banks service chargesమన అంకౌంట్ ఉన్న బ్యాంకులు నుంచి దీనికి ఛార్జి చేసినట్టు, దానికి ఛార్జి చేసినట్టు తెగ మెస్సేజ్‌లు ఫోన్లకు వస్తుంటాయి. అసలు ఆ సర్వీస్ ఛార్జీలకు ఎందుకు కట్ చేసుకుంటున్నారో, ఆ సర్వీసు మనకు అవసరమో? అనవసరమో? తెలిసేలోపు నెలకు కనీసం 300 నుంచి 500 లోపు సర్వీసు ఛార్జీలకు కట్ అవుతుంటాయి. కాబట్టి ఆ ఛార్జీలను అధిగమించాలంటే అసలు కట్టకుండా ఉండాలంటే, బ్యాంకులు వేసే సేవా పన్నుల బారి నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్గాలు (banks service charges)అనుసరించండి.
బ్యాంకులో ఎప్పటికప్పుడు డబ్బు డిపాజిట్లు వేయడం లేదా ఇతర ఆర్థిక లావాదేవీలు కొనసాగించడం లాంటివి చేస్తుంటే బ్యాంకు వేసే సేవా ఛార్జీలు, ఇంకా ఫీజుల నుంచి విముక్తి పొందవచ్చు. మీకు అవసరం లేని సేవలు వద్దని చెప్పడానికి మొహమాట పడకండి. ఒక వారానికి గాను ఎస్.ఎం.ఎస్ పంపే ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా ఎస్.ఎం.ఎస్(SMS) బదులుగా అకౌంట్ సెటిల్మెంట్ గురించి ఈమెయిల్స్ పంపమని అడగవచ్చు.
చాలా బ్యాంకులు ఐవీఆర్ సర్వీస్(IVR Services) ఉచితం. అయితే మీ అకౌంట్లో కనీసం మొత్తం లేకపోతే ఫోన్ బ్యాంకింగ్ చాలా ఖరీదు పడుతుంది. చెక్కు కానీ, డ్రాప్ట్ కాని వాడే బదులు ఎన్ ఇ ఎఫ్ టి కాని నెట్ బ్యాకింగ్ కాని ఉపయోగించండి. మీ బ్రాంచీని దర్శించాలనే కోరిక అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా బ్యాంకు ట్రాన్సాక్షన్ల కన్నా ఏటిఎం, ఆన్‌లైన్‌తో చేసే ట్రాన్సాక్షన్లే ఎక్కవ చవక పడతాయి. డెబిట్ కార్డుల(debit card)ను ఎక్కవ వాడండి. ఎందుకంటే మీరు దానికి నిర్వహణ ఖర్చులు భరిస్తున్నారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!