best Dental Implants: దంతక్షయం, చిగుళ్ల వ్యాధి, దెబ్బలు తగలటం. ఇలా రకరకాల కారణాలతో చాలా మందికి పళ్లు ఊడిపోతుంటాయి. ఇలాంటి వారికి గతంలో బ్రిడ్జెస్, కట్టుడుపళ్ళు వంటివి అమరు స్తుండేవారు. కానీ ఇప్పుడు అధునాతన డెంటల్ ఇంప్లాంట్స్ best Dental Implants, ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
ఇవి కట్టుడుపళ్లలా పైపైన అమర్చేవి కావు. దవడ ఎముక లోపల దంతమూలం స్థానంలో టైటా నియం ఇంప్లాంటును అమర్చుతారు. చుట్టూ ఎముక పెరిగి స్థిర పడిన తర్వాత ఇంప్లాంటుపై కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది అచ్చం సహజమైన దంతం మాదిరిగా కనిపించడం మాత్రమే కాదు. బలంగానూ ఉంటుంది.
best Dental Implants: ఉపయోగాలు
డెంటల్ ఇంప్లాంట్స్‌ను దవడ ఎముకలో కుదురుకునేలా అమరుస్తారు కాబట్టి ఇవి దాదాపు శాశ్వతంగా ఉంటాయి. మాట్లాడుతున్నప్పుడు కట్టుడు పళ్ళు teeth, కొన్నిసార్లు నోట్లోకి జారి పోవచ్చు. దీంతో మాట ముద్దముద్దగా, తత్తరపోయే ప్రమాదముంది. కానీ ఇంప్లాంట్స్‌తో అలాంటి భయమేమీ ఉండదు. మాట కూడా స్పష్టంగా వస్తుంది.
కట్టుడుపళ్లును తరచూ తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ Implants శరీరంలో ఒక భాగంలా మారిపోతాయి కాబట్టి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి సహజమైన దంతాల్లానే బలంగా ఉంటాయి. అందువల్ల ఇష్టమైన పదార్థాలను హాయిగా తినొచ్చు. ఎలాంటి నొప్పి ఉండదు.
ఎలాంటి సంకోచం లేకుండా ఉండొచ్చు. ఇది ఆత్మవిశ్వాసం పెరగటానికి తోడ్పడుతుంది. ఇంప్లాంట్స్‌ను అమర్చేందుకు పక్కదంతాల పరిమాణాన్ని తగ్గించడం, కదిలించాల్సిన అవసర ముండదు. దీర్థకాలం దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి తోడ్పతాయి. బ్రష్ brush, చేసుకునేప్పుడు ఇంప్లాంట్స్ మధ్యలో కూడా తోముకోవచ్చు. ఫలితంగా నోటి శుభ్రత మెరుగు పడుతుంది. ఇవి చాలా ఏళ్ళ పాటు ఉంటాయి. జాగ్రత్తగా కాపాడుకుంటే జీవితాంతం ఉంటాయి కూడా.
దంత సంరక్షణకు..
Brush చేయడం, అలవాటైన పనే అయినా అందులో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే లాభాలకంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు దంతవైద్యులు. ఎలా అంటే? నిద్రలేవడం ఆలస్యమయిందనో, టిఫిన్‌కి లేటవుతుందనో బ్రష్‌ని నిమిషంలో కానిచ్చేయడం కాదు. రెండు – మూడు నిమిషాలు పళ్లు తోమడానికి కేటాయించాలి. కాబట్టి గడియారం పక్కనబెట్టుకొని మరీ బ్రష్ చేయాలంటున్నారు.
బ్రష్ చేస్తున్నప్పుడు అద్దంలో చూస్తూ ప్రతి దంతాన్నీ, పళ్ల సందుల్నీ జాగ్రత్తగా గమనిస్తే వ్యర్థాలను పూర్తిగా తొలగించవచ్చు. బ్రష్‌ను పట్టుకొని దంతాలపై అడ్డంగా అటూఇటూ గట్టిగా తోమడం వల్ల వాటిపై ఉండే Enamel పొర దెబ్బ తింటుంది. అందుకని బ్రష్‌ను 45 డిగ్రీల కోణంలో పట్టుకొని ఒక సెట్ దంతాలపై వృత్తాకారంలో రుద్దాలి. నమిలే దంతాల పైభాగంలో మాత్రం వృత్తాకారంలో కాకుండా ముందుకూ వెనక్కీ జరుపుతూ బ్రష్ చేయాలి.
teeth పై బలంగా రుద్దడమే బాగా బ్రష్ చేయడం అనుకోవడం పొరపాటు. అలాగని బ్రష్‌ను మరీ తేల్చి చేసినా పనికిరాదు. మధ్యస్తంగా తోమాలి. బ్రష్ కుంచె కూడా మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా లేకుండా చూసుకోవాలి. పళ్లు తోమడం పూర్తయ్యాక బ్రష్‌ని గోరువెచ్చని నీటిలో ముంచి, పొడిగా అయ్యేంతవరకూ బయటే ఉంచితే బాక్టీరియా చేరే ఆస్కారం ఉండదు. అంతేకాదు బ్రష్‌ను ప్రతిమూడు నెలలకూ మార్చాలి.