Madanapalle incident : ఆ త‌ల్లిదండ్రుల‌కు బెయిల్ మంజూరు

0
89
views

Madanapalle incident : తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె అక్కాచెల్ల‌ళ్ల హ‌త్య కేసు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఈ హ‌త్య‌లో నిందితులుగా ఉన్న త‌ల్లిదండ్రులకు బెయిల్ మంజూరు అయిన‌ది.


Madanapalle incident : దేశంలోనే సంచ‌ల‌నం సృష్టించిన మ‌ద‌న‌ప‌ల్లె జంట హ‌త్య‌ల కేసు అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. మూఢ న‌మ్మ‌కాల‌తో చ‌దువుకున్న త‌ల్లిదండ్రులు సొంత‌ కూతుళ్ల‌నే హ‌త్య చేశారు. ఈ కేసు విష‌య‌మై మంగ‌ళ‌వారం మ‌ద‌న‌ప‌ల్లె 2వ అద‌న‌పు జిల్లా జ‌డ్జి వారికి బెయిల్ మంజూరు చేశారు. మ‌ద‌న‌ప‌ల్లె తాలూకా పోలీసులు ఈ ఏడాది జ‌న‌వ‌రి 26న ప‌ద్మ‌జ‌, పురుషోత్తంల‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అయితే ప్ర‌స్తుతం ఆ దంప‌తులు మ‌ద‌న‌ప‌ల్లె స్పెష‌ల్ స‌బ్‌జైల్ లో ఉంటున్నారు. ఈ హ‌త్య కేసు మంగ‌ళ‌వారం హియ‌రింగ్‌కి రాగా కోర్టు నిందితుల‌కు బెయిల్ మంజూరు చేస్తున్న‌ట్టు వెల్ల‌డించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని మ‌ద‌న‌ప‌ల్లెలో జ‌రిగిన జంట హ‌త్య‌ల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. మద‌న‌ప‌ల్లె స్థానిక శివ‌న‌గ‌ర్‌లో పురుషోత్తం నాయుడు, ప‌ద్మ‌జ దంప‌తులు గ‌త కొంత కాలంగా నివాస‌ముంటున్నారు. పురుషోత్తం నాయుడు మ‌హిళా డిగ్రీ క‌ళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా, ఆయ‌న భార్య ప‌ద్మ‌జ ఓ ప్రైవేటు విద్యాసంస్థ క‌ర‌స్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌గా ప‌నిచేస్తున్నారు. వీరికి ఇద్ద‌రు కుమార్తెలు, అలేఖ్య‌(27), సాయి దివ్య‌(23). పెద్ద కుమార్తె అలేఖ్య ఉద్యోగం చేస్తూ, ఇటీవ‌ల రాజీనామా చేసింది. ప్ర‌స్తుతం ఆమె సివిల్స్‌కు సిద్ధ‌మ‌తుండ‌గా, రెండో కుమార్తె సాయిదివ్య ఎంబీఏ పూర్తి చేసి చెన్నైలోని ఏఆర్ ఇనిస్టిట్యూట్ లో మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తోంది.

File Photo

వాస్త‌వానికి మెహ‌ర్‌బాబా, ఓషో భ‌క్తులైన పురుషోత్తం నాయుడు, భార్య ప‌ద్మ‌జ త‌మ కుమార్తెల‌ను కూడా భ‌క్తులుగా మార్చారు. ఈ క్ర‌మంలోనే పురుషోత్తం నాయుడు ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చింది. తాను వారం రోజుల పాటు దీక్ష‌లో ఉంటాన‌ని, త‌న‌కు ఎవ‌రూ ఫోన్ చేయొద్దంటూ కొలీగ్స్‌తో చెప్పాడు. దాదాపు 10 రోజుల నుంచి ఇంట్లో పూజ‌లు జ‌రుగుతున్నాయ‌ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కూడా ఇంటికి వ‌చ్చి వెళ్తున్నార‌ని స్థానికులు పోలీసుల‌తో పేర్కొన్నారు. మూఢ విశ్వాసాల‌లో మునిగిన దంప‌తులిద్ద‌రూ ఆదివారం కూతుళ్ల‌తో క‌లిసి పూజ‌లు చేయ‌డం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో త‌ల్లి ప‌ద్మ‌జ భ‌ర్త ఎదుట పూజ‌గ‌దిలో చిన్న కుమార్తె సాయి దివ్య‌ను శూలంతో పొడిచి, పెద్ద‌కుమార్తె అలేఖ్య‌ను డంబెల్‌తో నుదిటిపై మోది చంపింది. ఆ త‌ర్వాత తండ్రి పురుషోత్తం క‌ళాశాల‌లో ప‌నిచేస్తున్న త‌న మిత్రుడుకి ఫోన్ చేసి జ‌రిగిన విష‌య‌మంతా చెప్పాడు. దీంతో ఈ ఘోరం వెలుగులోకి వ‌చ్చింది. అప్ప‌ట్లో ఘ‌ట‌న తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. మూఢ‌న‌మ్మ‌కాల‌తో అత్యున్న‌త విద్యావంతులైన త‌ల్లిదండ్రులు ఇలా చేయ‌డం ప‌ట్ల స‌మాజం దిగ్భాంతి వ్య‌క్తం చేసింది.

Share Link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here