bc leader krishnaiah: హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో దాదాపు 1000 మందిని పోటీకి నిలబెడతానంటూ బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో థౌజండ్ వాలా పేల్చుతాం అన్నట్టుగా ఆర్. కృష్ణయ్య సండెన్ ఎంట్రీ ప్రస్తుతం రాజకీయాల్లో వేడిని పుట్టిస్తోంది. ఇప్పటి వరకు ఎంతో సైలెంట్‌గా ఉన్న ఆర్. కృష్ణయ్య ఈ ప్రకటన తో అభ్యర్థులంతా గప్ చుప్ అయిపోయారు. బీసీ నేత వ్యాఖ్యలతో ఇందెక్కడి గొడవ? అని తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇలాంటి ఎన్నికల కారణంగా అక్కడి ఫలితాలు ఎంతటి ప్రభావితం అయ్యాయో అందరికీ తెలిసిందే.
ఈ తరహా ఎన్నిక వార్త హుజూరాబాద్ లోనూ వెలుగులోకి రావడంతో ఇదో రాజకీయ చర్చగా మారింది. కొన్నాళ్ల క్రితం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించిందని, తద్వారా 7,600 మంది ఉపాధి కోల్పోయారని ఇందుకు తగిన సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు ఆర్.కృష్ణయ్య. వీరం దర్నీవిధుల్లోకి తీసుకోకుంటే తాము వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లను హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దింపుతామని హెచ్చరించారు.
వీరితో పాటు ఇటీవల తొలగించిన స్టాఫ్ నర్సులు సైతం నామినేషన్లు వేసే అవకాశముందని హెచ్చరించారు. ఒక వేళ అదే జరిగితే న్యూస్ పేపర్ సైజ్ బ్యాలెట్ పేపర్లు, నీళ్ల డ్రమ్ముల సైజు బ్యాలెట్ బాక్సులు, గుర్తును పోలిన గుర్తులు, పేర్లను పోలీన పేర్లతో నానా తంటాలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి రావద్దని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆశిస్తున్నారట.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!