battle of kohima రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కోహిమా యుద్ధానికి ప్రాధాన్యత ఉంది. ఈ యుద్ధంలో జపాన్ బ్రిటీష్ ఇండియాలోకి రాలేకపోయింది. బ్రిటీష్ ఆక్రమిత బర్మాలోకి 1942, 1943లలో జపాన్ చొచ్చుకు వచ్చి బ్రిటీష్ పాలకులు ఎంతో కీలకంగా భావించే భారత్‌ను చేజిక్కించుకోవాలనుకుంది. 1944 ఏప్రిల్ 14, జూన్ 22 మధ్య కాలంలో భారత్ నావికాదళం మాంటెగ్యూ స్టాప్ఫోర్డ్ నాయకత్వంలో ప్రాణాలు ఎదురొడ్డి పోరాడి కొటోకు సాటో నాయకత్వంలోని జపాన్ను భారత్ ఉత్తర ప్రాంతంలోని కోహిమా గ్రామం నుంచి వెనక్కు పంపించగలిగింది.
ఈ యుద్ధ సమయంలో ఇరువర్గాలకు ఆహారం, నీరు అందుబాటులో లేకుండా పోయాయి. కానీ బ్రిటీష్ ఆకాశమార్గంలో భారత్ సేనలకు ఆహారం, నీరు అందించింది. దీంతో బ్రిటీష్ ఇండియా దళాలు మరింత శక్తిని పుంజుకుని ముందడుగు వేశాయి. ఈ యుద్ధంలో జపాన్ సైన్యం ఆరువేలమందిని పోగొట్టుకొనగా బ్రిటన్ ఐదువేలమందిని(battle of kohima) పోగొట్టకుంది.
తరైన్ యుద్ధం క్రీ.శ.1191,92


ఘజనీ ప్రాంత తాజిక్ ముహమ్మద్ షాహబుదీన్ తన ఆధీనంలోని ప్రాంతాన్ని మరింత విస్తరించదలిచాడు. క్రీ.శ.1175, 1190 మధ్యకాలంలో గుజరాత్ పై దాడిచేసి పెషావర్ ను స్వాధీనం చేసుకున్నాడు. ఘోరీ 1191లో భారత్ పై దండయాత్ర చేశాడు. కానీ రాజపుట్ రాజు పృథ్వీరాజ్ – 3 చేతిలో మొదటి తరైన్ యుద్ధంలో ఓడిపోయాడు. తన సైన్యం కుప్పకూలి ఘోరీ పట్టుబడ్డాడు. కానీ పృథ్వీరాజ్ ఘోరీని క్షమించి అతని రాజ్యాన్ని అతడికి అప్పగించేడు. ఆ మరుసటి సంవత్సరమే ఘోరీ 120 వేలమంది సైన్యంతో మళ్లీ దండయాత్ర చేశాడు. పెద్ద ఎత్తున ఏనుగులను రంగంలోకి దింపడంతో రాజపుట్ సైన్యం బెంబేలెత్తి ఓడిపోయింది. ఫలితంగా ఉత్తర భారతదేశం ముస్లింల పాలనలోకి వెళ్లింది. ఇది 1858లో బ్రిటీష్ రాజ్ వరకూ సాగింది.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!