BDS Job Notification Kaloji Health University(KNRUHS)
Warangal: బీడిఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది మాప్ అప్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను కాళోజీ హెల్త్ యూనివర్శిటీ విడుదల చేసింది. ఈ నెల 22, 23 తేదీలలో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్ను గురువారం విడుదల చేసింది. ఈ నెల 22న సాయంత్రం 5 గంటల నుంచి 23వ తేదీ వరకు సాయంత్రం 4 గంటల వరకు వెబ్ ఆఫ్షన్లును, ఇప్పటికే యూనివర్శిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. ఇతర వివరాలకు www.knruhs.telangana.gov .in వెబ్ సైట్లో సంప్రదించాలని యూనివర్శిటీ వర్గాలు సూచించాయి.
ఇది చదవండి: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఇది చదవండి: అమెరికా 46 వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం