beauty tips for womens

beauty tips for womens:అర‌టిపండుతో అందం రెట్టింపు ఇలా! | banana face pack

Spread the love

beauty tips for womensఅర‌టిపండులో పోష‌కాలెక్కువ‌. అందుకే ఈ పండు తింటే త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. అర‌టి పండు ఆరోగ్యంతో పాటు అందాన్ని మెరుగుప‌రుస్తుంది. అర‌టిపండుతో ఫేస్ ప్యాక్స్ సుల‌భంగా త‌యారు (beauty tips for womens)చేసుకోవ‌చ్చు.

అర‌టి పండును గుజ్జును ముఖం, మెడ ప్రాంతంలో అప్లై చేసుకోవాలి. అర‌గంట త‌ర్వాత వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకుంటే చ‌ర్మంలో నిగారింపు వ‌స్తుంది. స‌గం అర‌టిపండును, స‌గం అవ‌కాడోను క‌లిపి మెత్త‌గా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి ఇరువై నిమిషాల త‌ర్వాత శుభ్ర ప‌రుచుకోవాలి. ఒక క‌ప్పులో స‌గం అర‌టిపండు పేస్ట్‌ను తీసుకుని అందులోఇన టేబుల్ స్పూన్ తేనెను వేసి బాగా క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి.

క‌ప్పులో స‌గం అర‌టి పండును తీసుక‌ని అందులోకి తేనె, నిమ్మ‌ర‌సాన్ని, టేబుల్ స్పూన్ చొప్పున క‌ల‌పాలి. త‌ర‌వాత బాగా మిక్స్ చేసి ముఖానికి ప‌ట్టిస్తే చ‌ర్మం మెరిసిపోతుంది. స‌గం అర‌టిపండును తీసుకుని దానికి తేనె, పెరుగును టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుని మిశ్ర‌మంగా చేసుకుని ముఖానికి ప‌ట్టిస్తే మంచి గుణం క‌నిపిస్తుంది. ముఖ చ‌ర్మంపై ఉండే మృత‌క‌ణాల్ని పోగొట్టాలంటే అర‌టి పండు, టేబుల్ స్పూన్ తేనె, కోడిగుడ్డు ప‌చ్చ సొన క‌లిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరాక గోరు వెచ్చ‌ని నీళ్ల‌తో క‌డుక్కోవాలి.

జట్టు బిరుసెక్క‌డం, చిట్లిపోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో చాలా మంది ఇబ్బంది ప‌డుతుంటారు. ఇలాంటి వారు వారంలో ఒక రోజు బాగా మ‌గ్గిన అర‌టిపండు గుజ్జులో పెద్ద చెంచా పెరుగు క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని మాడు నుంచి జుట్టు చివ‌ర్ల వ‌ర‌కూ రాసుకోవాలి. ఆపై ష‌వ‌ర్ క్యాప్ పెట్టుకుని పావుగంట సేపు ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టుకి త‌గిన పోష‌ణ అందుతుంది. వెంట్రుక‌లు ఆరోగ్యంగా ఎదుగుతాయి.

కాలుష్యం, ఎండ వంటివి చ‌ర్మంపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తాయి. చ‌ర్మం గ‌రుకుగా మార‌డం, నిర్జీవంగా క‌నిపించ‌డం వంటి ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఇలాంట‌ప్పుడు పెస‌ర‌పిండిలో చెంచా తేనె వేసుకోవాలి. కొన్ని పాలుపోసి అనాస ముక్క‌ల్ని ర‌సంగా తీసుకోవాలి. ఈ ర‌సానికి పెస‌ర‌పిండి మిశ్ర‌మాన్ని క‌లిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ఒంటికి రాసుకుని కాసేపాగి స్నానం చేస్తే స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంది. ఈ కాలంలో చాలా మంది చ‌ర్మం ఇట్టే పొడిబారుతుంది. దుర‌ద పెడుతుంది. అలాంటి వారు అర‌టి పండు గుజ్జులో చెంచా తేనె, పెద్ద చెంచా స్ట్రాబెర్రీ ర‌సం క‌లిపి ఒంటికి రాసుకుని కాసేపు ఆర‌నివ్వాలి. ఆపై చ‌న్నీళ్ల‌తో క‌డిగేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అర‌టిపండులోని పోష‌కాలు అంది, చ‌ర్మం తాజాగా మారుతుంది.

how to get glowing hands:అందం ముఖానికే కాదు..చేతుల‌ది కూడా!

how to get glowing handsమ‌న‌లో చాలా మంది ముఖం అందంగా క‌నిపించాల‌ని ఎక్కువుగా తాప‌త్ర‌య ప‌డుతుంటారు. అయితే శ‌రీరంలో భాగ‌మైన చేతులు కూడా చూపరుల‌ను ఆక‌ర్షించేలా Read more

ice cubes for face: అంద‌మైన కాంతి చ‌ర్మానికి ఐస్‌ముక్క‌లు ఎలా వాడాలంటే?

ice cubes for face వేస‌విలో చ‌ర్మానికి తాజాద‌నాన్ని చ‌ల్ల‌ద‌నాన్ని సాంత్వ‌న‌ను ఇచ్చేందుకు ఐస్‌ముక్క‌ల‌ను చ‌క్క‌గా ఉప‌యోగించుకోవ‌చ్చు. మేక‌ప్ చేసుకునేట‌ప్పుడు ఐసు ముక్క‌ల‌ను ప్రైమ‌ర్‌గా వాడుకోవ‌చ్చు. మేక‌ప్ Read more

sugarcane juice for skin:చెర‌కు ర‌సంతో అందం రెట్టింపు!

sugarcane juice for skinమ‌నం రోడ్డు మీద న‌డుస్తున్న‌ప్పుడు దాహం వేస్తే వెంట‌నే ఫుట్‌పాత్‌ల‌పై ఉండే చెరుకుర‌సం(sugarcane juice) ఎక్క‌డ ఉందా? అని వెతుకుతుంటాం కదా!. 10 Read more

Green Tea Face Pack గ్రీన్ టీ తాగ‌డానికే కాదు.. చ‌ర్మాన్ని మెరిసేలా చేసే సౌంద‌ర్య సాధ‌నం కూడా..!

Green Tea Face Pack మాన‌సికోల్లాసానికే కాదు. గ్రీన్ టీని సౌంద‌ర్య సాధ‌నం గానూ ఉప‌యోగిస్తే చ‌ర్మం మంచి నిగారింపును సంత‌రించుకుంటుంది. ప్యాకెట్ల‌లో ల‌భించే గ్రీన్ టీ Read more

Leave a Comment

Your email address will not be published.