Beer benefits: బీరు ఇది 14 సంవత్సరాల పిల్లవాడి నుంచి 60 సంవత్సరాల మగ/ఆడ అందరూ ఇష్టపడే మద్యపానం. కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, సంతోషంలో ఉన్నా, చావు కాడైనా, శుభకార్యంకాడైన అత్యధికంగా తాగే పానియం బీరు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది అన్న వారూ ఉన్నారు.
చెడు చేస్తుందని చెబుతున్నవారూ అంతే శాతంలో ఉన్నారు. అయితే బీరు అనేది మాత్రం అన్ని మద్యపానాలు కంటే మాత్రం శరీరానికి అంత త్వరగా ఎఫెక్ట్ చూపదు. అయితే ఇటీవల బీరు(Beer)తాగడం వల్ల గుండెకు మంచిదనేది ఒక అధ్యయనంలో తేలింది. అది ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం!
Beer benefits: బీరు యొక్క ప్రయోజనాలు!
1.బీరు రోజూ మితంగా తాగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందట. గుండె జబ్బు ఉన్నవారు కూడా బీరు తాగవచ్చట. అయితే అది అతిగా తాగకపోవడం మంచింది కాదని చెబుతున్నారు.
2.ఆల్కహాలిక్ ద్రాక్షరసం, వైన్ కంటే బీర్లో ఎక్కువ ప్రోటీన్, విటమిన్ బి ఉంటుందట. బీర్ లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయని, వివిధ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
3.తాగడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట. ఇటీవల 70 వేల మందిపై జరిపిన ఓ అధ్యయనంలో వారానికి 14 గ్లాసులు బీరు తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయన వేత్తలు కనుగొన్నారు.
4.బలానికి బీరు మంచిదట. ఎముక బలానకి పాలు తాగడం మంచిదని అందరికీ తెలిసిన విషయమే. కానీ బీరు తాగిన తర్వాత కూడా ఎముకలు పొందే ప్రయోజనాలు పాలతో సమానంగా ఉంటాయట. బీరు లో ఉన్న సిలికాన్ ఎముకలను బలపరుస్తుందని అధ్యయనంలో వెల్లడైంది.
5.దంతవైద్యులు రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలని, మీ దంతాలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే నోరు శుభ్రంగా ఉంచుకోవాలని సలహా ఇస్తుంటారు. అయితే దంతాలకు కూడా బీరు ప్రయోజనం చేస్తుందట. అది ఎలా అంటే? దంతాలలో కావిటీస్ మరియు ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను బీరు చంపగలదు.


కాంబోడియాలో బీరుయోగా!
గత సంవత్సరం(2020)లో కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం అందరం అనుభవించే ఉంటాం. లాక్‌డౌన్ వల్ల నెలల తరబడి ఎవరికి వారు తమతమ ఇళ్లకే పరిమితమైయ్యారు. అయితే కాంబోడియాలో మాత్రం వినూత్నమైన యోగా ఆచరణలోకి తీసుకొచ్చారు అక్కడ బీరు అభిమానులు. కాంబోడియా ముఖ్యనగరమైన నామ్ ఫెన్‌లో లాక్‌డౌన్‌లో యువతకు యోగా బీర్ బాగా ఉపశమనం ఇచ్చిందట.
నలుగురితో కలిసి హాయిగా బీరు (Beer benefits) తాగుతూ యోగా చేశారట. అయితే ఈ తరహా యోగాను ప్రముఖ బీరు తయారీ సంస్థ టూబర్డ్స్ క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ అక్కడ యువతకు ప్రోత్సహించింది. వాస్తవానికి ఇది అచ్చమైన యోగా సాధన కాదని, మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడపడమేనని, యోగాసనాలతో వినోదం అందిపుచ్చుకోవడానికి సంబంధించిన ఒకరమైన వినోదమని అక్కడ యోగా ఇన్‌స్ట్రక్టర్ అన్నా తెలిపారు.
వేసవికాలంలో బీరు తాగడం మంచిదా?
ఎండాకాలంలో వచ్చిందంటే చాలు ఎన్నడూ లేనంతగా బీరు బాటిళ్లు అమ్ముడుపోతాయి. చాలా మంది మందుబాబులు ఒంటిలోని వేడిని తగ్గించుకోవడం కోసం బీరు తాగుతుంటారు. అయితే అందుకు ఒక కారణం కూడా ఉందట. బీరులో సాధారణంగా నీటి శాతం చాలా ఎక్కువుగా ఉండి, ఆల్కహాల్ శాతం పరిమితంగా ఉంటుంది. కావున వేసవిలో బీరును తాగేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కొంతమంది డీహైడ్రేషన్ కూడా తగ్గే అవకాశం ఉందని అనుకుంటూ ఉంటారు.
అయితే ఇవి అపోహలేనని పలువురు వైద్యులు చెబుతున్నారు. ఏడీహెచ్ అనే హార్మోన్ ప్రతీ మనిషి శరీరంలో ఉంటుందట. అది శరీరంలోని నీటి శాతాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆల్కహాల్‌తో కూడిన బీరు సేవిస్తామో ఆ హార్మోన్ దెబ్బతినే అవకాశం ఉందనేది పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకూ వేసవి కాలంలో ఆల్కహాల్ జోలికి వెళ్లక పోవడం మంచిది కాదంటున్నారు వైద్యులు.


బీరు తాగితే లావు అవుతారా?
బీరు (Beer benefits) తాగితే లావు అవ్వరు కానీ, ఎక్కువుగా తాగితే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రముఖ ఆయుర్వేదిక వైద్యులు చెబుతున్నారు. వాస్తవంగా వీరు వల్ల ఎలాంటి పోషకాలు ఉండవు కానీ, శరీరంలో ఉన్న కొవ్వును మాత్రం కాస్త మలమూత్రం ద్వారా బయటకు పంపి వేస్తుందని చెబుతున్నారు. అయితే అలా అని రోజుకో పెగ్ వేసుకోవడం అలవాటుగా చేసుకుంటే మాత్రం లివర్ పై తీవ్ర ప్రభావం చూపుతుందట.
వాస్తవానికి మన శరీరంలో ఉన్న లివర్ కేవలం 350 మిల్లీలీటర్ల ఆల్కహాల్‌ను మాత్రమే తట్టుకొని దానిని శరీరానికి హాని కలిగించ కుండా శుద్ధి చేస్తుందట. కానీ 350 మిల్లీలీటర్ల ఆల్కాహాల్ కంటే ఎక్కువుగా తీసుకుంటే మాత్రం లివర్ చేయవల్సిన పనులు అన్నీ నిలిచిపోయి కేవలం ఎక్కువ మోతాదులో ఉన్న ఆల్కాహాల్ పైనే దృష్టి పెడుతుందట.
దీని వల్ల శరీరంలో మిగిలిన ప్రక్రియలను చేయాల్సిన లివర్ వాటి జోలికి వెళ్లకపోవడంతో అనారోగ్య సమస్యలు మొదలువతాయట. శరీరంలో ఎప్పటికప్పుడు అన్ని మలినాలను శుద్ధి చేసే లివర్ పాడైతే మాత్రం కోలుకోవడం చాలా కష్టం. కొన్ని సార్లు మరణాలు కూడా సంభవిస్తాయట. కాబట్టి శరీరానికి సాధ్యమైనంత వరకు తక్కువ ఆల్కహాల్‌ను అందించేకు మందుబాబులు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
బీరు తాత్కాలిక ఉపశమనం అందించి మత్తులోకి జారిపోవడానికి ఉపయోగపడుతుంది తప్ప దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, లావు కారని ఆయుర్వేదిక్ వైద్యులు చెబుతున్నారు. మొత్తంగా మద్యపానం శరీరానికి చాలా హానికరం. అప్పుడప్పుడు అయితే ఒకే గానీ, అలవాటుగా మారితేనే ప్రమాదం అంటున్నారు కొందరు వైద్యులు.