Bangarraju Teaser అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్ర పోషిస్తున్న Bangarraju Teaser First Look మంగళవారం విడుదలైంది. అక్కినేని నాగచైతన్య Birthday సందర్భంగా ఈ టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. బంగార్రాజు సినిమా టీచర్లో ముందుగా నాగార్జున ఫొటో గోడ మీద కనిపిస్తుంది. అక్కడే ఉన్న బంగారం గొలుసు, వాచీ, కడియం, ఉంగరాలు తీసుకొని యువసామ్రాట్ నాగచైతన్య వేసుకుంటాడు. ఆ తర్వాత ఒక కర్ర తీసుకొని బయటకు ఎంట్రీ ఉంటుంది. ఆ కర్రను చాలా హుషారుగా నేలమీదకు వేసి కొడితే అది బుల్లెట్ సైలెన్సర్ దగ్గర కుచ్చుకోవడం హైలెట్‌గా ఉంది. ఇప్పటి వరకు నాగచైతన్య చేసిన సినిమాల్లో చాలా స్టైలిష్ లుక్‌తో, ఎనర్జిటిక్‌గా కనిపించే సినిమాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటోందని చెప్పవచ్చు.
Akkineni Naga Chaitanyaకు ఒకప్పుడు యాక్టింగ్ సరిగా రాదన్న వారే అతని సినిమాలు చూసి ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. నాగచైతన్య కెరీర్లో చాలా సూపర్ డూపర్ హిట్ లవ్ సినిమాలు యువతకు నచ్చాయి. Kalyani Krishna Kurasala స్టోరీ & దర్శకత్వంలో Zee Studios, Annapurna studios నిర్మాణంలో వస్తున్న బంగార్రాజు సినిమాపై అక్కినేని అభిమానులు, సినీ అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. వాస్తవానికి ఈ సినిమా Soggade Chinni Nayana(2016) సీక్వెల్‌గా పార్ట్ 2 గా బంగార్రాజు సినిమా వస్తుంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమా సూపర్ హిట్ అయన విషయం తెలిసిందే. అదే విధంగా నాగార్జున ఫెర్మామెన్స్ అదే లెవల్లో ఈ సినిమాలో ఉండబోతోంది.


ఈ సినిమాలో Akkineni Nagarjuna, Akkineni Naga Chaitanya తో పాటు Ramya Krishna, Krishi Shetty, Rao Ramesh, Brahmaji, Vennela Kishore, Jansi and Anitha Chowdery ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సినిమాకు సంగీతం Anurup Rubens అందించారు. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందకు 2022 నూతన సంవత్సరంలో విడుదల కానుంది.
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?