Bangaram Cheppana ఒకటి చెప్పనా అంటూ గతేడాది సోషల్ మీడియాలో హల్ చెల్ చేసి తన కంటూ గుర్తింపు తెచ్చుకున్న ఒక సాధారణ అమ్మాయిని మీరు చూసే ఉంటారు. ఆమె వాయిస్‌కు, డైలాగులకు ఫిదా అయిపోయిన ఎంతో మంది సోషల్ నెటిజన్లు ఆమెను ట్రెండింగ్ లిస్టులో చేర్చారు. ఆమె డైలాగులతో పాటలు వచ్చాయి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు వచ్చాయి. సోషల్ మీడియా Social media,లో ఎక్కడ చూసినా ఆమె డైలాగ్‌లతో ముంచెత్తారు.
పొట్టి గౌనులో కనిపించి షాకిచ్చిన Bangaram Cheppana
చూడటానికి సాధారణ అమ్మాయిలా కనిపించి అమాయికంగా డైలాగ్‌లు చెప్పిన ఈ అమ్మాయి ఇప్పుడు పొట్టి గౌనులలో ఫోజులివ్వడాన్ని చూసిన నెటిజన్లు ఒక్క సారిగా షాక్ అయినంత పనైంది. ఇప్పుడు ఆ అమ్మాయి పొట్టి నల్ల గౌనులో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన కొంత మంది ట్రోల్ troll,చేస్తూ సంప్రదాయంగా హిందూ అమ్మాయిలా ఉండేది ఇప్పుడేంటి ఇలా తయారైందని కామెంట్లు పెడుతున్నారు.
ఒక సాధారణ అమ్మాయిని ఇంతలా ఫేమస్ చేసిన నెటిజన్లు ఇప్పుడు ఆ గౌను బంగారం ను చూసి మనకు తెలియకుండానే ఇంత పెద్ద విషయం మన వల్లనే జరిగిందని మీమ్స్ పెడుతున్నారు. బంగారం నీకు ఒకటి చెప్పనా Bangaram Cheppana ..నువ్వు పాయింట్ వేసుకోవడం మరిచిపోయావని ఒకరు. బంగారం బంగారం అని లేపారు కదా ఇప్పుడు చూడండి ఆమె గౌన్లు….దాకా వచ్చిందని ట్రోల్ చేస్తున్నారు.

రిలాక్స్ బాయ్స్ చెట్టుకు నీరు పోస్తే పువ్వు విరపూసిందని, నేమ్ వస్తే బట్టలు సైజ్ తగ్గుతాయా? అని, తప్పు లేదు కూటి కోసం కోటి విద్యలు మావా, బంగారాన్ని వజ్రంగా మార్చేశారు కదరా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. బంగారం టర్న్ టు సింగారంలా తయారైందని అంటున్నారు. సంప్రదాయానికి నిలువుట్టదంలా ఉండే జ్యోతక్కనే మార్చేశారు ఈవిడ ఒక లెక్కా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయినా మంచి వేషాధారణ లేకపోతే ట్రోల్‌కు గురవ్వడం ఇప్పుడు బంగారం వంతు అయింది. ఆమె వీడియోలు చేసే తొలి రోజుల్లో ఎంతో ఇష్టంగా చూసిన నెటిజన్లు ఇప్పుడు పాప మారిపోయిందని, ఇండస్ట్రీ Industry లో అడుగు పెట్టి ఇలా పొట్టి బట్టలు వేసే స్టేజీకి వచ్చిందని అంటూ కామెంట్లు పెడుతున్నారు. బంగారం ట్రెండింగ్ అయిన సమయంలో ఆమెను ఎన్నో ఛానెళ్లు ఇంటర్వ్యూ కూడా చేశాయి. ఆమె పేద కుటుంబం నుంచి వచ్చిందని చెప్పింది.

Bangaram Cheppana చేసిన వీడియోలు ట్రెండ్ అవ్వడంతో టీవీ షోలలో కూడా పాల్గొంది. జబర్ధస్త్ ప్రోగ్రాంలో కూడా కనిపించింది. బంగారం చెప్పనా అసలు పేరు శ్యామలా. ఆమెది నెల్లూరు జిల్లా ఆత్మకూరు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సెటిల్ అయ్యింది. టిక్‌టాక్ Tiktok, ఇన్స్టాగ్రాం Instagram, లో వీడియోలు పెట్టి పాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. షూటింగ్లలో పాల్గొంటోంది. పదవ తరగతి చదివిన శ్యామలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది.