banana ice cream recipe: మన ఇంటిలో పిల్లలకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టపడతారు. బయటకు వెళ్ళినప్పుడు కూడా ఐస్‌క్రీం అడుగుతుంటారు. కొన్ని సార్లు బయట ఐస్‌క్రీమ్ వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. అలాంటప్పుడు ఇంటిలోనే మనం ఐస్‌క్రీం చేసి పెడితే పిల్లలకు ఆరోగ్య సమస్యలు లేకుండా చూడవచ్చు. కావాల్సినప్పుడు తయారు చేసుకొని ఇంటిల్లపాది రుచిచూడవచ్చు. అరటి పండుతో ఐస్‌క్రీమ్ (banana ice cream) ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
పాలు – లీటరు
ఐస్‌క్రీం పౌడర్ – 60 గ్రా.
క్రీమ్ – 500 మి.లీ.
పంచదార – 200 గ్రా.
అరటిపండ్లు – 6 (అరడజను)
తయారు చేయు విధానం(ice cream recipe)
ముందుగా పాలను వేడి చేసుకోవాలి. చిన్న కప్పులో కాసిన్ని పాలు తీసుకుని ఐస్‌క్రీం పౌడర్‌ను ఉండలు కట్టకుండా కలిపి మిగిలిన పాలల్లో పోయాలి. దీంతో పాటు పంచదారను, క్రీమ్‌ను, అరటిపండ్ల గుజ్జును కూడా ఉడుకుతున్న పాలల్లో వేసి కాసేపు వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని కాస్త చిక్కబడి చల్లారిన తర్వాత ఐస్‌ట్రేలలోకి మార్చి డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. అలా ఐస్ ట్రేలో పెట్టిన మిశ్రమం ఐస్ క్యూబుల్లా గట్టిగా మారుతుంది. తర్వాత ఈ క్యూబ్‌ను తీసి నీళ్లు పోయకుండా మిక్సిలో వేసి మెత్తగా రుబ్బాలి. మళ్లీ ఈ మిశ్రమాన్ని ట్రేలో పెట్టి నాలుగు గంటలు డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి. మళ్లీ దాన్ని తీసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బితే చల్లచల్లగా నురగలు గక్కుతుండే బనానా ఐస్‌క్రీమ్ సిద్ధమైనట్టే. ఈ హాట్ హాట్ సమ్మరలో రుచికరమైన, పోషక విలువలు గల బనానా ఐస్‌క్రీమ్‌ను లాగించేయొచ్చు.

