benefits of Sapota | సపోటా ఉష్ణ మండలాల్లో పండే సంవత్సరానికి రెండు కాపులు ఇచ్చే పండు. సంవత్సరమంతా దీని పూత ఉంటూనే ఉంటుంది. దీనిలో Latex అధికంగా ఉండటం వల్ల దీనిని కోసేంత వరకూ పండదు. కొన్ని పండ్లు గుండ్రంగా ఉంటాయి. కొన్ని అండాకారంలో ఉంటాయి. సపోటా చాలా తియ్యగా ఉండి ఆరోగ్యాన్నిచ్చే రుచిగల పండ్లలో చాలా మంచి వాటిలో ఒకటి. భారతదేశంలో, Pakistan, మెక్సికోలో ఈ పండును పెద్ద పరిమాణంలో పండిస్తారు.
Chikoo Health benefits
Sapotaలో ఉండే పీచు మంచి సుఖవిరోచనకారిగా పనిచేస్తుంది. దీనిలోని పీచు మలబద్ద కాన్ని తగ్గించి పెద్ద పేగులోని మ్యూకస్ పొరను కాపాడి దాని ద్వారా Cancerకు కారణమయ్యే విషాలను దూరం చేస్తుంది. ఈ పండులో antioxidant, ఫాలీఫెనోలిక్ మిశ్రమం టానిక్ ఉంది. టానిన్‌లు ఆమ్లాన్ని నిష్ఫలం చేసే ప్రోటీన్లు ద్వారా పనిచేసే ఫాలీఫెనాల్స్ కుటుంబానికి చెందినవి. పరిశోధనలు టానిన్లు బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా, వైరస్‌కు వ్యతిరేకండా పర్నాభుక్తులకు వ్యతిరేకంగా నొప్పులు, వాపులు, మంటలకు వ్యతిరేకంగా పనిచేస్తాయని వైద్యులు తెలుపుతున్నారు. రక్తం గడ్డకట్టడానికి నరాల్లో రక్తస్రావం ఆపడానికి అతి సారాన్ని తగ్గించడానికి ఉపయోపడుతుంది.
ఈ Fruit నొప్పులను మంటలను తగ్గించే గుణం వల్ల గ్యాస్ట్రయిటీస్ ఇతర అన్నవాహిక నొప్పిని, చిన్న పేగు నొప్పిని ఇతర పేగుల్లోని ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది. సపోటాలో Vitamin– ఎ కూడా ఉంది. కంటి చూపుకు విటమిన్ ఎ అవసరం అలాగే ఆరోగ్యవంతమైన చర్మం కోసం, మ్యూకస్ పొర సరిగ్గా ఉండటం అవసరం. ప్రకృతి సిద్ధమైన పండ్లును విటమిన్-A ఎక్కువ ఉన్నవాటిని తినడం ద్వారా ఊపిరితిత్తులు నోటి క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు.


విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలపడి వివిధ రకాల అంటువ్యాధుల నుండి రక్షణ కల్పించటానికి చెడు చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను బయటకు పంపించడానికి సహాయపడుతుంది. పండిన తాజా sapotaలలో ఫొటాషియం రాగి, ఇనుము మొదలైన మినరల్స్ ఫొలేట్ నైసిన్ పాన్‌టోథెనిక్ ఆమ్లం మొదలైన విటమిన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యానికి జీవన ప్రక్రియలు సరిగ్గా జరగడానికి చాలా అవసరం. వీటిలో ఇన్ని(benefits of Sapota) ఆరోగ్య లాభాలు, పోషకాలు ఉన్నాయి కాబట్టీ ఇవి Wonder Fruit.