bandla krishna mohan reddy: ఎప్ప‌టికీ రైతుల ప‌క్ష‌మే తెలంగాణ ప్ర‌భుత్వం

0
11

bandla krishna mohan reddy | తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఎప్పుడూ రైతుల‌కు అండ‌గా ఉంటూ ఆదుకోవాల‌నే చూస్తుంద‌ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ స‌మ‌స్య‌ల‌పై విద్యుత్ శాఖ అధికారుల‌తో మంగళ‌వారం చ‌ర్చించారు. గ‌ద్వాల జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాల‌యానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి స్వ‌యంగా వెళ్లారు. విద్యుత్ స‌మ‌స్య‌ల‌పై జిల్లా విద్యుత్ శాఖ అధికారి భాస్క‌ర్‌తో చ‌ర్చించారు.

అనంతరం ఎమ్మెల్యే(bandla krishna mohan reddy) మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం, సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కొర‌కు ప‌లు ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టార‌ని అన్నారు. ఇందులో భాగంగా రైతుల‌కు 24 గంట‌ల క‌రెంట్ అందిం చ‌డం జ‌రుగుతుంద‌న్నారు. గ‌త కొద్ది రోజులుగా కొన్ని గ్రామాల్లో స‌బ్ స్టేష‌న్లు లో ఓల్టేజీ, ఓవ‌ర్ లోడ్ స‌మ‌స్య‌ల వ‌ల్ల రైతుల‌కు స‌రైన విద్యుత్ స‌దుపాయం లేక వ్య‌వ‌సాయ ప‌నుల‌కు ఇబ్బంది క‌లుగు తుంద‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామ‌ని, ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను పున‌రావృతం కాకుండా చూడాల‌ని కోరిన‌ట్టు తెలిపారు.

యాసంగి పంట‌లో ప్ర‌తి రైతుకు స‌రైన స‌మ‌యానికి విద్యుత్ అందించాల‌ని, వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా నెల రోజుల పాటు ఇలాంటి స‌మ‌స్య‌లు లేకుండా చూడాల‌ని, చివ‌రి ఆయ‌క‌ట్టు వ‌ర‌కు రైతుల‌కు నీరు అందించే విధంగా చేస్తున్నామ‌ని అన్నారు. రైతులు పండించే పంట‌కు విద్యుత్ కొర‌త లేకుండా స‌కాలంలో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం దిశ‌గా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. చింత‌ల‌కుంటా, మ‌ల్లా పురం, నందిన్నె, ఉమిత్యాల స‌బ్ స్టేష‌న్ల ప‌రిధిలో విద్యుత్ అంత‌రాయ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌వ‌ల్సిందిగా డైరెక్ట‌ర్‌తో మాట్లాడామ‌న్నారు.

భ‌విష్య‌త్తులో ఇలాంటి స‌మ‌స్య‌లు పున‌రావృతం కాకుండా చూసుకోవాలని అధికారుల‌ను ఆదేశించిన‌ట్టు తెలిపారు.ఈ స‌మావేశంలో ఎంపీపీ విజ‌య్‌, జెడ్పీటీసీ రాజ‌శేఖ‌ర్‌, టిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు చ‌క్ర‌ధ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest Post  Mahila Bandhu Celebrations: మ‌హిళా బంధు సంబురాల‌కు గులాబీ ద‌ళం రెడీ అవ్వండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here