bandla ganesh Tweet: పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన భీమ్లా నాయక్(Bheemla Nayak) సినిమా శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. సినిమా విడుదల కావడంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తల హంగామా, రచ్చ థియేటర్ల వద్ద మోతమోగింది. భీమ్లా నాయక్ సినిమా విడుదలైన వెంటనే అభిమానులు, ప్రముఖులు బాక్సాఫీసు హిట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం చూసినా భీమ్లా నాయక్ గురించే చర్చలు (bandla ganesh Tweet)జరుగుతున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్‌ను దేవుడిలా ఆరాధించే బండ్ల గణేష్ భీమ్లా సినిమా విడుదలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. మా దేవర నటించిన భీమ్లా నాయక్ దెబ్బకి బాక్సులు బద్దలవ్వాలని, రికార్డులు చిరిగిపోవాలని దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ‘చరిత్ర కోసం మీరు కాదు. మీ కోసం చరిత్ర దేవర’ అంటూ పులి సింబల్‌తో ట్వీట్ చేశారు బండ్ల గణేష్. సాధారణంగా పవన్ కళ్యాన్ సినిమా విడుదలకు ముందు జరిగే వేడుకల్లో కచ్చితంగా బండ్ల గణేష్ పాల్గొనేవారు. ఆయన స్పీచ్‌కు పవన్ అభిమానులు ఫిదా అయిపోయి కేరింతలు కొట్టే వారు.

అయితే గత కొద్ది రోజులుగా భీమ్లా నాయక్ సినిమీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గురించి సోషల్ మీడియాలో బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. బండ్ల గణేష్ భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేదు. ఇందుకు కారణాలు కూడా బయటకు చెప్పలేదు. కానీ భీమ్లా నాయక్ సినిమా విడుదలైన తర్వాత మాత్రం బండ్ల గణేష్ చేసిన ఆసక్తికర ట్వీట్ ఇప్పుడు పవన్ అభిమానులను ఆనంద పరుస్తుంది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!