Stop Smoking

Stop Smoking : ఊపిరితిత్తుల‌కు ‘పొగ’ పెట్టొద్దు!

Spread the love

Stop Smoking : ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం. దీని వ‌ల్ల ఎంతో మంది ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. పొగ తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్‌కు గుర‌వ్వుతున్నారు. పొగ తాగ‌డం వ‌ల్ల ఊపిరితిత్తులు పాడై మ‌ర‌ణానికి దారి తీసే ప‌రిస్థితి ఎక్కువుగా ఉంది.


Stop Smoking : సిగ‌రెట్లు మానేసిన మూడు నెల‌ల త‌ర్వాత మీ ఊపిరితిత్తుల్లోని సీలియా అనే కేశ‌సా దృశ్య‌మైన నిర్మాణాలు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌డం ప్రారంభ‌మ‌వుతాయి. దీంతో ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన తార్ వంటి మ‌లినాలు క‌ఫంతో పాటు వెలుప‌లికి ద‌గ్గుతో పాటు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయి. దీని త‌ర్వాత మీరు బ‌స్ కోసం ప‌రిగెత్తినా, మెట్లు ఎక్కినా ఆయాసం రాదు.

  • ధూమ‌పానం ఆపిన త‌ర్వాత ఊపిరితిత్తుల‌కు సోకే క్యాన్స‌ర్ అవ‌కాశాలు త‌గ్గుతాయి. 10 ఏళ్ల త‌ర్వాత క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు క‌నీసం 50 శాతం త‌గ్గుతాయి.
  • సిగ‌రెట్లు మానేసిన ఏడాది త‌ర్వాత గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం స‌గానికి స‌గం త‌గ్గుతుంది. 15 సంవ‌త్స‌రాల త‌ర్వాత దాదాపు మీరు సిగిరెట్లు అల‌వాటు ప్రారంభం నుంచి లేనివారితో స‌మాన‌మైపోతారు.
  • ప్ర‌స్తుతం భార‌త‌దేశంలో ధూమ‌పానం చేసేవారికంటే చేయ‌నివారే ఎక్కువ‌. ధూమ‌పానం మానేస్తే మీరు కూడా అత్య‌ధికులు ఎంచుకున్న మార్గంలోకి వ‌స్తారు.
  • మ‌న దేశంతో పోలిస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో క్ర‌మంగా ధూమ‌పానం చేసే వారి సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతోంది. మ‌నం అన్ని విష‌యాల్లోనూ విదేశాల మోజులోప‌డి ప్ర‌భావిత‌మ‌వుతున్న‌ప్పుడు ఈ విష‌యంలో మాత్రం ఎందుకు ప్ర‌భావితం కాకూడ‌దు?
  • బార్ల‌లోనూ, రెస్టారెంట్ల‌లోని స్మోక్ ఫ్రీ జోన్స్ అనేవి ఉంటున్నాయి. ఇలాంటి రెస్టారెంట్ల‌ను ఆద‌రిస్తే క్ర‌మంగా అంద‌రు య‌జ‌మానులు ఈ దిశ‌గా ఏర్పాటు చేస్తారు.
  • సిగ‌రెట్లు మానేసిన కొన్ని గంట‌ల్లోనే మీ శరీరం నుంచి ప్ర‌మాద‌క‌ర‌మైన కార్బ‌న్‌మోనాక్సైడ్ గ్యాస్ బ‌హిర్గ‌త‌మైపోతుంది. రెండు మూడు నెల‌ల త‌ర్వాత మీ ఊపిరితిత్తులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌డం మొద‌లు పెడ‌తాయి. హాయిగా, ఊపిరితిత్తుల నిండుగా గాలి పీల్చుకోగ‌లుగుతారు.

ధూమ‌పాన విషానికి ఉల్లిగ‌డ్డ‌!

ఉల్లి చేసిన‌మేలు త‌ల్లికూడా చేయ‌లేద‌నే సామెత ప్ర‌కారం ధూమ‌పాన బాధితులంతా ఉల్లిగ‌డ్డ త‌మ‌ను త‌మ త‌ల్లికంటే మిన్న‌గా కాపాడుగ‌లుగుతుంద‌ని ఎల్ల‌వేళ‌లా గుర్తించుకోవాలి. రోజూ రెండుపూట‌లా అన్నంలో ఒక ఉల్లిగ‌డ్డ‌ను తినాలి. కూరన్నంలో, మ‌జ్జిగ‌న్నంలో ఉల్లిగ‌డ్డ ముక్క‌ల‌ను క‌లిపి తిన‌వ‌చ్చు. లేదా అలా తిన‌డం అల‌వాటు లేనివాళ్లు ఉల్లిగ‌డ్డ‌ను దంచి తీసిన ర‌సం 25 గ్రాములు మోతాదుగా ఉద‌యం ప‌ర‌గ‌డుపున సేవించ‌వ‌చ్చు. ఈ విధంగా నియ‌మం త‌ప్ప‌కుండా రోజూ సేవించ‌డం వ‌ల్ల ధూమ‌పానం విషం శ‌రీరంలో ఎక్క‌డెక్క‌డ పేరుకొని ఉందో అదంతా నిర్వీర్య‌మై బ‌హిష్క‌రింప‌బ‌డుతుంది.

Nitrogen gas smoke: ముఖానికి క‌వ‌ర్‌తో నైట్రోజ‌న్ గ్యాస్ పీల్చి యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

Nitrogen gas smoke: Hyderabad: నైట్రోజ‌న్ గ్యాస్ పీల్చుకుని ఓ యువ‌కుడి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద సంఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో చోటుచేసుకుంది. సైఫాబాద్ పోలీసులు క‌థ‌నం ప్ర‌కారం..తూర్పు Read more

Castor Oil for hair: జుట్టుకు ఆమ‌దం నూనె అబ్బే అనేవారి కోస‌మే ఇది!

Castor Oil for hair | ఈ కాలంలో చ‌ర్మంతో పాటూ జుట్టుకు సంబంధించిన ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి. అలాంటివ‌న్నీ దూర‌మై మృదువైన శిరోజాలు సొంతం Read more

Urinary Infections: మూత్రంలో మంట, ఇత‌ర స‌మ‌స్య‌లు సుల‌వైన చిట్కాలివే!

Urinary Infections | త‌ర‌చూ అకార‌ణంగా వ‌చ్చే చ‌లిజ్వ‌రం, వికారం, వాంతి, పొత్తిక‌డుపులో నొప్పి, చిరాకుగా ఉండ‌టం, మూత్రంలో దుర్వాస‌న‌, మూత్రానికి ప‌దే ప‌దే వెళ్లాల్సి రావ‌డం, Read more

man beauty tips: పురుషులు అందంగా క‌నిపించాలంటే ఏఏ చిట్కాలు పాటించాలి?

man beauty tips | ప్ర‌స్తుత కాలంలో మ‌హిళ‌ల్లో మాదిరే పురుషుల్లో కూడా వారి అందంపై ఎక్కువ ఇంట్రెస్టు చూపిస్తున్నారు. అందంగా ఉండ‌టానికి అందంగా క‌న‌బ‌డ‌టానికి వారు Read more

Leave a Comment

Your email address will not be published.