Bahujana Rajyadhikara Yatra: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతమైన పోస్టుకు రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో బహుజన వాదంతో ప్రజల్లోకి వచ్చిన బహుజన సమాజ్ పార్టీ నాయకుడు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సుదీర్ఘ మైన యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో గడప గడపనూ తట్టేలా జనగాం నుంచి రాజ్యాధికార యాత్ర ప్రారంభించనున్నారు. ఈ మేరకు జోగులాంబ గద్వాల జిల్లా శాంతి నగర్లో ఆయన (Bahujana Rajyadhikara Yatra)పర్యటించారు.
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్. రాష్ట్రంలో దొరల పాలనను అంతమొందించేందుకు, ఇటు బడాబాబులకు, ధనికులకు అండగా బీజేపీ పాలన వ్యవస్థ వ్యతిరేకంగా తన సర్వీసును వదులుకొని బహుజనుల కోసం పోరాడేందుకు వచ్చానని తెలిపారు.
సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తితో బహుజనుల కోసం బీఎస్పీలో చేరానని అన్నారు. మార్చి 6వ తేదీ నుంచి జనగాం జిల్లా కిలాషాపూర్ నుంచి రాజ్యాధికార యాత్ర చేపడుతున్నట్టు ఆర్ఎస్పీ ప్రకటించారు. ఈ రాజ్యాధికార యాత్ర 300 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధనిక వర్గాలు, ఆధిపత్య వర్గాలు ఆస్తులు పెంచుకుంటున్నాయని విమర్శించారు.

5 లక్షల మంది రైతులకు రూ.40 వేల కోట్లు ఇచ్చి 55 లక్షల పేద రైతులకు రూ.10 వేల కోట్లు ఇస్తున్నారని ప్రవీణ్ అననారు. భూస్వాముల పథకం పేరుతో 80 శాతం మంది భూ స్వాములకు, 20% మంది పేద రైతులకు మాత్రమే వర్తిస్తోందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారు బీఎస్పీలోకి వెళతారనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని మొక్కుబడిగా ప్రవేశపెట్టారని అన్నారు. టిఆర్ఎస్కు ప్రజల్లో వ్యతిరేకత ఉందనే రూ.600 కోట్లు ఇచ్చి పీకే టీంను సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