Bayalellipotunnave love failure mp3 song: బయలెల్లిపోతున్నావే ఓరామసిలకా ల‌వ్ ఫెయిల్యూర్ సాంగ్ విన్నారా?

Bayalellipotunnave love failure mp3 song | Singer Shivaji Offficial యూట్యూబ్ నుంచి విడుద‌లైన బ‌య‌లెల్లిపోతున్నావే అనే ల‌వ్ ఫెయిల్యూర్ సాంగ్ కొద్ది రోజుల కింద‌ట విడుద‌లైంది. ఈ పాటను ఇప్ప‌టికే కొన్ని ల‌క్ష‌ల మంది చూశారు. పాట సినిమాలో ల‌వ్ సాంగ్ లా షూట్ చేశారు. ఈ పాట‌కు Bunny Mahesh లిరిక్స్ అందించారు. పాట‌ను Ramu త‌న స్వ‌రంతో అద్భుతంగా పాడి నిజ‌మైన ల‌వ్‌లో ఫెయిల్యూర్ అయిన వారి ఫీలింగ్స్ త‌గ్గ‌ట్టుగా త‌న స్వ‌రాన్ని వినిపంచారు. Kalyan keys సంగీతం అద్భుతంగా ఉంది.

ఇక బ‌య‌లెల్లిపోతున్నావే అనే ల‌వ్ ఫెయిల్యూర్ సాంగ్‌లో Vaishnavi sony, Harish kumar ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ పాట‌కు హ‌రీష్ కుమార్ త‌న న‌ట‌న‌తో జీవం పోశార‌ని చెప్ప‌వ‌చ్చు. తాను ఇష్ట‌ప‌డిన అమ్మాయికి మ‌రొక‌రితో పెళ్లి అవ్వ‌డం, ఆమె త‌న అత్త‌గారింటికి వెళ్ల‌డం నేప‌థ్యంలో ఈ పాట కొన‌సాగుతుంది. ఈ వీడియో సాంగ్ చూసిన ప్ర‌తి ఒక్క‌రూ వారి న‌ట‌న చాలా అద్భుతంగా ఉంద‌ని కామెంట్లు చేస్తున్నారు.

అప్ప‌టి వ‌ర‌కు ప్రేమించిన యువ‌కుడితో ఉండి త‌న తండ్రి చెప్పిన వారిని పెళ్లి చేసుకోవ‌డంతో హీరో మోస‌పోయి త‌న కోసం ప‌రిత‌పిస్తూ పాడే ఈ పాట ప్ర‌తి ఒక్క ప్రేమికుడిని క‌న్నీళ్లు పెట్టిస్తుంది. త‌న వెంట ప‌డి ప్రేమించి త‌న కోసం ప‌రిత‌పించే ఓ యువ‌కుడు త‌న ప్రేమ‌లో విఫ‌ల‌మైన‌ప్పుడు ఎలా స్పందిస్తాడో ఈ పాట‌లో కూడా హీరో అదే విధంగా త‌న న‌ట‌న ద్వారా ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుసుకున్నాడు. మొత్తంగా ఈ పాట సూప‌ర్‌గా ఉంది. మీరు ఈ పాట‌ను వీడియో చూడాలంటే కింద లింక్ ఇస్తాము. త‌ప్ప‌కుండా చూడండి.

Bayalellipotunnave song lyrics

గుండెకే తీరని గాయం చేసెల్లిపోతున్నవే
మరిసిపోని నీజ్ఞాపకాలు వదిలావు నాకెందుకే
సావంచువరకూ నీతోనె నాబ్రతుకన్న బాసలు ఏమాయెనే
నడిమిట్ల వదిలేసె నంగనాచి ప్రేమ లేకున్న బాగుండునే
బయలెల్లిపోతున్నావే ఓరామసిలకా బంగారుమొలక
ఓసారి నావంక చూసి నవ్వవె సిలకా నీకెందుకలక
బయలెల్లిపోతున్నావే ఓరామసిలకా బంగారుమొలక
ఓసారి నావంక చూసి నవ్వవె సిలకా నీకెందుకలక

ఆనవాలులేని ప్రేమనాదికాదని
యాదిమరిసిపోనీ బంధమే మనదని
నా అందాలరాణి చూడవమ్మా
ఆనాటి నీనవ్వులు ఎక్కడమ్మా
పైపైనె పంతాలు దేనికమ్మా
గుండెబరువాయె గాధలు నావిలెమ్మ
ఈజన్మంత నేను నిన్నె ప్రేమిస్తాను
నిన్నే తలుచుతు బ్రతికేస్తనమ్మ
బయలెల్లిపోతున్నావే ఓరామసిలకా బంగారుమొలక
ఓసారి నావంక చూసి నవ్వవె సిలకా నీకెందుకలక
బయలెల్లిపోతున్నావే ఓరామసిలకా బంగారుమొలక
ఓసారి నావంక చూసి నవ్వవె సిలకా నీకెందుకలక

మచ్చికైన మన ప్రేమని మంటలేసిపోతున్నవే
మరువలేని బంధానివే మరిసి ఎట్ల నువ్వున్నవే
ఆకురిసేటి సినుకులు ననుచూసెనే
నాకుమిలేటి బాధను తరువడిగెనే
ఎవరితొచెప్పుదు నాబాధనే
నామదిలోని దేవత నువ్వేనని
ఏపుగ పెరిగిన మన ప్రేమ మొక్కను ఏపాడు పిడుగొచ్చి కూలగొట్టేసెనో
బయలెల్లిపోతున్నావే ఓరామసిలకా బంగారుమొలక
ఏడున్నా ఏగూటిలున్నా బద్రమె సిలకా నాప్రేమ మొలకా
బయలెల్లిపోతున్నావే ఓరామసిలకా బంగారుమొలక
ఏడున్నా ఏగూటిలున్నా బద్రమె సిలకా పదిలమె మొలకా

Producer: Kranthi yalavala

Co-producer: Singer Shivaji

Lyrics: Bunny Mahesh

Singer: Ramu

Music: Kalyan keys

Casting: Vaishnavi Sony, Harish Kumar, Keerthana, Swapna, Shivaji, Hemanth, Bittu, Srisailam Reddy

Dop Editing: Janatha Bablu

Di: Srinivas Annaboina

Drone: Akhil

Direction: Raghu jaaan

Makeup: Vinnu

Poster: Sagar Mudhiraz

Making Camera: Bollu Naresh

Special Thanks to- Pandre Ramdas, Santhosh Mestri Garu, S.Tirupathaiah (Amma Technologies Ananthapur)
Jami (G.P) Villager’s, Godmegam (G.P) Villager’s, Upender Darshanam, Konda Rajender, Srikanth, Pawan Kumar,
Srikanth, Jaipal Reddy, Sandeep, k.nagesh reddy,gnaneshwar,Vivan kusumba.

Bayalellipotunnave love failure mp3 song

ఈ పాట వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి!

free download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *