best telugu quotes

best telugu quotes: తెలుగు బెస్ట్ కొటేష‌న్స్ 2023

motivation-Telugu

best telugu quotes: ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఏదో ఒక ఇబ్బంది త‌లెత్తుతూనే ఉంటుంది. ఎన్నో బాధ‌లు, అవ‌మానాలు, సంతోషాలు, క‌ష్టాలు, సుఖాలు చ‌వి చూడాల్సి వ‌స్తుంది. ఒకానొక స‌మయంలో అంద‌రూ ఉన్నా ఒంట‌రిగా మిగ‌లిపోయే రోజు వ‌స్తుంది. అలాంటి వారు మ‌ళ్లీ జీవితాన్ని జ‌యించాలంటే, గెలుపు బాట ప‌ట్టాలంటే ఈ కొటేష‌న్స్ (best telugu quotes) ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని ఆశిస్తున్నాను.

best telugu quotes: తెలుగు బెస్ట్ కొటేష‌న్స్ 2023

ఆనందాన్ని ఇచ్చేవ‌న్నీ
మ‌న‌కు మంచివి కావు.
బాధ క‌లిగించే వ‌న్నీ
మ‌న‌కు చెడ్డ‌వి కావు.

ప‌నివంతుడు ప‌నిని
విశ్రాంతిగా భావిస్తాడు.
బ‌ద్ధ‌క‌స్తుడు విశ్రాంతిని
కూడా ప‌నిగా భావిస్తాడు.

నీవు ఒక ప‌నిని చేయ‌గ‌ల‌ను అని
న‌మ్మితే ఆ ప‌ని స‌గం పూర్తైన‌ట్లే.

అన‌వ‌స‌ర‌మైన ఆలోచ‌న‌ల‌ను
ప్రారంభంలోనే అణ‌చి
వేయ‌క‌పోతే నువ్వు నీ
మ‌న‌శ్శాంతిని కోల్పోతావు.

ప్ర‌తి దానికి అందం ఉంటుంది.
కానీ అంద‌రూ దానిని చూడ‌లేరు.

వాదించే వారికి నువ్వు ఎంత
త‌క్కువుగా స్పందిస్తే అంత‌
ప్ర‌శాంతంగా ఉండ‌గలుగుతావు.
వేధించే వారికి ఎంత దూరంగా
ఉంటే అంత మ‌న‌శ్శాంతిగా
బ్ర‌త‌క‌గ‌లుగుతావు.

అర్థం లేని కోపం,
గౌవ‌రం లేని బంధం,
బాధ్య‌త లేని య‌వ్వ‌నం,
అలంక‌ర‌ణ‌తో వ‌చ్చే
అందం ఎక్కువ కాలం నిల‌బ‌డ‌వు.

నీకు స‌హాయం చేసిన
వాళ్ల‌ను మ‌రిచి పోవ‌ద్దు.
నిన్ను ప్రేమించిన వాళ్ల‌ను
ద్వేషించ వ‌ద్దు. నిన్ను న‌మ్మిన‌
వాళ్ల‌ను మోసం చేయ‌వ‌ద్దు.

మ‌న‌సులేని మ‌న‌షులు
మ‌న చుట్టూ ఉన్నంత వ‌ర‌కు
మ‌న‌సున్న మ‌నుషుల‌కు
మాన‌సిక బాధ త‌ప్ప‌దు.

ఎక్కువ‌గా ప‌ట్టించుకుంటే
ప్ర‌తి ఒక్క‌టీ బాధిస్తుంది.
కొన్నింటినైనా వ‌దిలేస్తే ఉన్న‌
ప్ర‌శాంత‌తైనా మిగులుతుంది.

ఆనందంగా ఉండేవారు,
త‌మ ద‌గ్గ‌ర ఉన్న‌వాటి
గురించి మాత్ర‌మే ఆలోచిస్తారు.
ఆనందంగా ఉండ‌లేని వారు,
త‌మ ద‌గ్గ‌ర లేనివాటి గురించి
మాత్ర‌మే ఆలోచిస్తారు.

ఒక వృత్తిలో ఉన్న‌త‌
స్థానానికి చేరుకోవాలంటే,
ముందుగా ఆ ప‌ని మీద‌
మ‌న‌కు ఇష్టం ఉండాలి.

మ‌నం ఎవ‌రికి అయితే
ఎక్కువ విలువ ఇస్తామో
వాళ్ల దృష్టిలో మ‌నం చాలా
చుల‌క‌న‌గా క‌నిపిస్తాము.

