Bank Holidays march 2022 | మార్చి 2022 నెలలో బ్యాంకులు మూత పడనున్నాయి. దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సగం రోజులు శెలవులు వచ్చాయి. భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం ఈ నెలలో 13 రోజులు బ్యాంకులు మూత పడనున్నాయని తెలుస్తోంది. కాకపోతే దేశంలోని ఆయా రాష్ట్రాలను బట్టి ఈ సెలవుల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులకు మాత్రం 8 రోజులు సెలవులు(Bank Holidays march 2022) రానున్నాయి.
మహా శివరాత్రి, హోలీ వంటి ప్రధాన పండుగలతో పాటు రెండు, నాల్గో శనివారం, నాలుగు ఆదివారాలు బ్యాంకులు మూత పడనున్నాయి. మహాశివరాత్రి(మార్చి 1), ఆదివారం (మార్చి 6), రెండో శనివారం (మార్చి 12) ఆదివారం (మార్చి 13), శుక్రవారం హోలీ (మార్చి 18), ఆదివారం (మార్చి 20), నాల్గో శనివారం (మార్చి 26), ఆదివారం (మార్చి 27) కావడంతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 8 రోజులు మూతపడనున్నాయి.
బ్యాంకులకు సెలవులు ప్రకటించడంతో వినియోగదారులు, ఖాతాదారులు కంగారు పడాల్సిన అవసరం లేదని, బ్యాంకులు మూత పడినా ఏటీఎం కేంద్రాలు, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