Benefits of Kharbhuja | ఖర్భూజా పండు ఆరోగ్యాన్నిచ్చే అద్భుత వనరుల ఖజానా. దీనిలో పోషకాలు ఎక్కువుగా ఉన్నాయి. దీనిని పండ్లకు రాజాధిరాజుగా చెప్పవచ్చు. Summer Season మనకు విరివిగా దొరకుతాయి. వీటిలో ఉండే అధిక శాతం నీరు వాటిని చల్లదనాన్ని ఇచ్చేవిగా, తినేవారి శరీరంలో Water శాతాన్ని నింపేవిగా ఉంచుతుంది. ఇది చక్కటి సువాసనను కలిగి ఉండటమే కాక ఎంతో రుచిగా కూడా ఉంటుంది. వీటి విత్తనాలు కూడా మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి.
ఒక Kharbhuja ముక్కలో 53 క్యాలరీల శక్తి, 12 గ్రాముల పిండి పదార్థాలు, ఒక గ్రాము మాసంకృత్తులు, ఒక గ్రాము పీచు, 23 మిల్లీగ్రాముల సోడియం, 5,276 Vitamin-A, 33 మైక్రోగ్రాముల ఫోలిక్ ఆమ్లం, ఒక మిల్లీగ్రాము కంటే తక్కువ విటమిన్ B6, 57 మిల్లీగ్రాముల సి విటమిన్, 14 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 19 మిల్లీగ్రాముల మెగ్నీషియం, 417 మిల్లీగ్రాముల పొటాషియం, 3,219 మైక్రో గ్రాముల Carotenoids ఇంకా నియాసిన్ ఉంటాయి.
Benefits of Kharbhuja | ఆరోగ్య ప్రయోజనాలు
ఖర్భూజా రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. Kharbhuja పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంది. దాని వల్ల మన శరీరంలో తెల్ల రక్తకణాలు ఉత్తేజితమైన రోగ నిరోదక వ్యవస్థ మెరుగుపడుతుంది. తెల్ల రక్త కణాలు మన శరీరంలో సహజ సిద్ధంగా ఉండే రక్షణ వ్యవస్థ. ఇవి మన శరీరంలోకి బయటి కణజాలాలు ప్రవేశించకుండా వాటిపై దాడి చేస్తాయి. అలాగే మన శరీరంపై దాడి చేసే అంటు వ్యాధులను ఎదుర్కొని బయటకు తోసివేస్తాయి. శక్తివంతమైన Antioxidant విటమిన్ సి మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్‌పై దాడి చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ మన చర్మాన్ని పాడు చేస్తాయి.
అంతే కాకుండా ముందుగా వయసు మీద పడినట్టు కనిపించేట్టు చేస్తాయి. అందుచేత మన శరీరంలో ఖర్పూజాలను తినడం వల్ల వయసు మీద పడినట్టు కనిపించకుండా చేసుకోవచ్చు. మలబద్దకాన్ని పారద్రోలేందుకు ఖర్భూజాలో పీచు పదార్థాలు మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు తేలికగా బయటకు పంపబడతాయి. మలబద్ధకం రాదు.


ఖర్భూజాలో బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, ఎ, సి విటమిన్లు అధికస్థాయిలో ఉంటాయి. Vitamin-A శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. మన కంటి చూపులు ఇది చాలా ముఖ్యం. ఖర్భూజాలోని యాంటీ యాక్సిండెంట్లు చర్మానికి నునుపును, మెరుపును ఇస్తాయి. శరీరంలోని మ్యూకస్ పొరలను సరైన స్థితిలో ఉంచుతుంది.