best food for heart: గుండె ఆరోగ్యంగా, పదిలంగా ఉండడానికి ఆరోగ్య నిపుణులు పలు ఆరోగ్యక రమైన ఆహార పదార్థాలను సూచిస్తున్నారు. గుండె రిస్క్‌కు గురికాకుండా ఉండాలంటే తక్కువుగా శాచ్యరేటెడ్ ఫ్యాట్ ఉండే రెడ్‌మీట్, తాజాపండ్లు, కూరగాయలు, ఎక్కువ చేపలు, తక్కువ పంచ దార, ఎక్కువ ఫైబర్ (fiber) తీసుకోవాలి. అత్యధిక ప్రజలు వారికున్న శారీరక స్థితిని అనుసరించి తక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల గుండె జబ్బుల (best food for heart) అవకాశాలు తగ్గుతాయి.
best food for heart: తినాల్సిన ఆహారం ఇదే!
టొమేటోలు (Tomatoes): వీటిలో విటమిన్లు, లైకోపిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తాయి. టొమేటోలు ముక్కలుకోసుకుని Sandwich లతో కలిపి తీసుకోవచ్చు. సలాడ్లు లేదా సాస్ తయారుచేసుకుని తినవచ్చు. అలాగే గోధుమ పాస్తాతో కలిపి తీసుకోవచ్చు. ఉడికించిన టొమేటో సాస్, కేన్ చేసిన సాస్గానీ షాపుల్లో లభిస్తాయి. పండిన టొమేటోల్లో కంటే ఇలా తయారు చేసిన సాస్‌లలో లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్స్, లైకోపిన్ మూలంగానే టొమేటోలు ఎర్రగా ఉంటాయి. ఉడికించిన లేదా కేన్ చేసిన టొమేటో సాస్‌లో ఎక్కువగా లైకోపిన్ వుంటుందని, ఇవి గుండె జబ్బుల రిస్క్ తక్కువగా ఉండటానికి దోహదం చేస్తాయని పలు పరిశోధనలు నిగ్గుతేల్చాయి. రక్తప్రసరణ ను నియంత్రిం చడానికి ఉపయోగపడే విటమిన్ సి, ఇ, ఫ్లేవనాయిడ్స్, పొటాషియం వంటివి నీటిలో పుష్కలంగా లభిస్తాయి.
బ్రొకోలీ (తోటకూర)
బ్రొకోలి (Broccoli), వాటి గింజలు కూరగాయల జాతికిచెందినవి. వీటిలో కెరోటి నాయిడ్స్, ఇండోల్స్ లాంటి రసాయన సమ్మేళనాలుంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కాకుండా నిరోధిస్తాయి. బ్రొకోలిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. బరువుకు బరువు ఉంటుంది. బత్తాయి కంటే ఎక్కువగా ఇందులో విటమిన్ – సి ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే విటమిన్ ఇ, ఉంటుంది. ఇంకా కాల్షియం, బి2 కూడా దండిగా ఉంటాయి. బ్రొకోలిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు నుండి గుండెను రక్షించే సల్ఫరోఫన్ కూడా ఇందులో ఉంది. అందువల్ల గుండెజబ్బులు, గుండెపోటు వంటి రిస్క్‌లు ఉండవు.
దానిమ్మ
ప్రతిరోజు ఒక గ్లాసు దానిమ్మరసం (Pomegranate juice) తీసుకున్నట్లయితే కొలెస్టరాల్ (Cholesterol) మూలంగా జరిగేది నెమ్మదిగా జరుగుతుంది. అలాగే గుండెజబ్బు రిస్క్ తగ్గుతుంది. రక్తపోటు తగ్గుతుంది. రక్తంలో ఆరోగ్యాన్ని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు అధికమవుతాయి.
గుమ్మడికాయ (pumpkin)
గుమ్మడికాయలలో బీటాకెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో చేరిన తర్వాత విటమిన్ – ఎ గా మార్పు చెందుతుంది. బీటాఎరటిన్ శరీరానికి బహుప్రయోజనాలు కలిగిస్తుంది. గుండె (Heart) జబ్బులకు, క్యాన్సర్‌కు, త్వరగా వయస్సు పెరిగి పోయినట్టు కనిపించడానికి కారణమయ్యే ఫ్రీర్యాడికల్స్ ధాతువులను హరించకుండా బీటాకెరోటిన్ (Betacarotene) నిరోధిస్తుంది. ప్రతిరోజు అవసరమైన బీటాకెరోటిన్, గుండెను రక్షించే ఆరోగ్యకర పొటాషియంలో పావువంతు అరకప్పు గుమ్మడికాయ ముక్కలలో లభిస్తుంది.
చేపలు (fish)
రక్తనాళాళ్లో ఆటంకాలు ఏర్పడకుండా, వాపు రాకుండా నిరోధించే గుండెను రక్షించే ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ చేపలలో దండిగా ఉంటాయి. ఇవి కొలెస్టరాల్ లెవెల్స్‌ను కూడా తగినంతగా ఉంచుతాయి. సార్డిన్ చేపలలో మాత్రమే దండిగా ఒమేగా – 3 ఉంటుంది. సన్నని ఎముకలు తీసివేసి చేపలను తీసుకున్నట్లయితే వాటిలో ఖనిజాలు దండిగా లభిస్తాయి.
బెర్రీస్ (Berries)
బెర్రీస్ గుండె (best food for heart) ఆరోగ్యానికి మంచి పౌష్టికాహారం. ఇవి తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందువల్ల తాజా స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ (Blueberries), బ్లాక్ బెర్రీస్, రాస్ప్బెర్రీస్ తి నాలి. తాజా లేదా నిల్వ చేసుకున్న బెర్రీస్‌లో బలమైన పాలిఫినాల్స్, రోగాలపైన పోరాడే యాంటీ ఆక్సిడెండ్లు ఉంటాయి. రెడ్‌వైన్, ద్రాక్ష, చాక్లెట్, గింజలలో కూడా ఈ పాలీఫినాల్స్ సమృద్ధిగా లభిస్తాయి.