belly fat burn food: ఏం తినాలన్నా ముందుగా మనసులో తలెత్తే ప్రశ్న ఇది కొవ్వుని కానీ పెంచుతుందా? అని. ప్రతి ఆహారం ఆ కోవలేకా రాదు. కొన్ని పదార్థాలు కొవ్వుని కరిగిస్తాయి కూడా. అవేంటో చూద్దాం. తాజా పండ్లూ, కాయగూరల్లో ఉండే పొటాషియం కొవ్వుని కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వీటిని తినప్పుడు అవి నిధానంగా జీర్ణమవుతాయి. శక్తిని కూడా ఒక్కసారిగా కాకుండా నిదానంగా విడుదల చేస్తాయి. అదే పోటాషియం ప్రత్యేకత. ఫలితంగా శరీరంలో కొవ్వు నిల్వలు(belly fat burn food) పేరుకోకుండా ఉంటాయి.
కొవ్వును కరిగించే ఆహారం
వర్షం పడుతున్నప్పుడు ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో మొక్కజొన్న పేలాలు తినడానికి ఆసక్తి చూపిస్తాం కదా!. వాటికి ఉండే అదనపు ప్రయోజనం కొవ్వుని అదుపులో ఉంచడం. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లూ, పీచు సమృద్ధిగా ఉంటాయి. దీనికి వెన్న, ఇతరత్రా పదార్థాలు కలపకుండా కాస్తంత ఉప్పు మాత్రమే చేర్చి తీసుకుంటేనే ఆ లాభాలు పొందవచ్చు. గ్లైసమిక్ స్థాయిలు తక్కువుగా ఉండే ముడి బియ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండటంతో పాటూ వాటిల్లోని పీచూ, సెలీనియం వంటివి ఆకలిని అదుపులో ఉంచుతాయి. దాంతో శరీరంలో కొవ్వు త్వరగా పేరుకోదు. కొలెస్ట్రాల్, బీపీ సమస్యలూ అదుపులో ఉంటాయి.

పప్పు ధాన్యాలూ, వివిధ రకాల తృణధాన్యాలూ పీచుని పుష్కలంగా అందించి శరీరంలో కొవ్వు పేరుకోకుండా చేస్తాయి. ఎప్పుడూ ఒకే రకం కాకుండా కొత్త రకాల తృణధాన్యాలని ప్రయత్నించాల నుకున్నప్పుడు వాటితో జావల్లాంటివి చేసుకోండి. ఫలితాలు బాగుంటాయి. కొవ్వు అధికంగా ఉండే పాల మీగడను ఉపయోగిం చాల్సిన వంటకాల్లో ప్రత్యామ్నాయంగా కమ్మని పెరుగుని వాడితే పోషకాలు అంది కొవ్వు సమస్య ప్రసక్తే ఉండదు. పచ్చిమిర్చిని కూరల్లో వాడితే దానిలోని ప్రత్యేక గుణాలు కెలోరీలను కరిగించేస్తాయి.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!