Best Love Quotes: టాప్ 20 ప్రేమ క‌విత‌లు చ‌ద‌వండి!

Best Love Quotes: ప్రేమికుల‌కు క‌విత‌లు అంటే ఇష్టం. ఆ క‌విత‌ల‌తోనే త‌మ ప్రేమ‌ను తెలియ‌జేస్తారు. అలానే క‌విత‌ల‌తోనే త‌మ బాధ‌ను వ్య‌క్త ప‌రుస్తారు. ఇలాంటి ప్రేమ క‌విత‌లు, ల‌వ్ కొటేష‌న్లు ఇక్క‌డ చాలా ఉన్నాయి. ఒక్క‌సారి వాటిపైన ఒక లుక్ వేయండి!

Best Love Quotes: ప్రేమ క‌విత‌లు

ప్రేమంటే హృద‌యాన్ని పారేసుకోవ‌డం కాదు.
నువ్వులేన‌ప్పుడు న‌వ్వు నీ, నువ్వున్న‌ప్పుడు
కాలాన్నీ పారేసుకోవ‌డం.

ఎక్క‌డైతే శ‌త్రుత్వం ఉంటుందో
అక్క‌డ ప్ర‌తి మ‌నిషి త‌న కంటూ
ఒక రీజ‌న్ ఏర్ప‌రుచుకొని వాదించ‌డం
ప్రారంభిస్తాడు. ఎక్క‌డ ప్రేమ ఉంటుందో
అక్క‌డ రీజ‌న్ ఉండ‌దు.

పెళ్లైన త‌ర్వాత జీవిత భాగ‌స్వామిని
ప్రేమించ‌డం అన్నిటిక‌న్నా
ఆరోగ్య‌క‌ర‌మైన ప్రేమ‌.

ప్రేమ ఒక లెక్క‌లాంటిది.
సంతోషం గుణ‌కారం, దుఃఖం భాగ‌హారం,
స్నేహం కూడిక‌, శతృత్వం తీసివేత‌.

ఒక‌రి అంద‌రం, అర్హ‌త‌ల వ‌ల్ల‌
మొద‌ట ఆక‌ర్ష‌ణ ఏర్ప‌డి, వారి
ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల అది స్నేహంగా మారి
వ్య‌క్తిత్వం వ‌ల్ల ప్రేమ‌గా మారుతుంది.

ప్రేమించ‌టానికి హృద‌యం
ఉండాలి. ప్రేమింప‌బ‌డ‌టానికి
వ్యక్తిత్వం ఉండాలి.

ప్రేమ‌నీ, ఆక‌ర్ష‌ణ‌నీ ఏ పాయింటు
ద‌గ్గ‌ర విడ‌గొట్టాల‌న్న‌ది ఏ ఐన్‌స్టీనూ
క‌నుక్కోలేదు.

ప్రేమ‌-స్నేహం క‌న్నా పెద్ద‌దైన‌ది.
సెక్స్ క‌న్నా ఉధృత‌మైన‌దీ!

నువ్వంటే నా కెందుకిష్టం అంటే-
నేను విచారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌క్క‌న‌
కూర్చొని ఓదార్చావు. విచారం ఎందుకా
అని ఆలోచించుకునే సంద‌ర్భం
క‌లుగ‌జేస్తావు.

ప్రేమ అనేది చాలా విలువైన‌ది.
దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో
పెట్టుకుంటేనే అది రాణిస్తోంది.

ప్రేమ ఇంధ్ర‌ధ‌న‌స్సు అయితే
ఆ ఏడురంగులూ- ఆక‌ర్ష‌ణ‌, అవ‌గాహ‌న‌,
ఇష్టం, తారాత్మ్య‌త‌, స్ప‌ర్శ‌, కామం, ఓదార్పు.

పండ‌గ‌ల్ని కోల్పోయిన మ‌నం-
బాంధ‌వ్యాల్సి కోల్పోతున్నాం.
ఆట‌ల్ని మ‌ర్చిపోయిన మ‌నం-
స్నేహాల్ని కోల్పోతున్నాం.
జీవితాల్ని యాంత్రికం చేసుకున్న‌
మ‌నం- ప్రే..మ‌ని కోల్పోతున్నాం.

ప్రేమంటే దేవుడు ముదు నిశ్శ‌బ్ధ‌
ధ్యానంలో కూడా అత‌డు నీ జ్ఞాప‌కాల‌లో
నిలిచి ఉండాల‌ట‌.ప్రేమంటే
స‌ముద్ర‌పు చెరో రెండు అంచుల‌
చివ‌ర నిల‌బ‌డ్డా ఈ ద‌రి నుంచి
ఆ ద‌రికి ప్ర‌వ‌హించే త‌రంగ‌ల్లా ఒక‌ళ్ల
స్మృతులు మ‌రొక‌రికి చేరాల‌ట‌!

