Best Friendship

Best Friendship: నిజ‌మైన స్నేహితుల స్నేహం ఎలా వుంటుందంటే?

Special Stories
Share link

Best Friendship | ‘A Friend in need is a Friend indeed’ అంటే అవ‌స‌రంలో ఆదుకున్న‌వాడే నిజ‌మైన స్నేహితుడు అని అర్థం క‌దా. స్టూడెంట్‌లైఫ్‌లో త‌ల్లిదండ్రులు, అధ్యాప‌కులు త‌ర్వాత స్నేహితుల పాత్ర ప్రాధాన్య‌త వ‌హిస్తుంది. ముందు ముఖ‌ప‌రిచ‌యంతో మొహ‌మాటంగా మొద‌లై, త‌ర్వాత స‌రదా స‌ర‌దా క‌బుర్ల‌తో కులాసాగా కొన సాగుతూ, ఆ త‌ర్వాత ఇంట్లో ఏం జ‌రిగినా అది చిన్న‌దైనా, పెద్ద‌దైనా స్నేహితుని(Best Friendship) క‌లిసి చెప్పే వ‌ర‌కు మ‌న‌సు కుదుట‌ప‌డ‌ని చిక్క‌టి అనుబంధంగా బ‌ల‌ప‌డుతుంది.

నువ్వే నేను..నేను నువ్వు అన్న‌ట్లుగా ఐక‌మ‌త్యంగా, ఓ క‌ట్టుగా క‌లిసిపోయి ఉంటారు. ఇంటికి తీసుకొచ్చి మా ఫ్రెండ్ అంటూ ప‌రిచ‌యం చేసి, త‌న ఫ్రెండు త‌న ఇంట్లో వాళ్ల‌కి కూడా న‌చ్చాల‌ని త‌హ‌త‌హ‌లా డుతుం టారు. ఇంట్లో పేరెంట్స్‌(Parents)కి కూడా త‌మ పిల్ల‌లు ప‌రిచ‌యం చేసిన ఆ ఫ్రెండ్ న‌డ‌వ‌డిక అది త‌మ‌కి న‌చ్చితే స‌రే ప్రోత్స‌హిస్తారు. లేదంటే నెమ్మ‌దిగా త‌మ పిల్ల‌ల‌కి న‌చ్చ‌జెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తారు.పిల్ల‌ల‌కే కాదు కాలేజీ లైఫులో ఆ త‌ర్వాత వివాహ‌మ‌య్యాక కూడా ఫ్రెండ్స్ కొన‌సాగుతూనే ఉంటారు. కొన్ని స్నేహాలు చిర‌కాలం కొన‌సాగుతుంటాయి. బంధువుల కంటే ఎక్కువుగా స్నేహ‌బంధ‌మే చాలా గాఢంగా క‌న‌బడుతుంటుంది.

Best Friendship: లైఫ్‌లో ఒక స్నేహితుడు ఉండాలి!

నిజ‌మైన స్నేహితుల స్నేహం

నిజానికి సృష్టిలో తీయ‌నిది స్నేహ‌మే క‌దా. ఈ Frienshipకి కుల‌మ‌తాలు, బీద‌గొప్ప‌, ఆడ‌మ‌గ అన్న తార‌త‌మ్యం ఉండ‌దు. అందుకే స్నేహం చిర‌కాలం వ‌ర్థిల్లుతుంది. స‌మ‌యానుకూలంగా, సంద‌ర్భానుసారంగా ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుంటూ స‌ర్వ‌కాల స‌ర్వ‌వ‌స్థ‌ల్లోనూ నేనున్నాన‌ని నిండుగా ప‌లికే తోడు పేరే స్నేహం. మ‌నం ఏదైనా క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు, ఎడ‌తెగ‌ని స‌మ‌స్య‌తో స‌త‌మ‌తమ‌వుతున్న‌ప్పుడు మ‌న‌సుప‌డే ఆరాటాన్ని మ‌రొక‌రితో పంచుకోవాలనుకుంటు న్న‌ప్పుడు మ‌న మ‌న‌స్సులో మెదిలే మొద‌టి వ్య‌క్తి మ‌న స్నేహితులే(Friends). ఒకోసారి ఇంట్లో వాళ్ల‌తో కూడా చెప్పుకోలేని ఎన్నో విష‌యాల‌ను స్నేహితుల‌తో చెప్పుకొని ఎంతో ఊర‌ట చెందుతాం.

స్నేహంతోనే ఓదార్పు, ధైర్యం!

వారి ద‌గ్గ‌ర నుండి ఓదార్పుని పొందుతాం. స‌మ‌స్య ఉంటే చ‌ర్చించి ప‌రిష్కారం చెప్ప‌మ‌ని అడుగుతాం. అందుకే జీవితంలో ఎవ‌రికైనా స్నేహితుల పాత్ర‌, వారి ప్రాధాన్యం చాలా ప్ర‌త్యేకం. వారి అనుబంధ అపురూపం. మీరెప్పుడైనా గ‌మ‌నించారో లేదో కానీ ఎవ‌రూ ఎవ‌రి మ‌ధ్యైనా చొర‌బ‌డ‌తారేమో కానీ స్నేహితుల మ‌ధ్య త‌ల‌దూర్చ‌టానికి ఎవ‌రూ సాహించ‌రు. ఒక వేళ స్నేహితుల(Best Friendship) మ‌ద్య ఎవ‌రైనా చిచ్చుపెట్టాల‌ని చూసినా నా ఫ్రెండ్ అలాంటిది కాదంటూ కొట్టిపారేస్తారు. ఒక వేళ నిజంగా ఏదైనా పొర‌పాటుగా పొర‌పొచ్చ‌లు ఏవైనా వ‌చ్చినా, ఒకరి గురించి ఒక‌రు ఆరాట‌ప‌డ‌పోతూ, ఎప్పుడెప్పుడు ఒక‌రికొక‌రుగా క‌లిసిపోయి ఆత్మీయంగా కౌగ‌లించుకోవాల‌ని ఎదురుచూస్తుంటారు.

నిజ‌మైన స్నేహితుల స్నేహం

త‌మ మ‌ధ్య‌ దూరం తాత్కాలిక‌మే అనుకుంటారు. ఆ స‌మ‌యంలో కూడా ఒక‌రి క్షేమాన్ని మ‌రొక‌రు కాంక్షిస్తారే కాని క‌త్తులు దూయాల‌నుకోరు. ఒక వేళ ఎవ‌రైనా ఎక్క‌డైనా అలా ఉన్నారంటే అది నిజ‌మైన స్నేహం కాద‌న్న‌మాట‌. అందుకే స్నేహం విలువ తెలిసివారు స్నేహ‌మేరా జీవితం..స్నేహ‌మేరా శాశ్వ‌తం అని పాడుకుంటారు.

See also  Haryana Liquor Price List 2022-23 Table

Leave a Reply

Your email address will not be published.