Banking Services : ప్రస్తుత కాలంలో వ్యవసాయం చేసే రైతులకు రుణాల కోసం బ్యాంకులు చుట్టూ తిరగడం పెద్ద తలనొప్పిగా మారింది. రోజుల తరబడి పట్టణాల్లో ఉంటున్న బ్యాంకుల వద్దకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఏపీలో ఆ బాధలు తగ్గనున్నాయి. అది ఎలా అంటే..!
Banking Services : అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల్లో (RBK) బ్యాంకింగ్ సేవలు అందుబాటులో రానున్నాయి. వ్యవసాయ పనుల కోసం అవసరమైన రుణాలు, చెల్లింపులు, బీమా, రాయితీలు, సబ్సిడీలు, పంట కొనుగోలు, నగదు జమ, రుణాల రీషెడ్యూల్తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలకు దరఖాస్తు చేసుకునే క్రమంలో రైతులు ఏడాదిలో తరుచూ బ్యాంకులకు వెళుతూనే ఉంటారు. కొన్ని గ్రామీణ బ్యాంకులయితే నిత్యం రైతులతో కిక్కిరిసి ఉంటాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన అనేక కార్యక్రమాల అమలుకు కేంద్ర బిందువులుగా మారుతున్న డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు వివిధ ప్రభుత్వ బ్యాంకుల నుంచి బ్యాంకింగ్ కరస్పాండెంట్లు రైతు భరోసా కేంద్రాలకు వచ్చి సేవలందించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన విధానాన్ని వచ్చే నెల నుంచి అన్ని RBK ల్లో అమలు చేయనున్నారు. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రాష్ట్రంలో నెలకొల్పిన 10, 778 రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ బ్యాంకులతో ప్రభుత్వం సంప్రదిం పులు చేస్తోంది. బ్యాంకింగ్ కరస్పాండెంట్ల వద్ద బ్యాంకు ఖాతా ప్రారంభం, మొబైల్ స్వైపింగ్, నగదు జమ, రూ.25 వేల వరకు విత్ డ్రా, పంట రుణాలకు దరఖాస్తు, కొత్త రుణాల మంజూరు, రుణాల చెల్లింపులు, రుణాల రీషెడ్యూల్ తదితర సేవలు అందుబాటులో ఉంటాయి. పరిమిత సేవలకు గాను ప్రైవేటు బ్యాంకులు కూడా రైతు భరోసా కేంద్రాల్లో సేవలందించేందుకు ముందుకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!