ప్రోటాను చుట్టూ ఎల‌క్ట్రాను
తిరిగితే అది అణువు అవుతుంది.
అమ్మాయి చుట్టూ అబ్బాయి తిరిగితే
అది ప్రేమ అవుతుంది.

ప్రేమ అన్న ఒక అర్హ‌త‌
వ‌ల్లే మ‌నిషి మిగ‌తా జీవాల్నుంచి
విడిప‌డ్డాడు.

ఒంట‌రిత‌నం వేరు.
ఏకాంతం వేరు. ప్రేమించే వ్య‌క్తి
ఉంటే ఏకాంతంలో ఆ త‌ల‌పు ఇచ్చే
ఆనందం ఏదీ ఇవ్వ‌దు. ప్రేమించ‌టానికి
ఎవ‌రూ లేన‌ప్పుడు ఒంట‌రిత‌నం
అంత భ‌యంక‌ర‌మైన‌ది ఇంకేదీ లేదు.

Best Love Quotes Telugu

ప్రేమ ఎందుకు, ఎప్పుడు, ఎలా,
ఎవ‌రి మీద క‌ల్గుతుందో చెప్ప‌టం
క‌ష్టం. అది జామెట్రీ, ఆల్జీబ్రా కాదు.

ప్రేమంటే శృతిమించిన‌ప్పుడూ,
శుష్కించిన‌ప్పుడూ ఒకేలా ఉండేది.

విశ్వ‌జ‌నీన‌మైన ప్రేమ‌ని చెప్ప‌టానికి
భాషేకావాల‌నుకుంటే, వెదురు బొంగును
పిల్ల‌న‌గ్రోవినే చేసి, ప‌చ్చిక బ‌య‌ళ్ల‌లో
గొర్రెల్ని కాచుకుంటూ పాడుకునే
కాప‌రికి ఏ భాష తెలుసు?

జీవితాన్ని సిగ‌రెట్‌తో పోల్చాడో
భ‌గ్న‌ప్రేమికుడు. దానికి ప్రేమ‌
అనే నిప్పుత‌గ‌ల‌గానే పొగ‌తో సాగి సాగి
బూడిద‌తో పూర్త‌వుతుంద‌ట‌.

గాయం వ‌ల్ల వ‌చ్చిన అరుపు కంటే
గాయం వ‌ల్ల వ‌చ్చిన మ‌చ్చ‌కు
గొంతెక్కువ‌. అది చాలా కాలం బాధిస్తుంది.
ప్రేమ ప‌రిమ‌ళ‌పు ఆహ్లాదం కంటే
ఆ త‌రువాత వ‌చ్చే వియోగ‌పు
ముల్లు బాధే ఎక్కువ‌.

ఎవ‌రి వ‌ల‌న నీ సుఖం రెట్టింపు
అగునో, ఎవ‌రి వ‌ల్ల నీ దుఃఖం స‌గం
దూర‌మ‌గునో అట్టి వారిలో
నీకున్న‌ది ప్రేమ‌.

ప్ర‌పంచ‌మంతా ఆనందంగా
ఉండి, ఒక్క‌డు మాత్రం దిగులుగా
ఉంటే అత‌ను ప్రేమ‌లోఉన్న‌ట్టు,
ఈ రోజు ఒంట‌రిత‌నం, నిన్న‌టి
ద‌గ్గ‌రి త‌నాన్ని మాటిమాటికి గుర్తుకు
తేవ‌డ‌మే ప్రేమ‌.

ప్రేమంటే మ‌నిషి త‌ర్కాన్ని
వ‌దిలి పెట్ట‌డ‌మే క‌దా!.
త‌న ప్ర‌వ‌ర్త‌న త‌న‌కి అంతుప‌ట్ట‌క‌
పోవ‌డం కూడా ప్రేమే!

మొగాడికి సిగ‌రెట్ అల‌వాటయ్యే వ‌య‌స్సు,
ఆడ‌పిల్ల‌కి ప్ర‌పంచ‌మంతా ప్రేమ‌మ‌యంలో
మంచిత‌నంగా క‌నిపించే వ‌య‌స్సు ఒక్క‌టే.
మొగాడికి సిగ‌రెట్ అల‌వాటు అయితే
ఊపిరితిత్తుల‌కి దెబ్బ‌. ఆడ‌పిల్ల‌కి ప్రేమ‌
అల‌వాటు అయితే గుండెల‌కి దెబ్బ‌.

జీవితానికి అర్థం మ‌నం జీవిస్తేనే తెలుస్తుంది.
మ‌ర‌ణానికి అర్థం మ‌న ద‌గ్గ‌రి వాళ్లు మ‌ర‌ణిస్తే
తెలుస్తుంది. ప్రేమ‌కి అర్థం మ‌నం ప్రేమిస్తేనే తెలుస్తుంది.

మ‌నం ప్రేమించే వ్య‌క్తులు చాలా మంది
దొరుకుతారు. మ‌న‌ల్ని ప్రేమించే వ్య‌క్తులు
దొర‌క‌టం క‌ష్టం.

Share link

Leave a Comment