Bandar Crime News | కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఓ విద్యార్థినిపై లైంగిక దాడి(sexual assault) జరిగినట్టు సమాచారం. తన ప్రియుడితో కలిసి ఓ విద్యార్థిని బీచ్‌కు వెళ్లిన వద్ద ఈ ఘటన జరిగినట్టు ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల సమాచారం మేరకు ఓ విద్యార్థి తన ప్రియుడితో కలిసి మచిలీపట్నంలోని బీచ్ వద్దకు వెళ్లింది. అక్కడ త ప్రియుడితో ముచ్చట్లు ఆడుకుంటుండగా వారి వద్దకు హఠాత్తుగా ఇద్దరు మందు బాబులు వచ్చారు.
Bandar Crime News
అయితే ప్రియుడిని ఇద్దరులో ఒకరు బెదిరించి తాళ్ళతో చెట్టుకు కట్టేశాడు. వారిలో మరొకరు మద్యం తాగి విద్యార్థినిపై బలవంతంగా లైంగిక దాడి జరిపినట్టు తెలుస్తోంది. జరిగిన దాడిని ఎవరికీ చెప్పుకోలేక మిన్నుకుండి పోయిన ప్రేమికులు. అయితే విద్యార్థిని మదన పడుతుండగా గమనించిన తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయాన్ని బాధితురాలు తెలిపింది. వెంటనే పోలీసులను ఆశ్రయించగా బందర్ రూరల్ పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి పోసిన నాగబాబు అని తెలిసింది. వెంటనే రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బందర్ బీచ్‌లో లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగు లోకి రావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం వాసులు ఆందోళనకు గురయ్యారు. బీచ్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు వారు నిత్యం పహరా ఉండాలని కోరుతున్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!