Belli Lalitha Akka(Udyamala Tholipoddu):తెలంగాణ ఉద్యమంలో మహిళల పోరాటాలకు ప్రత్యేక స్థానం ఉంది. వారి పోరాటలు గురించి ఇప్పటికే కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. వారిలో ఒకరు బెల్లి లలితక్క. ఆమె పాట…మాటకు తెలంగాణ ఉద్యమాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు తక్కింది. ఉద్యమాల తొలిపొద్దుగా ఆమె గొంతెత్తి పాట పాడితే రోమాలు నిక్కరపొడిచే అంతగా ఉద్యమ తీరును కళ్ల ముందు చూపిస్తుంది . కానీ బెల్లి లలితక్కను అతి దారుణంగా చంపారు కొందరు. ఎంతలా అంటే ఆమె శరీరాన్ని 17 ముక్కలుగా చేశారట. ఆమె ఉద్యమ తీరును ఇప్పటికీ గుర్తు చేసుకునే అభిమానులు తెలంగాణలో యావత్తు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ కింద తెలిపిన పాటను Lyrics & Singer: Vainala Ramesh, Music: Bharath Kumar mekala ఇద్దరు ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ పాట బెల్లి లలితక్క ఉద్యమ స్పూర్తి, ఆమె మరణం తీరును పొందుBelli Lalitha Akka(Udyamala Tholipoddu) పరుస్తూ పాడారు.


Udyamala Tholipoddu Telugu lyrics
ఉద్యమాల తొలిపొద్దువని- ఎగిరే ఎర్రని జెండవని (2)
భువనగిరి సింధూరమని-చెదిరిపోయినా మా చెల్లెవని (2)
అలుపెరగని పాటవే బెల్లి లలితక్క- నీ పాటకు ప్రణవిల్లనే నింగిలో ప్రతిచుక్క (2)
||ఉద్యమాల||
పూట గడవని ఇంటిలో పుట్టిన పులిబిడ్డవు నీవమ్మా
ఆటలాడే పసిప్రాయము వెతికెను ఆశయాల బాటమ్మ
ప్రశ్నలన్నీ ఒక పాటకు మలిచిన పల్లె తల్లి నీవమ్మా
కథలు చెప్పుతూ యతలు పాడినవ్ కథనే కోయిలమ్మా
పాటపైన ప్రతికారం చూపిన పాడులోకం ఇదిరా (2)
పదిహేడు ముక్కలై ప్రజల గుండెలో నిలిచిపోయి కదరా (2)
నీ నెత్తురు తడిసిన నేలన- మొలకెత్తిన గొంతై పాడనా
అలుపెరగని పాటవే బెల్లి లలితక్క- నీ పాటకు ప్రణవిల్లనే నింగిలో ప్రతిచుక్క (2)
||ఉద్యమాల||
చెమట చుక్కలతో రాసిన పాటలు చెలిమిలా ఊటలాయే (2)
పదును పెట్టి నీ గొంతు నుండి పాలకులపై చేసే దాడే (2)
కరుడు కట్టిన కాలనాగుల కలలే చెదిరిపాయే
ప్రజల గొంతుపై ప్రజాస్వామ్యమే చేయతగునా ఈ దాడే
ఎర్రమల్లెలు వేసిన బాటలు చిన్నబోయి వెతికే
నేల రాలిన గాన కోకిల పాడలేని పలుకే
జోహార్లే బెల్లి లలితక్క-సాగిస్తము పోరును మేమింక
అలుపెరగని పాటవే బెల్లి లలితక్క- నీ పాటకు ప్రణవిల్లనే నింగిలో ప్రతిచుక్క (2)
||ఉద్యమాల||


belli lalitha, belli lalitha songs, folk singer belli lalitha, telangana songs, belli lalithaka songs, singer belli lalitha, telangana janapada geethalu, belli lalitha news songs, belli lalitha telangana songs, telangana janapada patalu, latest telangana songs,ఉద్యమాల తొలి పొద్దువని, బెల్లి లలితక్క సాంగ్, బెల్లి లలిత, తెలంగాణ గాన కోకిల, తెలంగాణ ఉద్యమ నాయకురాలు, ఉద్యమ మహిళ.