Barley Seeds : మనం తినే ఆహారంలో శరీరానికి మేలు చేసే గింజల్లో బార్లీ ప్రధానమైంది. ఇది ఎక్కువు పోషకాలను కలిగి ఉండటంతో తక్కువ కొలెస్ట్రాల్ ను కలిగి ఉంటుంది. ఎక్కువుగా షుగర్ తో బాధపడేవారు ఈ బార్లీ గింజలను ఆహారంలో తీసుకుంటే ఎంతో మేలు.
Barley Seeds: ఆహారంలో బార్లీని వినియోగించడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులను అరికట్టవచ్చనని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఆహారంలో సలాడ్స్, సూప్స్ వంటి వాటిల్లో బార్లీని తరుచూ వినియోగించడంతో హార్మోన్ల స్థాయి కూడా అదుపులో ఉంటుందని స్వీడన్ లుండ్ యూనివర్శిటీ అధ్యాయన బృందం పేర్కొంది. రోజులో చివరిసారి ఆహారం తీసుకున్న అనంతరం 11-14 గంటల అనంతరం పరీక్ష చేయగా, వీరిలో డయాబెటిస్, గుండె వ్యాధులు ఉన్నట్టు తేలింది. వీరి చేసిన అధ్యయనంలో మధ్య వయస్కులో 3 రోజులు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్లో బార్లీతో చేసిన బ్రెడ్‌ను, వివిధ పదార్థాలను వినియోగించిన వారిలో 85 శాతం మందిలో మెటబా లిజమ్(metabolism) మెరుగైందని తేలింది. వీరిలో బ్లడ్ షుగర్(blood sugar), ఇన్సులిన్(insulin) లెవెల్స్ తగ్గాయి. ఆకలిని కూడా నియంత్రించడం జరిగింది. బార్లీ వినియోగంతో శరీరంలో మంచి బాక్టీరియా సంఖ్య పెరిగి హార్మోన్స్ సక్రమంగా విడుదల అవుతాయి. హార్మోన్లు పెరగడం వల్ల దీర్ఘకాలంగా ఉన్న వ్యాధులు మరింత తగ్గడంతో డయాబెటిస్, గుండె నొప్పులు అదుపులో ఉన్నాయని వెల్లడైంది.
ఆరోగ్యానికి బార్లీ!
-సులువుగా జీర్ణమయ్యే పదార్థాల్లో బార్లీ ఒకటి. దాహాన్ని తీర్చడంలో బాగా ఉపయోగపడుతుంది.
-జ్వరంతో బాధపడేవారికి బార్లీ జావ మంచి ఆహారం. వీటిలో పోషకాలు అధికంగా ఉండి త్వరగా జీర్ణమవుతాయి.
-మూత్ర పిండ సమస్యలు ఉన్నవారు బార్లీ జావను క్రమం తప్పకుండా కొన్నాళ్లు తీసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందవచ్చు. మూత్ర పిండాల్లోని రాళ్ళు కరిగిపోయేందుకు బార్లీ సహకరిస్తుంది.
-ఎండవేళ బార్లీ గింజలను ఉడికించి ఆ ద్రవాన్ని తాగితే దాహాన్ని, శరీర తాపాన్ని తగ్గిస్తుంది.
-ఇందులోని పీచు, ఫాస్పరస్ విటమిన్లు, ఎమినో ఆసిడ్స్ ఆరోగ్యానికి ఉపకరిస్తాయి.
-పేగుల్లోని చెడు బాక్టీరియాను తొలగిస్తుంది. కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించడానికి ఉపకరిస్తుంది.

-శరీరంలో చక్కెర స్తాయిని నియంత్రించే శక్తి ఉన్నందున మధుమేహం ఉన్నవారు దీన్ని తీసుకోవచ్చు.
-రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులున్నవారికి ఇది మంచి ఆహారం.
-కీళ్ల నొప్పులు, అరికాళ్ళ మంటలకు ఔషదంలా పని చేస్తుంది.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి