Best Chief Minister in India 2021 | Naveen Patnaik | Aravind Kejriwal | YS Jagan:బెస్ట్ సీఎంగా నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్, సీఎం జగన్New Delhi: దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో ఒకరుగా ఆంధ్రపదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.జాతీయ వార్త ఛానెల్ ఏబీపీ న్యూస్ చేసిన దేశ్ కా మూడ్ సర్వేలో బెస్ట్ సీఎంలలో మొదటి స్థానంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మూడోవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.
ఏబీపీ న్యూస్ చేసిన సర్వేలో నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో ఉన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ ఈ ఏడాది(2021) జనవరి నెలతో తన పరిపాలన విధి విధానాలపై చేసిన సర్వే ఆధారంగా ప్రథమ స్థానంలో నిలిచారు. రాష్ట్రాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలు, సంక్షేమ పథకాలు అమలు తీరుపై ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రజల స్పందన ఎలా ఉన్నది? అన్నదానిపై ఈ సర్వే జరిగింది. రెండో స్థానంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిలిచారు.
దేశ రాజధాని అయిన ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహిస్తూ ఎలాంటి ప్రేరేపిత ఘటనలకు చోటులేకుండా ప్రజల కు మంచి పాలన అందిస్తున్న సీఎం కేజ్రీవాల్‌పై రాజధాని ప్రజలు మంచి మార్కులే వేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ అత్యంత ఆదరణ పొందారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రెండో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ముందుకు సాగుతున్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు, ఉద్యోగ భర్తీలు, అమ్మవడి, వైయస్ఆర్ ఆసరా, రైతు భరోసా, పేదలుకు ఇళ్ల పట్టాల పంపిణీ, వృద్ధులకు పింఛన్లు పంపిణీ లాంటి అనేక సంక్షేమ పథకాలు సీఎం వైఎస్ జగన్ ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో నేషనల్ ఛానెల్ చేపట్టిన సర్వేలో దేశంలోనే బెస్ట్ సీఎంగా మూడో స్థానంలో నిలిచారు.
ఏబీపీ న్యూస్ ఛానెల్ చేపట్టిన సర్వేలో కొన్ని ప్రశ్నలను ప్రజల ముందు ఉంచింది. ఆ సర్వేలో కేంద్రం పనితీరుకు 60 శాతం మంది నుంచి మంచి స్పందన రాగా, 36 శాతం మంది నుంచి అసంతృప్తి వచ్చింది. మిగిలిన 4 శాతం మంది ఏమీ చెప్పలేమని చెప్పారు. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం సగానికి సగం బీజేపీకి అనుకూలంగా లేరనేది తెలుస్తోందని సర్వేలో వెల్లడైంది.


బెస్ట్ సీఎంలు వీరే…
1.నవీన్ పట్నాయక్ (ఒడిశా)
2.కేజ్రీవాల్ (ఢిల్లీ)
3.వైఎస్ జగన్ (ఆంధ్రప్రదేశ్)
4. విజయన్ (కేరళ)
5.ఉద్దవ్‌ఠాక్రే (మహారాష్ట్ర)
6.భూపేశ్ బఘేల్ (ఛత్తీస్‌గఢ్)
7. మమతా బెనర్టీ(పశ్చిమబెంగాల్)
8. శివరాజ్ సింగ్(మధ్యప్రదేశ్)
9.ప్రమోద్ సావంత్(గోవా)
10.విజయ్ రూపానీ(గుజరాత్)
ఇది చదవండి: వ్యాక్సినేషన్ వద్ద బీజేపీ నేతల ఆందోళన