శాంతి న‌గ‌ర్‌, మిథిలా స్టేడియంలో వ‌ర‌ద నీరు చేర‌డంతో ఆయా ప్రాంత ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు.

అయితే మోకాళ్ల లోతు నీళ్ల‌లో మంత్రి Puvvada స్వ‌యంగా వెళ్లి ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించారు. ముంపుకు గురైన ప‌లు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను తక్ష‌ణ‌మే త‌ర‌లించాల‌ని, అందుకు అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఈ స‌హాయక కార్య‌క్ర‌మాల్లో ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Latest Post  VRA ల స‌మ్మెకు బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ మ‌ద్ద‌తు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here