ఎవ‌డి జీవితం వాడికి బ‌రువే,
ప‌క్క‌నోడి జీవిత‌మే తేలిక‌.
ఎందుకంటే, వాడి జీవితాన్ని
వీడు మోయ‌డు క‌నుక‌.

నీ గ‌మ్యం ఎంత ఎత్తులో
ఉన్న‌ప్ప‌టికీ, దానిని చేరుకునే
మార్గం మాత్రం నీ కాళ్ల కింద
నుండే మొద‌ల‌వుతుంది.

ఒంట‌రిత‌నం అంటే ఎవ‌రూ
లేక‌పోవ‌డం కాదు. అంద‌రూ
ఉన్నా కానీ, మ‌న‌ల్ని అర్థం
చేసుకునే వారు లేక‌పోవ‌డ‌మే
నిజ‌మైన ఒంట‌రిత‌నం.

వ్య‌క్తిత్వం అనేది వెలుగుతున్న‌
దీపంలా ఉండాలి. దీపం
పూరిగుడిసెలో అయినా,
ఇంద్ర‌భ‌వ‌నంలో అయినా
ఒకేలా వెలుగునిస్తుంది.

గుర్తు పెట్టుకో..
అసూయ‌తో బ్ర‌తికే వారికి స‌రైన‌
నిద్ర ఉండ‌దు. అహంకారంతో
బ్ర‌తికేవారికి స‌రైన మిత్రులు
ఉండ‌రు. అనుమానంతో బ్ర‌తికే
వారికి స‌రైన జీవిత‌మే ఉండ‌దు.

మ‌న‌ది కానిది అంగుళం
అవ‌త‌ల ఉన్నా తీసుకోకూడ‌దు.
మ‌న‌దైన‌ది స‌ప్త స‌ముద్రాల‌
అవ‌త‌ల ఉన్నావ‌ద‌ల‌కూడ‌దు.

ప‌రిస్థితులు చూసేవారికి
ఒక‌లాగ అనుభ‌వించే వారికి
ఒక‌లాగ క‌నిపిస్తాయి.
అనుభ‌వించే వారికి ఉన్నంత‌
బాధ చూసే వారికి ఉండ‌దు.

విలువ తెలుసుకోలేనోడు ఎప్ప‌టికీ
సంపాదించ‌లేడు. ఒక వేళ‌
సంపాదించినా నిల‌బెట్టుకోలేడు.
క‌ష్ట‌ప‌డి సాధించుకున్నోడు
వృథా చేయ‌లేడు. ఒక వేళ వృథా చేసినా
తిరిగి సంపాదించుకోగ‌ల‌డు.
అది స్నేహ‌మైనా, డ‌బ్బైనా, ప్రేమైనా.

ఇత‌రుల‌ను బాధ‌పెట్ట‌డానికి
కొన్ని క్ష‌ణాలు చాలు, కానీ
ఆ బాధ‌ను పోగొట్ట‌డానికి
కొన్ని సంవ‌త్స‌రాలు ప‌ట్టొచ్చు.

సువాస‌న‌లు వెద‌జ‌ల్లే పువ్వు
తోట‌కు ఎంత అంద‌మో మంచి
స‌ల‌హాలు ఇచ్చే మిత్రుడు
ఉండ‌టం మ‌న జీవితానికి
అంతే అందం.

మ‌న మంచిత‌నాన్ని ఎదుటి
వ్య‌క్తి చుల‌క‌న చేస్తే, వారికి
స‌మాధానం వారి శైలిలోనే
చెప్పాలి. అలా చెప్తేనే మ‌నం
మ‌న‌లాగా జీవించ‌గ‌లం
ఈ స‌మాజంలో.

మ‌న‌ల్ని అర్థం చేసుకునే
వాళ్ల‌కు, మ‌న రూపంతో
ప‌నిలేదు. మ‌న‌ల్ని బాధ‌పెట్టే
వాళ్ల‌కు, మ‌న మ‌న‌స్సుతో
ప‌నిలేదు.

ఏడుపు వ‌చ్చిన‌ప్పుడు ఒక్క‌రే
ఏడ‌వాలి. న‌వ్వువ‌చ్చిన‌ప్పుడు
న‌లుగురిలో న‌వ్వాలి. అంద‌రిలో
ఏడిస్తే నాట‌కం అంటారు. ఒక్క‌రే
న‌వ్వితే పిచ్చి అంటారు.

