benefits of Milk for Skin

benefits of Milk for Skin: ప‌చ్చిపాల‌తో ముఖంకు మెరుపు సొంత‌మ‌వ్వ‌డం ఖాయం

Health News

benefits of Milk for Skin ముఖంపై మొటిమ‌లు, వాటి తాలూకు మ‌చ్చ‌లు ఇబ్బంది పెడుతుంటాయి క‌దా..ఒక్కోసారి స‌మ‌స్య తీవ్ర‌మై యాక్నెగా మారుతుంది. దీన్ని నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వంటింటి ప‌దార్థాల‌తోనే కొన్ని నియ‌మాలు పాటిస్తే మేని మెరుపు సొంత‌మ‌వ్వ‌డం ఖాయం.

ప‌చ్చిపాల‌తో అందం!

దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె క‌లిపి రాత్రి ప‌డుకునే ముందు స‌మ‌స్య ఉన్న చోట రాసుకోవాలి. మ‌ర్నాడు గోరు వెచ్చ‌టి నీళ్ల‌తో క‌డిగేసుకొంటే మొటిమ‌లు, వాటి తాలూకు మ‌చ్చ‌లు దూర‌మవుతాయి. క‌మ‌ల లేదా నారింజ తొక్క‌ల‌ను మిక్సీలో వేసి మెత్త‌గా చేసి కాసిని పాలు(Milk) కల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూత‌లా వేసుకోవాలి. ఇరువై నిమిషాలయ్యాక క‌డిగేసుకుంటే(benefits of Milk for Skin) ఫ‌లితం ఉంటుంది. వేరు శ‌న‌గ నూనెలో నాలుగు చుక్క‌ల నిమ్మ‌ర‌సం చేర్చి ముఖానికి పెట్టుకొని స్నానం చేస్తే న‌ల్ల‌మ‌చ్చ‌లు దూర‌మ‌వుతాయి. అలానే పుదీనా ఆకుల‌ను మెత్త‌గా చేసి ర‌సం తీసి రాసుకున్నా చ‌క్క‌టి ఫ‌లిత‌ముంటుంది.

మెంతి ఆకుల‌ను రుబ్బి యాక్నె స‌మ‌స్య ఉన్న చోట పూత‌లా(Skin) రాసుకోవాలి. మ‌ర్నాడు క‌డిగేస్తే స‌రిపోతుంది. ఇలా త‌రుచూ చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య త్వ‌ర‌గా త‌గ్గుముఖం ప‌డుతుంది. వేపాకుల‌ను మెత్త‌గా నూరి అందులో చిటికెడు ప‌సుపు క‌లిపి రాసుకొని అర‌గంటయ్యాక క‌డుక్కోవాలి. దీనివ‌ల్ల చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌న్నీ దూర‌మ‌వుతాయి. ప‌చ్చిపాల‌లో నిమ్మ‌ర‌సం క‌లిపి త‌రుచూ మేనిపై తుడుచుకోవ‌డం వ‌ల్ల తైల‌గ్రంథులు మూసుకుపోయి ఈ స‌మ‌స్య ఇబ్బంది పెట్టందు. అలానే చంద‌నం పొడిలో నాలుగు చుక్క‌ల గులాబీనీళ్లు క‌లిపి ముఖానికి రాసుకోవాలి. ప‌ది నిమిషాలయ్యాక క‌డిగేస్తే ఈ స‌మ‌స్య అదుపులో ఉండిమేనిగా క‌ళ‌గా త‌యార‌వుతుంది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *