best gmail alternatives: మనం ఆన్లైన్(Online)లో కొన్ని వెబ్సైట్లను చూడాలంటే కచ్చితంగా మెయిల్ అడుగుంది కదా!. ఆ సదరు వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే మన సొంత మెయిల్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత మన జిమెయిల్‌కు ఒక మెయిల్ వస్తుంది. దానిని పెద్దగా పట్టించుకోము. ఆ తర్వాత మనకు కావాల్సిన సమాచారం ఉన్న మెయిల్లో వెతుకుతుంటాము. ఆ వెబ్సైట్లో ఒక 5 నిమిషాలు పాటు, లేదా 10 నిమిషాల పాటు అంత కంటే ఎక్కువుగా ఆ వెబ్సైట్ ఉపయోగాన్ని బట్టి ఆన్లైన్లో ఉంటాం. మనకు కావాల్సిన సమాచారం(best gmail alternatives) తెలుసుకుంటాం.
ఆ తర్వాత సదరు వెబ్సైట్ నుంచి మన మెయిల్(Mail)కు ఇబ్బడి ముబ్బడిగా ఈమెయిల్ మెస్సెజ్‌లు వస్తుంటాయి. అలా కొన్ని వెబ్సైట్లలో మన జీమెయిల్ అకౌంట్‌తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక ఎన్ని మెయిల్స్ వస్తాయో చెప్పనక్లర్లేదు. మన జీమెయిల్ ఒపెన్ చేసుకుంటే ఇన్‌బాక్స్‌లో కొన్ని వందల మెయిల్స్ వచ్చి ఉంటాయి. వాటిని డిలీట్ చేయలేక, ఏం చేయాలో తెలియక అలానే వదిలేస్తాం. దీంతో డేటా ఖర్చు అవుతుంది. కొన్ని కొన్ని సార్లు మెయిల్ కూడా స్లో అవుతుంది. కాబట్టి మీకు అలాంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి సొల్యూషన్‌ను మీకు తెలియజేస్తున్నాం.


www.10minutemail.com ఈ వెబ్సైట్ మీకు చాలా ఉపయోగ పడుతుంది. ఎలా అంటే ఇక మెయిల్లో నోటిఫికేషన్లు బెడద రాకుండా మనకు కావాల్సిన సమయం వరికే వెబ్సైట్ ఉపయోగించేలా టైం చూపిస్తుంది. ఇక నుంచి మీరు మీ ఒరిజినల్ మెయిల్ తో సైన్ అప్ కాకుండా ఈ 10మినిట్స్ మెయిల్(10 minute mail) ను ఉపయోగించుకొని మీకు కావాల్సిన వెబ్సైట్లోకి వెళ్ల వచ్చు. ఒక వేళ ఏదైనా ఓటిపి, కన్మరేషన్ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ ఈ 10మినిట్స్ మెయిల్లో చూపిస్తుంది. అలా ఈ మెయిల్ ద్వారా ఏదైనా వెబ్సైట్లో మీరు 10 నిమిషాలు ఫ్రీగా వాడుకోవచ్చు. ఒక వేళ 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం కావాలంటే 10 మినిట్స్ మెయిల్లో టైం మారే అంకెలు ప్రక్కనే 10 more minutes అనే లింక్ ఉంటుంది. దానిని ఉపయోగించి మరో కొన్ని నిమిషాల పాటు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సారి ఎక్కడైనా వెబ్సైట్లో మెయిల్ ఉపయోగించుకోవాలనుకుంటే ఈ 10 మినిట్స్ మెయిల్ ఉపయోగించుకోండి.
Why would you use this?
Maybe you want to sign up for a site that requires that you provide an e-mail address to send a validation e-mail to. And maybe you don’t want to give up your real e-mail address and end up on a bunch of spam lists. This is nice and disposable. And it’s free. Enjoy!
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!