రాత్రి ఒంట‌రిగా రాదు.
చీక‌టితో పాటు ఆలోచ‌న‌,
ఆవేద‌న‌ల‌ను తోడుగా
తీసుకొస్తుంది.

ఎవ‌రో వ‌స్తారు, ఏదో చేస్తారు
ఇవ‌న్నీ వ‌ట్టి మాట‌లు. నీ కోసం
ఎవ‌రూ రారు, ఏది చేయ‌రు.
నీకోసం నువ్వు అనుకున్న‌ది
నువ్వే చెయ్‌. అది ప్ర‌య‌త్నం
అయినా, పోరాటం అయినా..

మూర్ఖుల‌తో వాదించే క‌న్నా,
వారు చెప్పేది విని, న‌మ్మిన‌ట్టు
న‌టించి, మౌనంగా త‌ప్పుకుంటే మంచిది.

(best telugu quotes)

మీరు ఎవ‌రినైనా, ఎంతైనా
ప్ర‌సంశించండి. కానీ
విమ‌ర్శించేట‌ప్పుడు మాత్రం
కాస్త జాగ్ర‌త్త‌గా ఉండండి.
ఎందుకంటే విమ‌ర్శ ఋణం
లాంటిది అవ‌తలి వాళ్లు
ఏదో ఒక రోజు వ‌డ్డీతో స‌హా
త‌ప్ప‌క తీరుస్తారు.

జీవితంలో ముందుకెళ్లాలి
అనుకున్న‌ప్పుడు, కాలం నిన్ను
వెన‌క్కి లాగుతుంద‌ని భ‌య‌ప‌డ‌కు,
వెన‌క్కి లాగ‌బ‌డిన బాణ‌మే వేగంగా
ముందుకు వెళ్ల‌గ‌ల‌దు. న‌మ్మ‌కాన్ని
కోల్పోకు, విజ‌యం త‌ప్ప‌క నీద‌వుతుంది.

నిజం చెప్పాలంటే నీతి ఉండాలి.
మంచి చేయాలంటే మ‌న‌సు ఉండాలి.

మ‌నం ఎంత మంచిగా
ఉన్నా, ఎవ‌రో ఒక‌రి క‌థ‌లో
చెడ్డ వాళ్ల‌మే కాబ‌ట్టి
ఇతురుల‌కు న‌చ్చాల‌ని
న‌టిస్తూ బ్ర‌త‌క‌డం క‌న్నా,
మ‌న‌కు న‌చ్చిన‌ట్టు
బ్ర‌తికేయ‌డం మంచిది.

చెప్పుడు మాట‌లు విని నోరు
జారిపోకు. మీరు విన్న‌ది అన్న‌ది
నిజం కాక‌పోతే, ఇప్ప‌టి వ‌ర‌కు
మీ మీద ఉన్న మంచిత‌నం, గౌర‌వం
మంచులా క‌రిగిపోతుంది. ఆ త‌ర్వాత‌
ఎంత బాధ‌ప‌డినా ప్ర‌యోజ‌నం శూన్యం.

త‌న వ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు
మాత్ర‌మే, మ‌నిషికి బాధ విలువ‌
తెలుస్తుంది. అప్ప‌టి వ‌ర‌కు
ఎదుటి వారి బాధ చుల‌క‌న
గానే క‌నిపిస్తుంది.

మ‌న బ‌లం, మ‌న బ‌ల‌హీన‌త‌
రెండూ మ‌నం ప్రేమించిన వారే.
ఊపిరి పోసేది వాళ్లే, ఊపిరి తీసేది వాళ్లే.

గెలిస్తే ఎవ్వ‌రికీ స‌మాధానం చెప్పాల్సిన‌
అవ‌స‌రం లేదు. కానీ ఓడిపోతే నీ స‌మాధానం
విన‌డానికి కూడా ఎవ్వ‌రూ సిద్ధంగా ఉండ‌రు.

మాట్లాడే ముందు ఒక‌టికి
రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి.
ఎందుకంటే మీరు మాట్లాడే మాట‌లు
మీ శ‌త్రువుకి గెల‌వాల‌న్న త‌ప‌న‌ని
మిత్రునికి గెల‌వ‌లేమ‌న్న నిరుత్సాహాన్ని
క‌లిగించ‌వ‌చ్చు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *