Beemla Nayak Hundi: గుంటూరు జిల్లా మాచర్లలో పవన్ కళ్యాణ్ అభిమానులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాచర్లలోని భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలలో అభిమానులు, జనసేన కార్యకర్తలు హుండీలు ఏర్పాటు చేశారు. అదనపు షోలతో పాటు, టిక్కెట్ ధరలు పెంచుకోకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో థియేటర్ల యాజమాన్యాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శించడానికి కూడా వెనుకడుగు(Beemla Nayak Hundi) వేశారు.
ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సినిమా టిక్కెట్ల ధరలతో డిస్టిబ్యూటర్లకు నష్టం జరగుతుందనే ఆలోచనతో వారిని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ముందుకొచ్చారు. దీంతో థియేటర్ల వద్ద హుండీలు ఏర్పాటు చేశారు. ఈ హుండీ ఆదాయాన్ని డిస్టిబ్యూటర్లకు పంపే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇన్ని సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ సినిమా వల్ల ఇంతవరకూ ఏ డిస్టిబ్యూటర్ కానీ, ఏ నిర్మాత కానీ నష్టపోయిన దాఖలాలు లేవని పవన్ అభిమాని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ తీసిన సినిమాల్లో ఒక వేళ ప్లాప్ అయిన సినిమా ఉన్నప్పటికీ ఎవరూ నష్టపోలేదని అంటున్నారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సినిమా టిక్కెట్ల రేట్లు వల్ల డిస్టిబ్యూటర్లు, నిర్మాతలు నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కావున మా హీరో వల్ల, మా నాయకుడు వల్ల ఎవరూ నష్టపోకడదని ఒక ఆలోచన చేసి మాచర్లలో థియేటర్లలో హుండీలు ఏర్పాటు చేశామని అంటున్నారు. కావున పవన్ కళ్యాణ్ అభిమానులు చేతనైన సాయం చేసి డిస్టిబ్యూటర్లకు అండగా ఉందామని మీడియా ఎదుట చెప్పారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