benefits of carrots: రోజుకొక కేర‌ట్ తినడం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజనాలెన్నో తెలుసుకోండి!

benefits of carrots: ప్ర‌పంచ‌మంత‌టా ప్ర‌జ‌లు తినే కాయ‌గూర‌ల‌లో ప్ర‌సిద్ధి చెందిన‌ది కేర‌ట్‌. ఆకుప‌చ్చ‌ని కేర‌ట్ ఆకుల‌లో కూడా మాంసకృతులు, ఖ‌నిజాలు, విట‌మిన్లు స‌మృద్ధిగా ఉంటాయి. కేర‌ట్‌లో ముఖ్యంగా రెండు ర‌కాల ఉన్నాయి. ఒక ర‌కం పెద్ద‌గా, ముదురు రంగులో వుండి రుచిలో తియ్య‌గా ఉంటుంది. ఇంకొక రకంపైన ప‌చ్చ‌గా ఉండి, త‌క్కువ నార క‌లిగి చూడ‌టానికి ముచ్చ‌ట‌గా ఉంటుంది.

కేర‌ట్‌లో vitamin A ఎక్కువుగా ఉంటుంది. కేర‌ట్ తిన్నాక అందులోని కేరోటిన్ శ‌రీరంలో విట‌మిన్ ఏ గా మారుతుంది. కేర‌ట్‌లో ఖ‌నిజాలు ఉండ‌టం వ‌ల్ల కేర‌ట్‌ని తొక్క తీసి తిన‌కూడ‌దు. కేర‌ట్లోని క్షార ప‌దార్థాలు దేహంలోని ర‌క్తాన్ని శుభ్ర‌ప‌రుస్తాయి.

ఇక కేర‌ట్ జ్యూస్‌(benefits of carrots)కి ఎంతో విలువ ఉంది. అద్భుత ఫ‌లితాలు ఇచ్చే దీనిని మిరాకిల్ జ్యూస్ అని అంటారు. కంటి చూపు పెంచి, చ‌ర్మానికి కాంతి తెచ్చే దివ్య ఔష‌ధం ఇది. అజీర్ణానికి, విరోచ‌నాల‌కు కూడా కేర‌ట్ మంచి మందు క్రింద ప‌నిచేస్తుంది. చిన్న పిల్ల‌ల‌కు క‌డుపులో వ‌చ్చే నులి పురుగుల‌ని నిర్మూలించ‌డానికి కేర‌ట్‌ని ఉప‌యోగిస్తారు. మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉండ‌టానికి అంటు వ్యాధులు సోక‌కుండా ఉండ‌టానికి కేర‌ట్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

కేర‌ట్‌ను స‌గం ఉడికించిన కోడిగ్రుడ్డులో ఒక చెంచా తేనె క‌లిపి తీసుకుంటే పురుషుల సెక్స్ సామ‌ర్థ్యం పెరుగుతుంది. రాజ‌స్థాన్‌లో కొన్ని గ్రామాల‌లో గ‌ర్భ నిరోధానికి ఎండిన కేర‌ట్ గింజ‌ల‌ని న‌మిలి తిని స్త్రీలు వైద్యుల‌కే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నారు. వైద్యులు జ‌రిపిన శాస్త్రీయ ప‌రిశోధ‌న‌లో ఈ ప‌ద్ధ‌తి స‌త్ఫ‌లితాలు ఇస్తుంద‌ని రుజువైంది. రోజుకు ఒక కేర‌ట్ చాలు. ఆరోగ్యానికి అదే మేలు అని ఇక తెలుసుకోండి.

రోజూ క్యారెట్ తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు!

కంటిపైన రంగులో క‌నిపించే క్యారెట్ చ‌క్క‌ని రుచితోనూ నోరూరిస్తుంది. రోజూ ఒక‌టి చొప్పున దీన్ని తిన‌గ‌లిగితే ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చు అంటున్నారు పోష‌కాహార నిపుణులు. అల్స‌ర్లు, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లూ అదుపులో ఉంటాయి. అంతే కాదు మ‌ల‌బ‌ద్ధ‌కం రెండు నెల‌ల్లోనే అదుపులోకి వ‌స్తుంది.

ఇందులో అధిక మోతాదులో ల‌భించే బీటాకెరోటిన్ విట‌మిన్ ఎ గా మారుతుంది. ఇది కాలేయాన్ని, క‌ళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో కీల‌కంగా ప‌నిచేస్తుంది. శ‌రీరంలో విష వ్య‌ర్థాల ను బ‌య‌ట‌కు పంపిస్తుంది. శ‌రీరంలోని ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గించే యాంటీసెఫ్టిక్‌గా కూడా ప‌నిచేస్తుంది. గోళ్లు, జుట్టు బ‌లంగా పెర‌గ‌డంతో పాటు చ‌ర్మానికి తాజాద‌నాన్ని అందిస్తుంది. మంచి ఛాయ కావాల‌నుకునేవారు రోజూ కేర‌ట్ తిన‌డం అల‌వాటు చేసుకోండి!.

Share link

Leave a Comment