Bank Lunch Break Time | ఒక్క శెలవు రోజుల్లో మినహా మిగతా రోజుల్లో నిత్యం రద్దీగా ఉండే వాటిల్లో బ్యాంకులు మొదటి స్థానంలో ఉంటాయి. డబ్బులు పంపించాలన్నా, దాచుకోవాలన్నా, తీసుకోవాలన్నా, కొత్త అకౌంట్ తెరవాలన్నా బ్యాంకులను ఆశ్రయించాల్సిందే.
అయితే ఇక్కడ బ్యాంకింగ్ (banking) రంగం, సేవలు గురించి తెలిపేకన్నా కస్టమర్‌కు వచ్చిన ఒక సందేహం గురించి వివరించాలనుకుంటున్నాం. అదేమిటంటే? బ్యాంకు అధికారులు.. లంచ్ టైం (Bank Lunch Break Time) అయ్యింది తర్వాత రండి అని చెప్పే అధికారం బ్యాంకు ఉద్యోగులకు ఉంటుందా? అనేది ప్రశ్న. దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం!.
మన భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకింగ్ సేవల రంగంలో ఈ సమయంలో లంచ్ చేయాలి, ఆ సమయం వరికే సేవలు అందించాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎటువంటి ఉత్తర్వులు, మార్గదర్శకాలు జారీ చేసింది లేదని చెప్పవచ్చు. అయితే బ్యాంకింగ్ వేళల్లో(banking hours) కౌంటర్ వద్ద సర్వీసులో ఆటంకం ఉండకూడదని అన్ ఇంటర్‌స్టెడ్ కూడా ఉంది.
బ్యాంక్ ఉద్యోగుల లంచ్ బ్రేక్ (Bank Lunch Break Time) సమయం గురించి గతంలో ప్రమోద్ గోల్డీ అనే వ్యాపారస్థుడు RTI కింద దరఖాస్తు కూడా చేశారు. అయితే ఆ వ్యాపారస్థుడు ప్రశ్నలకు రిజర్వ్ బ్యాంకు వారు కూడా సమాధానం చెప్పారు.
ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం బ్యాంక్‌లు భోజన సమయం పేరుతో సర్వీసులో ఇంటరస్ట్ చేయడం పొరపాటు అనీ, బ్యాంకు ఉద్యోగులు షిఫ్టుల ప్రకరాం బ్రేక్స్ తీసుకుని, కనీసం ఒక కౌంటర్ పనిచేస్తూ ఉండేలా చూడాలని ఆ వ్యాపారస్థుడు వ్యాఖ్యానించాడు. దీన్ని ఆ సమయంలో పత్రికలు హైలెట్ చేశాయి.
వాస్తవానికి బ్యాంకు ఉద్యోగులకు పని ఒత్తిడి మామూలుగా ఉండదు. అసలే ఫైనాన్షియల్ విషయాలు, లక్షల, కోట్ల వ్యాపార లావాదేవీలు కాబట్టి వారు చాలా జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కాస్త మనం ఆ కోణంలో కూడా ఆలోచించాలి.
Bank Lunch Break Time: RBI ఉత్తర్వులు ఎలా ఉన్నాయి?
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తన ఉత్తర్వులు, మార్గదర్శకాల్లో బ్యాంకులకు ఒకే విధమైన పని వేళలు, ఖచ్చితమైన బ్యాంకు వేళలు ఉండాలని నిర్ణయించలేదు. బ్యాంకు వేళల విషయంలో Reserve bank వారి ఉత్తర్వులు ఒకసారి పరిశీలిస్తే!


రిజర్వు బ్యాంక్ బ్యాంకింగ్ వేళలు(బ్యాంకింగ్ అవర్స్) అన్నది ఏ సమయం నుంచి ఏ సమయం వరకూ ఉండాలన్నది రిజర్వు బ్యాంకు కానీ, మరే ఇతర రెగ్యులేటింగ్ అథారిటీ కానీ ఉద్దేశపూర్వకంగానే ఖచ్చితంగా నిర్ణయించలేదు. ఈ బ్యాంకింగ్ వేళలు తన బ్రాంచ్‌లో వేటికి ఏమేం ఉండాలన్నది బ్యాంకులే నిర్ణయించుకోవచ్చు. అవసరాన్ని బట్టి ముందస్తు నోటీసు ఇచ్చి, తమ కస్టమర్లకు తెలిజేసి బ్యాంకులు పని వేళలు మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు.
ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం ప్రతీ బ్యాంకింగ్ outlet వారానికి ఐదు రోజుల పాటు, రోజుకు 4 గంటల చొప్పున బ్యాకింగ్ కార్యకలాపాలు చేసి తీరాలని మాత్రం నిబంధనలు ప్రకటించింది. ఒకవేళ అలా బ్యాంకు సిబ్బంది చేయకపోయినా, పాటించకపోయినా దానికి బ్యాంకింగ్ అవుట్‌లెట్ హోదా పోతుంది.
దీనినే పార్ట్ టైం బ్యాంకింగ్ అవుట్‌లెట్ అంటారు. పై నిబంధనలు అనుసరించి బ్యాంకులు నిర్ణయించుకున్న వివరాలు, పని వేళలు స్పష్టంగా బోర్డుల మీద, గోడల మీద రాసి కస్టమర్లకు అందరికీ కనిపించేలా ఉండాలి. ఇంటర్నెట్ సర్వీసు దెబ్బతినడం వంటి తాత్కాలిక సమస్యలు వస్తే వెంటనే కస్టమర్లకు తెలియజేసి, సమస్యను పరిష్కరించి మళ్లీ ప్రారంభించాలి.


రోజులో బ్యాంకింగ్ వేళలు ముగిసేసరికి అప్పటి వరకు లైన్లో ఎంత మంది కస్టమర్లు బ్యాంకులో ఉంటారో అంతమందికి సేవలు అందించాకే కౌంటర్ (bank counter) ముగించాలని కూడా ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. కావున ఉదయం 10 గంటలకు బ్యాకింగ్ సేవలు ప్రారంభించి మధ్యలో 2 గంటల నుంచి లంచ్ బ్రేక్ తీసుకుని, తిరిగి 2.30 నుంచి 3.30 వరకు సేవలు పూర్తి చేయడం అన్నది ఆర్బీఐ నిబంధనలకు అనుగుణమేనని మనం గుర్తించాలి.
ఒక వేళ ఏ బ్రాంచిలోనైనా బ్యాంకులో స్పష్టంగా పని వేళలు రాయకుండా ఉన్నా, బ్యాంకింగ్ వేళల్లో కౌంటర్ ఖాళీగా ఉండి మనల్ని ఎదురు చూసేలా చేస్తే మాత్రం సంబంధిత బ్యాంకు ఉన్నతాధికారులకు, ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.